MadhuraNagariLo Keerthi Keshav Bhat: 'కార్తీకదీపం' కీర్తి కొత్త సీరియల్ 'మధురానగరిలో'
Keerthi Keshav Bhat new serial : బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లినతర్వాత టీవీ ప్రేక్షకులకు మరింత చేరువైన కీర్తి కేశవ్ భట్ కొత్త సీరియల్ మధురానగరిలో....
MadhuraNagariLo Serial: 'మనసిచ్చి చూడు'' సీరియల్ లో భానుగా టీవీ ప్రక్షకులకు చేరువైంది కీర్తి కేశవ్ భట్. భానుగా తన అభినయంతో ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ తర్వాత కార్తీకదీపం సీరియల్ నెక్స్ట్ జనరేషన్ కథలో పెద్దైన తర్వాత డాక్టర్ హిమగా జీవించేసింది. ఈ సీరియల్ లో అమాయకమైన పాత్రలో తింగరి అనిపించుకుంటూ నటన పరంగా మంచి మార్కులే కొట్టేసింది.అయితే త్వరలో కార్తీకదీపం సీరియల్ ముగుస్తుండడంతో మరో కొత్త సీరియల్ తో టీవీ ప్రేక్షకుల ముందుకొస్తోంది కీర్తి. వాస్తవానికి కార్తీకదీపం నెక్స్ట్ జనరేషన్ కథలో కనిపించిన కొన్నాళ్లకు బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లింది...ఆ సమయంలో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ నడిచాయి..ప్రస్తుతం కార్తీకదీపం క్లైమాక్స్ కి చేరింది. అందుకే 'మధురానగరి'లో రాధగా మురిపించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇక్కడ చూడొచ్చు...
MadhuraNagariLo - Promo. Entertaining New Serial .Coming Soon on Star Maa#StarMaaSerials #StarMaa #MadhuraNagariLo pic.twitter.com/6QVMAxwmxT
— Starmaa (@StarMaa) January 18, 2023
కర్ణాటక బెంగుళూరులో జన్మించిన కీర్తి..BBM కోర్సు పూర్తిచేసింది. ఈమెకు చిన్నప్పటి నుంచి నటనపై మక్కువ ఎక్కువ.
రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను,అన్నా వదినను కోల్పోయిన ఈమె చాలా బాధలు అనుభవించింది. అయినవాళ్లనుంచి ఆదరణ కరువైనా తనకు తానే ధైర్యం చెప్పుకుంది. చదువు పూర్తియ్యాక...నటనపై ఉన్న ఆసక్తితో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కన్నడలో రెండు సినిమాలు, మూడు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మనసిచ్చి చూడు సీరియల్ తో ఎంట్రీ ఇచ్చి కార్తీకదీపంలో నటించింది...ఇప్పుడు మధురానగరిలో రాధగా వస్తోంది.
కీర్తి కన్నీటి కథ సినిమాలకు మించిన విషాదం...బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లినతర్వాత ఆమె గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసింది. కీర్తి పరిస్థితి చూసి చెమర్చని కళ్లులేవు. అంతా ఆమెను తమ కుటుంబ సభ్యురాలే అన్నంతగా మనసులో పెట్టేసుకున్నారు. మేమున్నాం అంటూ సందేశాలు పంపించారు..తోటి కంటిస్టెంట్స్ పేరెంట్స్ అంతా కీర్తిని తమ సొంత బిడ్డలా భావించారు. సహ నటులంతా మనమంతా ఓ కుటుంబం అని ఓదార్పునిచ్చారు. అందరి ప్రేమను పొందిన కీర్తి తన కెరీర్ ను మరింత తీర్చిదిద్దుకుంటోంది. నిజ జీవితంలో అమ్మా అని పిలిపించుకునే భాగ్యం లేదని కన్నీళ్లు పెట్టుకున్న కీర్తి 'మధురానగరిలో' సీరియల్ లో ఓ బాబుకి అమ్మగా..రాధగా నటిస్తోంది.
View this post on Instagram