అన్వేషించండి

Kumari Aunty: షాకుల మీద షాకులు తగులుతున్నాయ్, భ‌క్తికి, ముక్తికి చ‌దువులెందుకు? కుమారి ఆంటీ పవర్ ఫుల్ స్పీచ్

Kumari Aunty: 'రెండు లివ‌ర్లు ఎక్స్ ట్రా' అంటూ సోష‌ల్ మీడియాని షేక్ చేసింది కుమారీ ఆంటీ. ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయింది. ఈవెంట్ల‌లో పాల్గొంటోంది. ఇక ఇప్పుడు ఆమె ఇచ్చిన స్పీచ్ వైర‌ల్ అవుతోంది.

Kumari Aunty Superb Speech in Telugu DMF Event : సోష‌ల్ మీడియా.. ఎంతోమందిని స్టార్స్ ని చేసింది. ఒక‌ప్పుడు ఎవ‌రో తెలియ‌ని వాళ్ల‌ని ఇప్పుడు సెల‌బ్రిటీల‌ను చేసింది. క‌ష్టాన్ని న‌మ్ముకుంటే, ప్యాష‌న్ తో ప‌నిచేస్తే స‌క్సెస్ సాధించ‌వ‌చ్చు అని నిరూపించారు . అలా సోష‌ల్ మీడియా స్టార్లు అయ్యారు ఎంతోమంది. ఇటీవ‌ల కాలంలో.. "మీది వెయ్యి అయ్యింది.. రెండు లివ‌ర్లు ఎక్స్ ట్రా" అనే ఒక్క డైలాగ్ తో ఫేమ‌స్ అయ్యారు కుమారీ ఆంటీ. అనుకోని విధంగా.. స్ట్రీట్ ఫుడ్ అమ్మే స్థాయి నుంచి ఇప్పుడు స్టేజ్ మీద ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ ఇచ్చే స్థాయికి ఎదిగారు ఆమె. తెలుగు డిజిటిల్ మీడియా ఫెడ‌రేష‌న్ ఆరిజిన్ డే సంద‌ర్భంగా ఆమె స్టేజ్ మీద ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. 

కుమారీ ఆంటీ సూప‌ర్ స్పీచ్.. 

డిజిటిల్ మీడియాను ఒక తాటిపైకి తెచ్చేందుకు, కంటెంట్ క్రియేటర్లకు అండగా నిలిచేందుకు డిజిటల్ మీడియా ఫెడ‌రేష‌న్ వెబ్ సైట్ ను ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఇక ఇప్పుడు దానికి సంబంధించి ఆరిజిన్ డే వేడుక‌లు నిర్వ‌హించారు. ఆ కార్య‌క్ర‌మంలో ఎంతోమంది సోష‌ల్ మీడియా స్టార్స్ కూడా పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈ మ‌ధ్య ఫేమ‌స్ అయిన కుమారి ఆంటీ పాల్గొని స్టేజ్ మీద స్పీచ్ దంచికొట్టారు. ఆమె మాట్లాడిన మాట‌ల‌కు అక్క‌డికి వచ్చిన సెల‌బ్రిటీలు సైతం ఫిదా అయి.. క్లాప్స్ కొట్టారు. ఆమె ఏం మాట్లాడారంటే? 

"షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి నాకు. ఇంత పేరు వ‌స్తుంద‌ని ఊహించ‌లేదు అస‌లు. అంద‌రికీ పేరు పేరున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. నేను ఎక్క‌డ ఉంటానో, ప్ర‌పంచం అంటే ఏంటో తెలియ‌ని న‌న్ను ఇక్క‌డ వ‌ర‌కు, ఇంత మంది ముందుకు తీసుకొచ్చారు. నిజంగా సోష‌ల్ మీడియాకి థ్యాంక్యూ. న‌న్ను స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికి పేరు పేరున ధ‌న్య‌వాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఆత్మ‌విశ్వాసం ఉంటే ఎలాగైనా ముందుకు వెళ్లొచ్చు. చ‌దువు లేద‌ని బాధ‌ప‌డేదాన్ని. అప్పుడు మా అమ‌మ్మ‌, నాన్న‌మ్మ ఒక‌టి చెప్పారు. చ‌దువులేద‌ని బాధ‌ప‌డొద్దు. భ‌క్తికి, ముక్తికి చ‌దువులెందుకు? ఆత్మ శాంతి ఉంటే చాలు అదే దైవ‌ము. చెరువులోన చేప‌కు ఎవ‌రు ఈత నేర్పెను?  బావిలోని క‌ప్ప‌కు ఎవ‌రు భాష నేర్పెను? అడ‌విలోని హంస‌కు ఎవ‌రు పాట నేర్పెను? చెట్టు మీద కోయిల‌కు ఎవ‌రు కూత నేర్పెను? పుట్ట‌లోని పాముకు ఎవ‌రు బుస‌లు నేర్పెను? పుట్టిన బాలుడికి ఎవ‌రు ఏడుపు నేర్పిరి? అని నాకు ధైర్యం చెప్పారు. ఇవే కాదు చాలా మంచి మాట‌లు చెప్పారు’’ అని తెలిపారు.

‘‘చ‌దువు ఒక్క‌టే కాదు. నీ ఆత్మవిశ్వాసం, ప‌ని త‌నంతో, చేసిన‌దానికి ప్ర‌తిఫ‌లం ఆశించ‌కుండా ముందుకు వెళ్తే మంచి జ‌రుగుతుంద‌ని అన్నారు. నిజంగా నేను ఇప్పుడు ఇలా ఊహించుకోలేదు. పెద్ద‌ల మాట వింటే ఎప్ప‌టికైనా విజ‌యం సాధిస్తామ‌ని నా విష‌యంలో నిజం అయ్యింది. అందుకే, నేను చెప్పేది ఏంతంటే? పెద్ద‌ల మాట‌ వింటే విజ‌య‌మే కానీ, అప‌జ‌య‌మే ఉండదు" అంటూ త‌న స్పీచ్ ముగించారు కుమారీ ఆంటీ. దీంతో ఆమె మాట‌ల‌కు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయిపోయారు. క్లాప్స్ కొడుతూ సూప‌ర్ సూప‌ర్ అంటూ కేక‌లు వేశారు. కుమారీ ఆంటీ స్పీచ్ విన్న సుమ కూడా ఆశ్చ‌ర్య‌పోయారు. "రెండు లివ‌ర్లు ఎక్స్ ట్రా అంటూ మొద‌లుపెట్టి, ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి వెళ్తున్నారు? త్వ‌ర‌లోనే వెల్ బీయింగ్ కి సంబంధించిన వీడియోలు తీసినా అంద‌రం వినేలా ఉన్నాం. మీరు నిజంగా ట్రూ ఇన్ స్పిరేష‌న్ కుమారీగారు" అంటూ ఆమెను పొగిడారు యాంక‌ర్ సుమ‌. 

ఐటీసీ కోహినూరు ప‌క్క‌న‌, ఒక చిన్న ఫుడ్ స్టాల్ న‌డుపుతున్నారు కుమారీ ఆంటీ. రోజు వంద‌లాది మంది ఆమె ఫుడ్ ను టేస్ట్ చేస్తుంటారు. అలా అంద‌రూ ఆమె గురించి యూట్యూబ్ లో పెట్ట‌డంతో ఫేమ‌స్ అయిన విష‌యం తెలిసిందే. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వ‌యంగా ఆమె ఫుడ్ స్టాల్ కి వెళ్లి ఫుడ్ తింటాన‌ని కూడా చెప్పారు. దీంతో ఆమె ఇంకా ఫేమ‌స్ అయిపోయారు. అప్పటి నుంచి రియాల్టీ షోల్లో, టీవీ సీరియ‌ల్స్ లో కూడా ఆమె పాల్గొంటూ ఫేమ‌స్ అయిన విష‌యం తెలిసిందే. నిజానికి ఎంతోమందికి ఇన్ స్పిరేష‌న్ కుమారీ ఆంటీ. 

Also Read: మే 3న ప్రేక్ష‌కుల ముందుకు ‘జితేందర్ రెడ్డి’

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియోఅమెరికాలో తెలుగు యూత్ పాడు పని! కేటీఆర్, బండి సంజయ్‌ అనుచరులేనా?Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Shiva Rajkumar: క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
Air India Wifi : ఎయిర్ ఇండియా ప్యాసింజర్స్ కు గుడ్ న్యూస్.. దేశీయ విమానాల్లో ఫ్రీగా వై-ఫై సేవలు
ఎయిర్ ఇండియా ప్యాసింజర్స్ కు గుడ్ న్యూస్ - దేశీయ విమానాల్లో ఫ్రీగా వై-ఫై సేవలు
Atul Subhash: ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
Embed widget