News
News
X

Kavisamrat Review - 'కవి సమ్రాట్‌' రివ్యూ : బాలకృష్ణ చూడాలనుకుంటున్న విశ్వనాథ వారి సినిమా

పద్మభూషణ్‌, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, తెలుగుజాతికి గర్వకారణమైన కవి విశ్వనాథ సత్యానారాయణ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'కవిసమ్రాట్‌'. ఎల్‌.బి. శ్రీరాం టైటిల్‌ పాత్రలో నటించడంతో పాటు నిర్మించారు.

FOLLOW US: 
 
''ఎల్‌.బి. శ్రీరామ్‌ గారు... త్వరలో మాకు చూపించండి. ఈ సినిమా చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది'' అని నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. ఆహా ఓటీటీలో విడుదలైన 'కవి సమ్రాట్‌' (Kavi Samrat On Aha) చూడాలనుందని ఆయన చెప్పుకొచ్చారు. పద్మభూషణ్‌, జ్ఞానపీఠ పురస్కారల గ్రహీత... తెలుగుజాతికి గర్వకారణమైన కవి విశ్వనాథ సత్యానారాయణ (Kavi Samrat Viswanatha Satyanarayana) జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఎల్‌.బి. శ్రీరాం టైటిల్‌ పాత్రలో నటించడంతో పాటు నిర్మించారు.

ఈ సినిమాపై ఎందుకు బాలకృష్ణ ఆసక్తి చూపించారంటే... విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందయమూరి తారక రామారావుకు విశ్వనాథ సత్యనారాయణ గురువు. ఆయన జీవితం ఆధారంగా ఎల్‌.బి. శ్రీరామ్‌ (LB Sriram) తీసిన సినిమా ఎలా ఉందంటే? (KaviSamrat Movie Review)

కథ (KaviSamrat Story) : విశ్వనాథ సత్యనారాయణ (ఎల్‌.బి. శ్రీరామ్‌)కు బాల్యం నుంచి రచయిత కావాలని ఆకాంక్ష. 'పాఠాలు అంటే పాటలు అంటున్నావ్‌. క్లాసుకు వెళ్ళమంటే కవిత్వం రాస్తానంటున్నావ్‌. ఇలా అయితే చదువు ఎలా గట్టెక్కుతుంది' అని తండ్రి శోభనాద్రి (రామజోగయ్య శాస్త్రి) అడిగితే... తనకు రచయిత కావాలనుందని చెబుతాడు. పెరిగి పెద్దయిన తర్వాత ఆయన రచయిత అయ్యారు. ఆయనకు సత్కారాలు, ప్రశంసలు, పురస్కారాలు... ఎన్నో వచ్చాయి, వస్తున్నాయి. అయితే... ఆయన జీవితంలో ఎన్టీఆర్‌, కొల్లిపర సూర్యచౌదరి పాత్ర ఏమిటి? ప్రసన్న రాసిన 'పృథ్వీ భాగవతం' చదివిన తర్వాత విశ్వనాథవారి అనుభూతి ఏమిటి? 'వేయి పడగలు', 'శ్రీ రామాయణ కల్ప వృక్షము' రాయడానికి ముందు విశ్వనాథ వారింట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? చిన్నతనంలో తండ్రి చెప్పిన మాటను గుర్తు పెట్టకుని ఆయన ఏం చేశారు? అనేది సినిమాలో చూడాలి.

విశ్లేషణ (KaviSamrat Review) : బాలకృష్ణతో తమది చిరు ప్రయత్నంగా ఎల్‌.బి. శ్రీరామ్‌ చెప్పారు. నిజంగా ఆయనది చిరు ప్రయత్నమే. అయితే... తెలుగు జాతి గర్వించదగ్గ రచయిత గురించి నేటి తరం తప్పకుండా తెలుసుకోవాలని ఆయన చేసిన ప్రయత్నం, సంకల్పం అభినందనీయం. 

News Reels

విశ్వనాథ సత్యనారాయణ పాత్రలో ఎల్‌.బి. శ్రీరామ్‌ సహజంగా నటించారు. ఆయన తండ్రి పాత్రలో గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, తనయుడి పాత్రలో నిర్మాత రాజ్‌ కందుకూరి కనిపించారు. మిగతా పాత్రల్లో అనంత్‌ బాబు, చెల్లె స్వప్న, దివంగత టీఎన్‌ఆర్‌ తదితరులు నటించారు. జోశ్యభట్ల స్వరాలు శ్యావ్యంగా ఉన్నాయి. దర్శకుడు సవిత్‌ సి. చంద్ర ఆనాటి వాతావరణం తీసుకు రావడం కోసం పడిన కష్టం తెరపై కనిపించింది. నిర్మాణ పరంగా పరిమితులు తెలుస్తూ ఉన్నాయి. నటనతో ఆ కాలంలోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు ఎల్‌.బి. శ్రీరామ్‌. నిర్మాతగా ఉన్నంతలో మంచి చిత్రాన్ని అందించారు.

సగటు సినిమా లెక్కలకు, కమర్షియల్‌ అంశాలకు దూరంగా రూపొందిన చిత్రమిది. దీనిని పూర్తిస్థాయి సినిమా అని చెప్పలేం. ఎందుకంటే... విశ్వనాథ సత్యనారాయణ జీవితంలో కొన్ని ఘట్టాలను మాత్రమే చూపించారు. అసలు సినిమా నిడివి కూడా గంట మాత్రమే. ఆపైన అరగంట విశ్వనాథవారి రచనల గురించి ఉంటుంది. డాక్యుమెంటరీ తరహా సినిమాగా 'కవిసమ్రాట్‌'ను చూడవచ్చు. మాస్ మసాలా చిత్రాలు, ప్రేమకథలు చూసే ఈతరానికి ఈ సినిమా ఎంతవరకూ నచ్చుతుందనేది చెప్పడం కష్టమే. తెలుగు భాషలో గొప్ప రచనలు చేసిన వ్యక్తి జీవితంలో కొంతైనా తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళను కొంచమైనా ఆకట్టుకుంటుంది. 

Also Read : 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఎలా ఉందంటే?

Published at : 25 Oct 2022 10:17 AM (IST) Tags: ABPDesamReview Kavisamrat Review Kavisamrat On Aha Kavi Samrat Viswanatha Satyanarayana LB Sriram Kavi Samrat Review Kavi Samrat Movie

సంబంధిత కథనాలు

Gruhalakshmi December 10th: లాస్య శాడిజం, ఫ్రిజ్ కి తాళం వేసి శ్రుతికి అవమానం- వింత సమస్యలో చిక్కుకున్న సామ్రాట్

Gruhalakshmi December 10th: లాస్య శాడిజం, ఫ్రిజ్ కి తాళం వేసి శ్రుతికి అవమానం- వింత సమస్యలో చిక్కుకున్న సామ్రాట్

Bhavadeeyudu Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు - భవదీయుడుపై లేటెస్ట్ న్యూస్!

Bhavadeeyudu Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు - భవదీయుడుపై లేటెస్ట్ న్యూస్!

Inaya in Bigg Boss: క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్‌మేట్స్ - మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన శ్రీహాన్, ఇనయా

Inaya in Bigg Boss: క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్‌మేట్స్ - మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన శ్రీహాన్, ఇనయా

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

టాప్ స్టోరీస్

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్