News
News
X

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

ఔను, బాలీవుడ్ భయపడుతోంది. బయటపడట్లేదు కానీ కచ్చితంగా భయపడుతున్నారు. ఎందుకంటే.. ఈ సారి ఏ అంచనాలు లేని ‘కార్తికేయ-2’ కూడా అక్కడ పాగా వేసేసింది మరి.

FOLLOW US: 
Share:

‘బాహుబలి’ సినిమా బాలీవుడ్‌లోనూ భారీ వసూళ్లు సాధించందంటే.. అలాంటి భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ స్క్రీన్‌పై ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఆధరించారు కాబోలు అని అనుకున్నాం. ఆ సినిమాతో ప్రభాస్‌కు వచ్చిన క్రేజ్‌ను వాడుకుందామని చూసినవారికి మాత్రం చుక్కలే కనిపించాయి. ప్రభాస్‌పై ‘బాహుబలి’ ప్రభావం ఇంకా అలాగే ఉంది. ‘బాహుబలి’ తర్వాత మరోసారి దక్షిణాది సినిమాల సత్తా చాటిన తెలుగు చిత్రాలు ‘పుష్ప: ది రైజ్’, ‘ఆర్ఆర్ఆర్’. బన్నీ విభిన్నమై ఆటిట్యూడ్‌తో ‘పుష్ప’, రాజమౌళి మ్యాజిక్‌తో ‘ఆర్ఆర్ఆర్’ యావత్ దేశాన్ని మెస్మరైజ్ చేశాయి. అప్పటికే బాలీవుడ్ దర్శకనిర్మాతల ఫ్యూజులు ఎగిరిపోయాయి. దక్షిణాది సినిమాలను బయటకు పొగిడినా.. తెలియని ఆందోళన మదిలో మెదిలింది. ఆ తర్వాత కన్నడ సీమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్-2’ సైతం బాలీవుడ్ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసింది. ఈ మూడు చిత్రాల్లో కామన్ పాయింట్.. ఆ సినిమా దర్శకులు ముగ్గురు మన తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. ఈ సినిమాల తర్వాత రిలీజైన ఏ బాలీవుడ్ చిత్రం కూడా విజయం సాధించలేదు. దీంతో చాలామంది ‘లాల్ సింగ్ చడ్డా’, ‘రక్షాబంధన్’ సినిమాలపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, అవి కూడా నిరుత్సాహానికి గురిచేశాయి. ‘లాల్ సింగ్ చడ్డా’ మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ‘రక్షాబంధన్’ సినిమా మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. వసూళ్లలో మాత్రం కుదేలైంది. అదే సమయంలో విడుదలైన ‘కార్తికేయ-2’ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సారి బాలీవుడ్‌ నిజంగానే భయపడుతోందని తెలుస్తోంది. సోషల్ మీడియా ట్రెండ్‌ను పరిశీలిస్తుంటే.. బాలీవుడ్ దర్శక నిర్మాతలను అక్కడి ప్రేక్షకులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

ఔను, బాలీవుడ్ భయపడుతోంది. బయటపడట్లేదు కానీ కచ్చితంగా భయపడుతున్నారు. ఇప్పటివరకు విడుదలైన ‘పుష్ప: ది రైజ్’, ‘ఆర్.ఆర్.ఆర్’, ‘కేజీఎఫ్-2’ వంటి చిత్రాలు భారీ బడ్జెట్ చిత్రాలు కాబట్టి.. వాటిని ప్రజలు ఆధరించారు అనుకోవచ్చు. కానీ, ‘కార్తికేయ-2’ మాటేంటి? నిఖిల్ సిద్ధార్థ్ మనకు సుపరిచిత యంగ్ హీరో. కానీ, బాలీవుడ్ దృష్టిలో పెద్ద స్టార్ కాదు. ఇక దర్శకుడు చందూ మొండేటి.. రాజమౌళిలా 100 పర్సెంట్ సక్సెస్ రేట్ కలిగిన డైరెక్టర్ కూడా కాదు. ‘కార్తికేయ-2’ ఆయనకు ఐదో సినిమా. మరి నార్త్ లోనూ ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ ఎందుకు వస్తోంది? అంత వైడ్ రేంజ్ ఆడియన్స్ కు ఎలా చేరుతోంది? సింగిల్ లైన్ సమాధానం ఉంది దానికి.. ‘కంటెంట్ ఈజ్ కింగ్’ అంతే. 

అంచనాలే లేని చిన్న చిత్రానికి అంత హైప్ ఎలా?: ఒక్క చిన్న కంపేరిజన్ చెప్పుకుందాం. ‘లాల్ సింగ్ చడ్డా’ సుమారు 30 ఏళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ కు రీమేక్. ఇన్నేళ్ల తర్వాత దాన్ని తీశారు. బడ్జెట్.. సుమారు 180 కోట్లు. అదే సమయంలో విడుదలైన ‘కార్తికేయ-2’ బడ్జెట్ ఎంత? జస్ట్ 15 కోట్లు. కానీ స్క్రీన్ మీద ఎంత ఫ్రెష్ కంటెంట్ ప్రజెంట్ చేశారు? అదే కదా మెయిన్ పాయింట్. అసలు మన ఇండస్ట్రీకి చాలా తక్కువ పరిచయమైన మిస్టారికల్ అడ్వెంచర్ జానర్ సెలెక్ట్ చేసుకోవడమే ఓ సాహసం. దాన్ని అంతే థ్రిల్లింగ్‌గా తెరకెక్కించడం డైరెక్టర్ చందూ మొండేటి విజయం. పైగా, ఈ చిత్రానికి ‘RRR’ తరహాలో పబ్లిసీటీ కూడా చేయలేదు. ఏ అంచనాలు లేకుండానే అక్కడి ప్రజల మనసు దోచుకుంది. 

అయితే ‘కార్తికేయ-2’ బాలీవుడ్‌లో మంచి టాక్ సంపాదించుకోవడానికి కొందరు చెప్పే రీజన్స్ వేరే ఉన్నాయి. శ్రీకృష్ణుడు, ద్వారక నగరం, హిందూత్వం లాంటి ఫ్యాక్టర్స్ వల్ల వైడర్ ఆడియన్స్ కు రీచ్ అయిందని అంటున్నారు. అలాగే ఈ మధ్యే ‘ది కశ్మీర్ ఫైల్స్’ తీసిన నిర్మాత అభిషేక్ అగర్వాలే ‘కార్తికేయ-2’ సినిమాకు కూడా నిర్మాత. ఈ రెండు కారణాల వల్ల సినిమాకు కాస్త పుష్ వచ్చి ఉండొచ్చు. కానీ అల్టీమేట్లీ సినిమా బాగుంటేనే జనాలు చూస్తారు. హిందీలో ఈ సినిమాకు ఇంత అమేజింగ్ రెస్పాన్స్ రావడానికి ప్రధాన కారణం.. మౌత్ టాక్. జనాల రెస్పాన్స్ చూసే రోజురోజుకూ షోల సంఖ్య పెంచుకుంటూ వస్తున్నారు. దీనికి తోడు భారీ బడ్జెట్ పెట్టి బాలీవుడ్ తీసే రొటీన్ సినిమాలు చూసి చూసీ అక్కడి ఆడియన్స్ విసిగిపోయారు. ఆ టైంలో ఫస్ట్ వాళ్లను పలకరించింది ‘పుష్ప’. ఇక వరుసపెట్టి సౌత్ సినిమాలకు పట్టం కట్టారు. RRR, కేజీఎఫ్-2, కార్తికేయ-2.. ఇలా బాలీవుడ్ సినిమాలు వరుసగా బోల్తా కొడుతుండటానికి వాళ్లు తీసే రోటీన్ కంటెంట్ సగం కారణమైతే... చాలా మంది స్టార్ల ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ అక్కడి జనాలకు అసలు నచ్చట్లేదు. అందుకే ఈ మధ్య బాయ్‌కాట్ ‘లాల్ సింగ్ చడ్డా’, బాయ్‌కాట్ ‘విక్రమ్ వేద’.. అనే హ్యాష్‌ట్యాగ్స్ బాగా ట్రెండవ్వుతున్నాయి. చివరికి బాయ్‌కాట్ బాలీవుడ్ హ్యాష్‌ట్యాగ్ కూడా పుట్టుకొచ్చింది. 

ఇటీవల అక్షయ్ కుమార్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీ... ఫిల్మ్ మేకింగ్ లో కొత్తదనాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అది సక్సెస్ అయితే మేం కూడా దాన్నే ఫాలో అవుతామని అన్నారు. నూటికి నూరుపాళ్లు ఇప్పుడు జరుగుతోంది అదే. బాలీవుడ్ ఈజ్ ఫాలోయింగ్ టాలీవుడ్. మరి ‘లైగర్’ కూడా హిట్టు కొడితే.. మన టాలీవుడ్ డైరెక్టర్లకు అమాంతంగా డిమాండ్ పెరిగిపోతుంది. 

‘కార్తీకేయ-2’ పెట్టుబడి అప్పుడే వచ్చేసింది:

శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ క్రమంగా పుంజుకుంటోంది. తాజాగా ట్రేడ్‌ వర్గాల అంచనా ప్రకారం.. 300 శాతం వృద్ధితో దూసుకుపోతోంది. ఒక్క సోమవారం నాడే రూ.6.50 కోట్లు వసూలు చేసింది. మొత్తం మూడు రోజుల కలెక్షన్ల విషయానికొస్తే హిందీ, తెలుగులో కలిపి ఏకంగా రూ.17.55 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో సినిమా బడ్జెట్‌ రూ.15కోట్ల మార్కును ‘కార్తికేయ2’ ఇప్పటికే దాటేసింది. ఇది ఇలాగే కొనసాగితే సింగిల్‌ డే కలెక్షన్‌ రూ.కోటి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో హిందీలో స్క్రీన్‌లను పెంచే పనిలో పడ్డారు ఎగ్జిబిటర్స్‌. 

కలిసొచ్చిన కథ, పెద్ద స్టార్ల వైఫల్యాలు: 

కృష్ణుడు, ద్వారకానగరం చుట్టూ కథను అల్లుకోవడంతోనే సగం విజయం సాధించింది చిత్ర బృందం. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో కృష్ణుడి ఆరాధన ఎక్కువ. ఈ నమ్మకంతోనే ‘కార్తికేయ2’ ను పాన్‌ ఇండియా మూవీగా విడుదల చేశారు. తొలిరోజు నుంచే అక్కడి ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్‌ అయిపోయారు. కథ చిన్నదే అయినా.. కృష్ణతత్వం చుట్టూ తిరిగే కథనం, సంభాషణలు అక్కడి వారిని మెప్పిస్తున్నాయి. పైగా, అనుపమ్‌ ఖేర్‌ లాంటి నటులు కూడా ఉండటం అదనపు ఆకర్షణ తెచ్చింది. దీనికితోడు ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చడ్డా’, అక్షయ్‌ ‘రక్షాబంధన్‌’లు బాక్సాఫీస్‌ వద్ద మెప్పించలేకపోవడం కూడా ‘కార్తికేయ2’ కు కలిసొచ్చింది.

అంతకుమించి: 

బాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా ‘కార్తికేయ2’ విడుదలైంది. చాలా మందికి ఇది సీక్వెల్‌ అన్న విషయం కూడా తెలియదు. ఆమిర్‌, అక్షయ్‌ల ముందు ఇది నిలబడుతుందా? అన్న వాళ్లు కూడా ఉన్నారు. ఆశ్చర్యకరంగా, వాళ్ల సినిమాలు ఆడుతున్న స్క్రీన్స్‌ తగ్గుతుండగా, ‘కార్తికేయ2’ షోలు పెరుగుతూ పోతున్నాయి. గతంలో అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’కూడా ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఒక్కో రోజు స్క్రీన్‌లను పెంచుకుంటూ ‘పుష్కరాజ్‌’ బాలీవుడ్‌కు కిక్కెక్కించాడు. ఇప్పుడు అదే బాటలో ‘కార్తికేయ2’ కూడా నడుస్తోంది.

Content By: Vijaya Vihari & Satish

 

Also Read: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Also Read: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?

Published at : 16 Aug 2022 09:06 PM (IST) Tags: Karthikeya 2 Bollywood Vs Tollywood Bollywood Vs South Movies Bollywood Vs South India Movie Karthikeya 2 in Bollywood

సంబంధిత కథనాలు

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Jagapathi Babu Mother House: జగపతి బాబు తల్లి సింప్లిసిటీ, కొడుకు ఎంత పెద్ద స్టారైనా చిన్న ఇంట్లోనే నివాసం - ఇదిగో వీడియో

Jagapathi Babu Mother House: జగపతి బాబు తల్లి సింప్లిసిటీ, కొడుకు ఎంత పెద్ద స్టారైనా చిన్న ఇంట్లోనే నివాసం - ఇదిగో వీడియో

Anni Manchi Sakunamule: 'అన్నీ మంచి శ‌కున‌ములే' నుంచి సీతా కళ్యాణం సాంగ్ రిలీజ్

Anni Manchi Sakunamule: 'అన్నీ మంచి శ‌కున‌ములే' నుంచి సీతా కళ్యాణం సాంగ్ రిలీజ్

Varun Sandesh Vithika: ఆ సమయంలో మా చేతిలో రూ.5 వేలు కూడా లేవు: వరుణ్ సందేశ్ భార్య వితిక

Varun Sandesh Vithika: ఆ సమయంలో మా చేతిలో రూ.5 వేలు కూడా లేవు: వరుణ్ సందేశ్ భార్య వితిక

Manisha Koirala: రజినీకాంత్ సినిమా వల్లే అక్కడ మూవీ ఛాన్సులు పోయాయి - మనీషా కోయిరాల సంచలన వ్యాఖ్యలు

Manisha Koirala: రజినీకాంత్ సినిమా వల్లే అక్కడ మూవీ ఛాన్సులు పోయాయి - మనీషా కోయిరాల సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?