అన్వేషించండి
Balakrishna: అన్నాచెల్లెళ్ల ఈగో వార్, బాలయ్య సినిమాలో మెయిన్ పాయింట్ ఇదే
అన్న మీద కోపంతో సొంత చెల్లెలే అతడిని చంపడం.. ఆ తరువాత విదేశాల్లో పెరిగే మేనల్లుడు అయిన హీరోని కూడా చంపేయాలని ప్రయత్నించడం వంటి పాయింట్ ఈ కథను రాసుకున్నారట.
![Balakrishna: అన్నాచెల్లెళ్ల ఈగో వార్, బాలయ్య సినిమాలో మెయిన్ పాయింట్ ఇదే Key Element in Balakrishna, Gopichand Malineni's Film Balakrishna: అన్నాచెల్లెళ్ల ఈగో వార్, బాలయ్య సినిమాలో మెయిన్ పాయింట్ ఇదే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/02/5a4af02c9e4464a449eaf40a5671a27e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బాలయ్య సినిమాలో మెయిన్ పాయింట్ ఇదే
'అఖండ' సినిమాతో సక్సెస్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లాలో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరిస్తున్నారు. సినిమాలో బాలయ్య లుక్ ని సైతం రివీల్ చేశారు. మాస్ లుక్ లో అలరించారు బాలయ్య.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన కథపై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. శివరాజ్ కుమార్ నటించిన ఓ కన్నడ సినిమా రీమేక్ అంటూ ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. ఆ కన్నడ సినిమా రీమేక్ వేరే వాళ్లు తీసుకున్నారట. ఇక ఈ సినిమా మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా..? అన్నాచెల్లెళ్ల మధ్య నడిచే ఈగో వార్ నేపథ్యంలో సినిమా నడుస్తుందని సమాచారం.
అన్న మీద కోపంతో సొంత చెల్లెలే అతడిని చంపించేయడం.. ఆ తరువాత విదేశాల్లో పెరిగే మేనల్లుడు అయిన హీరోని కూడా చంపేయాలని ప్రయత్నించడం వంటి పాయింట్ ఈ కథను రాసుకున్నారట. అందుకే సినిమా కొంతభాగం షూటింగ్ అమెరికాలో ఉంటుందట. బాలయ్య ఇమేజ్ కి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. కానీ బాలకృష్ణ టైటిల్ చివర్లో కులం ట్యాగ్స్ ఉండకూడదని చెప్పారట.
అందుకే ఇప్పుడు కొత్త టైటిల్ పెట్టాలని చూస్తున్నారు. గతంలో బాలయ్య 'సమరసింహా రెడ్డి', 'నరసింహనాయుడు' వంటి సినిమాల్లో నటించారు. ఆ సినిమా టైటిల్స్ ఒక కులాన్ని మాత్రమే హైలైట్ చేసేలా ఉంటాయి. ఇకపై తన సినిమా టైటిల్స్ అలా ఉండకూడదని నిర్ణయించుకున్నారు బాలయ్య. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
విజయవాడ
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion