KGF 2 Box Office: 'కేజీఎఫ్2' నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
నాలుగు రోజుల్లో 'కేజీఎఫ్2' సినిమా రూ.500 కోట్ల క్లబ్ లో చేరింది.

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్2' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రాకీభాయ్ క్రేజ్ కి బాక్సాఫీస్ షేక్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అత్యధిక వసూళ్లను సాధిస్తోంది ఈ సినిమా. వీకెండ్ లో భారీ వసూళ్లను సాధించి రికార్డ్స్ సృష్టించింది 'కేజీఎఫ్2'.
నాలుగు రోజుల్లో ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.546 కోట్లను వసూలు చేసింది. హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. కర్ణాటకలో రూ.91కోట్లు, ఏపీ-తెలంగాణలో కలిపి రూ.84.80 కోట్లు, తమిళనాడులో రూ.32.10 కోట్లు, కేరళలో రూ.29.05 కోట్లు, ఓవర్సీస్ లో దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.
మొత్తం కలుపుకుంటే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.546 కోట్ల గ్రాస్ ను సాధించింది. నాలుగు రోజుల్లో ఈ సినిమా ఇంత వసూలు చేసిందంటే.. లాంగ్ రన్ లో ఇంకెంత సాధిస్తుందో చూడాలి. ఎలివేషన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, టేకింగ్, స్క్రీన్ ప్లే ఇలా ప్రతి ఎలిమెంట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది.
Also Read: ఎన్టీఆర్ కోసం అలాంటి కథనే రాశా - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Also Read: 'భలే భలే బంజారా' సాంగ్ - సిరుత పులులు కలిసి సిందేస్తే
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















