Niharika NM: గూగుల్‌ను వదిలి కంటెంట్ క్రియేషన్ వైపు - కేన్స్ వరకు చేరిన నీహారిక - నెల సంపాదన ఎంతంటే?
Who is Niharika NM: కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు వరుసగా మూడోసారి వెళ్లిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ నీహారిక ఎవరు? ఆమె నెల సంపాదన ఎంత? గూగుల్ జాబ్ రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి?
![Niharika NM: గూగుల్‌ను వదిలి కంటెంట్ క్రియేషన్ వైపు - కేన్స్ వరకు చేరిన నీహారిక - నెల సంపాదన ఎంతంటే? Know About Niharika NM Who Rejects Google Job Offer Becomes Fulltime Content Creator Check Details Niharika NM: గూగుల్‌ను వదిలి కంటెంట్ క్రియేషన్ వైపు - కేన్స్ వరకు చేరిన నీహారిక - నెల సంపాదన ఎంతంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/27/3c481689165d8ac25ac469a77e93fd771716807830699252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Niharika NM Monthly Income: ప్రముఖ ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ నీహారిక కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో మూడో సారి మెరిశారు. నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్ హిట్టయిన ‘బిగ్ మౌత్’ అనే యానిమేటెడ్ సిట్‌కాంలో ఒక పాత్రకు నీహారిక గాత్రదానం చేశారు. దీంతో ఆ సిరీస్ ప్రమోషన్ కోసం ఆమె కేన్స్‌కు వెళ్లారు. కన్న కలల కోసం కష్టపడితే జీవితంలో ఎక్కడికో ఎదగవచ్చనడానికి నీహారిక జీవితం ఒక చక్కటి ఉదాహరణ.
గూగుల్‌లో జాబ్‌కు నో...
బెంగళూరులో పుట్టి పెరిగిన నీహారిక బీఎంఎస్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఎంబీఏ చేయడానికి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఛాప్‌మన్ యూనివర్సిటీకి వెళ్లారు. ఎంబీఏ పూర్తి చేశాక నీహారికకు గూగుల్‌లో మంచి ప్యాకేజీతో జాబ్ వచ్చింది. కానీ నీహారిక గూగుల్ ఆఫర్‌కు నో చెప్పారు. కంటెంట్ క్రియేషన్‌ను ఫుల్ టైమ్ కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. తను తీసుకున్న మొదటి పే చెక్... గూగుల్ ఇచ్చే శాలరీ కంటే చాలా ఎక్కువ.
నీహారికకు ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. హైప్ఆడిటర్ అనే సంస్థ 1 మిలియన్‌కు పైగా ఫాలోయర్లు ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఒక సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఒక మిలియన్ ఫాలోయర్లు ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్ సగటున నెలకు 15,356 డాలర్లను సంపాదిస్తారు. దీన్ని బట్టి చూస్తే నీహారిక నెల సంపాదన చాలా సులభం నెలకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్యలో ఉండవచ్చు.
View this post on Instagram
మూడు డిగ్రీలు ఉన్నాయి... ఒక్క కారణం కూడా లేదు...
కరోనా వైరస్ పాండమిక్ దాదాపుగా ముగుస్తున్న సమయంలో తనకు గూగుల్ నుంచి జాబ్ ఆఫర్ వచ్చిందని నీహారిక అన్నారు. ఈ ఆఫర్‌ని రిజెక్ట్ చేయడానికి గల కారణం కూడా తెలిపారు. గూగుల్‌లో ఉద్యోగం చేయాలన్నది తన తల్లిదండ్రుల కల కానీ... తన కల కాదన్నారు. తాను ఇప్పటివరకు మూడు డిగ్రీలు చేసింది కానీ వాటిని చేయడానికి తనకు ఇప్పుడు ఒక్క కారణం కూడా కనిపించడం లేదన్నారు.
త్వరలో హీరోయిన్‌గా...
నీహారిక సినిమా ప్రమోషన్లు కూడా చేస్తూ ఉంటారు. ‘మేజర్’ సినిమా కోసం ఆమె చేసిన రీల్ చాలా వైరల్ అయింది. అలాగే త్వరలో హీరోయిన్‌గా కూడా మారనున్నారట. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించారు. ప్రముఖ తమిళ హీరో అథర్వ మురళి సరసన నీహారిక హీరోయిన్‌గా కనిపించనున్నారు. కోలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో వెండితెరపై కూడా నీహారిక ఆడియన్స్‌ను పలకరించనున్నారు.
View this post on Instagram
Also Read: అలాంటివి ఇండస్ట్రీలో నార్మల్ అయిపోయాయి, ఇకపై అవే చేస్తా - కాజల్ అగర్వాల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)