By: ABP Desam | Updated at : 11 Sep 2022 06:34 AM (IST)
కృష్ణం రాజు
ప్రభాస్ (Prabhas) కు ఏమైంది? సోషల్ మీడియాలో ఈ రోజు ఒక వీడియో చక్కర్లు కొట్టడంతో చాలా మందికి వచ్చిన సందేహం ఇది. సాధారణంగా హీరోలు ఎక్కడికి వెళ్ళినా... ఈ మధ్య ఫ్యాన్స్ వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు. అభిమానులకు ఆ వీడియోలు ఆనందాన్ని ఇస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే... ఒక ఆస్పత్రిలో ప్రభాస్ ఉన్న వీడియో వైరల్ కావడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. తమ అభిమాన హీరోకు ఏమైందని ఆందోళన చెందారు.
కృష్ణం రాజును చూడటానికి ఆస్పత్రికి వెళ్లిన ప్రభాస్!
ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు (Krishnam Raju) హైదరాబాద్ సిటీలోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన్ను చూడటానికి ప్రభాస్ వెళ్లినట్లు సమాచారం. ఇది తెలిసిన ఫ్యాన్స్‌కు మరో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. కృష్ణం రాజుకు ఏమైంది? అని ఆందోళన చెందుతున్నారు.
కృష్ణం రాజుకు తీవ్ర అస్వస్థత
ఇప్పుడు కృష్ణం రాజు వయసు 80 ఏళ్ళు దాటింది. వయసు రీత్యా కొన్ని సమస్యలు రావడం సహజమే. వయోభారం వల్ల వచ్చిన అనారోగ్యం కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని రెబల్ స్టార్ ఫ్యామిలీ వర్గాలు తెలిపినా... ఆయన ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తోంది.
'రాధే శ్యామ్'లో అబ్బాయ్ ప్రభాస్‌తో కలిసి నటించిన కృష్ణం రాజు... ఆ తర్వాత నుంచి సినిమాలు, నటనకు దూరంగా ఉంటున్నారు. ఆ సినిమాలో కూడా కేవలం ప్రభాస్ కోసమే నటించారు.
పాన్ వరల్డ్ సినిమాలతో ప్రభాస్ బిజీ!
ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... సంక్రాంతికి 'ఆదిపురుష్' (Adipurush Movie) తో ఆయన థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేశారు. ప్రభు రామ్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్న ఈ సినిమాలో సీతగా కృతి సనన్ చేశారు. లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.
Also Read : 'హైపర్' ఆది ఈజ్ బ్యాక్ - 'జబర్దస్త్' రీ ఎంట్రీలో సుడిగాలి సుధీర్, రష్మీపై సెటైర్
ఇప్పుడు 'కె.జి.యఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతీ హాసన్ కథానాయిక. ఇది కాకుండా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ కూడా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్, దిశా ప్యాట్నీ, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఆ రెండూ పాన్ ఇండియన్ కాదు... పాన్ వరల్డ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్న సినిమాలు. 'ఆదిపురుష్'ను కూడా ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వినికిడి.
ఒకవైపు భారీ సినిమాలు చేస్తున్న ప్రభాస్... మరోవైపు మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలకు పూర్తి భిన్నమైన సినిమాగా అది ఉండబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read : 'వకీల్ సాబ్', 'నాంది' రూటులో 'గీత సాక్షిగా'
Silk Smitha Biopic: సిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ
T Series Bhushan Kumar: టీ-సిరీస్ అధినేతకు బిగ్ రిలీఫ్, అత్యాచారం కేసును ఎత్తివేసిన న్యాయస్థానం
Extra Ordinary Man: ఎక్స్‌ట్రా మాస్ - శ్రీ లీలతో డ్యాన్స్ ఇరగదీసిన నితిన్!
Animal 1st Day Collections: బాక్సాఫీస్ దగ్గర ‘యానిమల్’ రోరింగ్, రణబీర్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్, ఎన్ని కోట్ల వసూళ్లంటే?
Radhika Apte: ఒక్క సీన్, రెండు రాత్రలు - అతడి కోసం తప్పలేదన్న రాధికా ఆప్టే!
Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు
Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు
Fact Check: కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో పాకిస్థాన్ జెండా అంటూ వీడియో వైరల్ - ఇందులో నిజమెంత?
TVS iQube Sales: టీవీఎస్ బైకులకు పెరుగుతున్న డిమాండ్ - ఏకంగా 67 శాతం వరకు పెరిగిన అమ్మకాలు!
/body>