Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'
కథానాయిక కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో 'కేజీఎఫ్', 'కాంతార' చిత్రాలు తీసిన హోంబలే సంస్థ ఓ సినిమా నిర్మించనుంది. ఈ రోజు ఆ సినిమా అనౌన్స్ చేశారు.

కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో ఓ సినిమాను రూపొందుతోంది. ఆ సినిమా పేరు 'రఘు తాత' (Raghu Thatha Movie). ఈ రోజు సినిమా అనౌన్స్ చేశారు. ''ఓ గ్రామంలో ఓ రైతు రఘుతాత ఉండేవాడు'' అంటూ కీర్తీ సురేష్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
తమిళంలో అడుగుపెడుతున్న హోంబలే
'రఘు తాత' చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో మొదటి ప్రత్యేకత ఏంటంటే... 'కెజియఫ్', 'కెజియఫ్ 2', 'కాంతార' చిత్రాలతో జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులలో తమకంటూ గుర్తింపు, గౌరవం సొంతం చేసుకున్న హోంబలే ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాతో తమిళ చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెడుతోంది. నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్న తొలి తమిళ సినిమా 'రఘు తాత'.
'విప్లవం ఇంటి నుంచి ప్రారంభం అవుతుంది' అని హోంబలే ఫిలిమ్స్ సంస్థ 'రఘు తాత' కాన్సెప్ట్ పోస్టర్, కీర్తీ సురేష్ ఫోటోలు షేర్ చేసింది. ఇదొక మహిళా ప్రాధాన్య చిత్రమని తెలుస్తోంది. విప్లవ భావాలతో సినిమా ఉంటుందని టాక్. తమిళ సినిమాగా స్టార్ట్ చేసినా... పాన్ ఇండియా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.
దర్శకుడిగా 'ఫ్యామిలీ మ్యాన్ 2' రైటర్ సుమన్
'రఘు తాత' చిత్ర దర్శకుడు సుమన్ కుమార్ ఎవరో తెలుసా? సమంత, మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ఉంది కదా! షో రన్నర్స్ రాజ్ అండ్ డీకేతో కలిసి ఆ వెబ్ సిరీస్ కథ రాసింది ఆయనే. ఇప్పుడీ సినిమా కోసం ఎటువంటి కథ రాశారోననే ఆసక్తి అందరిలో ఉంది.
రెండూ బ్యాలెన్స్ చేస్తున్న కీర్తి సురేష్
కమర్షియల్ సినిమాలు... పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ ఫిమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్... కీర్తి సురేష్ తన కెరీర్‌లో రెండూ ఉండేలా చూసుకుంటున్నారు. తెలుగులో ఆమె లాస్ట్ సినిమా 'సర్కారు వారి పాట'. అందులో మహేష్ బాబుకు జోడీగా నటించారు. 'మ మ మహేశా...', 'మురారివా...' పాటల్లో ఎంత గ్లామరస్ ఉన్నారో, 'కళావతి' పాటలో అంత అందంగా అన్నారు. మరోవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ కూడా చేస్తున్నారు.
View this post on Instagram
'మహానటి'తో కీర్తి సురేష్ ప్రతిభ ఏంటనేది అందరికీ తెలిసింది. అయితే... ఆ తర్వాత ఆమె చాలా ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చేశారు. కానీ, కొన్నే విజయాలు సాధించాయి. 'చిన్ని' లాంటి మంచి స్క్రిప్ట్ పడిన ప్రతిసారీ కీర్తి సురేష్ స్క్రీన్ మీద చెలరేగిపోయారు. 'రఘు తాత' సినిమాతో మరోసారి రఫ్ఫాడించాలని కోరుకుందాం!
మెగాస్టార్ చెల్లెలిగా...
Keerthy Suresh upcoming movies Telugu : ప్రస్తుతం కీర్తి సురేష్ చేస్తున్న తెలుగు సినిమాల విషయానికి వస్తే... మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న 'భోళా శంకర్' సినిమాలో చెల్లెలి పాత్ర చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతోన్న 'దసరా'లో కథానాయికగా చేస్తున్నారు. 'నేను లోకల్' తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న చిత్రమిది. తమిళంలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఇంకో ఏడాది వరకు కీర్తి సురేష్ బిజీ అని చెప్పాలి. ఇప్పుడు ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

