News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Krishna Health Updates Live: మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్, విషమంగా కృష్ణ ఆరోగ్యం - హాస్పిటల్‌లోనే ఘట్టమనేని కుటుంబ సభ్యులు

సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

FOLLOW US: 
మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్, పరిస్థితి ఇంకా విషమయంగానే ఉంది: డాక్టర్లు

తీవ్ర అస్వస్థతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సూపర్ స్టార్ కృష్ణ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆయన ఇంకా వెంటిలేటర్ మీదే ఉన్నారని, ఉదయం నుంచి ఆయన అపస్మారక స్థితిలోనే ఉన్నారని వెల్లడించారు. 8 మంది డాక్టర్లు ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కృష్ణ కుటుంబ సభ్యులు ప్రైవేట్ రూమ్‌లో ఉన్నారని, మధ్య మధ్యలో ఆయన్ని చూసి వెళ్తున్నారన్నారని డాక్టర్ గురునాథ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఇంకా క్రిటికల్ స్టేజ్‌లోనే ఉన్నారని తప్పా.. ఇంకా ఇప్పుడేమీ చెప్పలేమని అన్నారు. కృష్ణ మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయని తెలిపారు. తమ హాస్పిటల్‌లో దగ్గర అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు.

ఇంకా విషమంగానే కృష్ణ ఆరోగ్యం, 48 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేం: నరేష్

సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై ఆయన కుమారుడు నరేష్ స్పందించారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన నరేష్ మీడియాకు పలు వివరాలు తెలియజేశారు. ‘‘నాన్నగారి పరిస్థితి నిలకడగా ఉంది. 48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేం.  ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. కాస్త శ్వాస తీసుకుంటున్నారు.  నాన్నగారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే వ్యక్తి. ఆయనకు ఎటువంటి ఆయనకు అనారోగ్య సమస్యలు లేవు. రియల్ లైఫ్, రీల్ లైఫ్‌లో రెండు కూడా డేరింగ్ డ్యాషింగ్ ఆయన. ఆయన ఎన్నో పోరాటాలను ఎదుర్కొన్నారు. ఇండస్ట్రీ లో ఒక రెవల్యూషన్ ను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ప్రాణాల కోసం ఫైట్ చేస్తున్నారు. త్వరగా కొలుకుంటారని ఆశిస్తున్నాం. మీ అందరి ప్రార్ధనలే కృష్ణ గారిని కాపాడుతాయి’’ అని తెలిపారు. 

కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమం

కృష్ణ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, వెంటీలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. 24 గంటల తర్వాత మరో హెల్త్ బులిటిన్ ఇస్తామని అన్నారు. కృష్ణ కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చేరారని వెంటనే ఆయనకు చికిత్స అందించామని, ఇంకా పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు వెల్లడించారు. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తుందా లేదా అనేది ఇప్పట్లో చెప్పలేమన్నారు. 

Background

సూపర్ స్టార్ కృష్ణ (Krishna Ghattamaneni) తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో సోమవారం ఉదయం ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఉన్నారు. దాంతో ఘట్టమనేని, మహేష్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణ కొన్ని రోజులుగా కృష్ణ బయటకు రావడం లేదు. వయసు రీత్యా ఆయనకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అందువల్ల, ఎక్కువగా ఇంటికి పరిమితం అవుతున్నారు. గతంలో మహేష్ బాబు సినిమా ఫంక్షన్స్‌కు అటెండ్ అయ్యేవారు. ఈ మధ్య అది కూడా లేదు. ఫంక్షన్స్ గట్రా అవాయిడ్ చేస్తున్నారు. హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

కృష్ణకు ఆస్థమా ఉందని, వాతావరణంలో మార్పులు రావడంతో కొద్దిగా నలత చేసిందని, అందువల్ల ఆస్పత్రికి తీసుకు వెళ్లారని తెలుస్తోంది. అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కృష్ణ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రెగులర్ చెకప్ కోసమే కృష్ణ ఆసుపత్రికి వెళ్లారని ఘట్టమనేని ఫ్యామిలీ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణకు ఏం కాలేదని, 24 గంటల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తారని నటుడు వీకే నరేష్ తెలిపారు.

కుటుంబం అంటే కృష్ణకు ఎక్కువ ప్రేమ. ముఖ్యంగా పిల్లలు అంటే ఆయనకు పంచ ప్రాణాలు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరున కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్ను మూశారు. ఏడాది ప్రారంభంలో కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించారు. భార్య, కుమారుడి మరణం ఆయనను బాధకు గురి చేసిందని సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం. 

కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు ఐదుగురు సంతానం. పెద్దమ్మాయి పద్మావతిని గల్లా జయదేవ్‌కు ఇచ్చి వివాహం చేశారు. రెండో అమ్మాయి మంజుల నటిగా, నిర్మాతగా ప్రేక్షకులకు తెలుసు. ఆమె భర్త సంజయ్ స్వరూప్ నటుడు. మూడో అమ్మాయి ప్రియదర్శిని యువ హీరో సుధీర్ బాబుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ సోదరుడు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేశారు. ఇక, మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో సూపర్ స్టార్‌గా, తండ్రి తగ్గ తనయుడిగా స్టార్ డమ్ కొనసాగిస్తున్నారు. మే 31న కృష్ణ బర్త్ డే. ఆ రోజు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. అందరితో కలిసి భోజనం చేశారు. కృష్ణ బర్త్ డే స్పెషల్ గా ఆయన్ను కుమార్తె మంజుల ఇంటర్వ్యూ చేశారు. 

కాస్త శ్వాస తీసుకుంటున్నారు, వెంటిలేటర్‌పై ఉన్నారు: నరేష్
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై ఆయన కుమారుడు నరేష్ స్పందించారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన నరేష్ మీడియాకు పలు వివరాలు తెలియజేశారు. ‘‘నాన్నగారి పరిస్థితి నిలకడగా ఉంది. 48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేం.  ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. కాస్త శ్వాస తీసుకుంటున్నారు.  నాన్నగారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే వ్యక్తి. ఆయనకు ఎటువంటి ఆయనకు అనారోగ్య సమస్యలు లేవు. రియల్ లైఫ్, రీల్ లైఫ్‌లో రెండు కూడా డేరింగ్ డ్యాషింగ్ ఆయన. ఆయన ఎన్నో పోరాటాలను ఎదుర్కొన్నారు. ఇండస్ట్రీ లో ఒక రెవల్యూషన్ ను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ప్రాణాల కోసం ఫైట్ చేస్తున్నారు. త్వరగా కొలుకుంటారని ఆశిస్తున్నాం. మీ అందరి ప్రార్ధనలే కృష్ణ గారిని కాపాడుతాయి’’ అని తెలిపారు. 

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్