NC22: చైతు సినిమాలో 'వంటలక్క' - క్లిక్ అవుతుందా?
నాగచైతన్య సినిమాలో వంటలక్కను ఓ రోల్ కోసం తీసుకున్నారట.
'మానాడు' వంటి సైన్స్‌ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించిన దర్శకుడు వెంకట్ ప్రభు.. ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య(NagaChaitanya)తో మూవీ చేస్తున్నారు. చైతుకి ఇది 22వ సినిమా. అందుకని.. ఈ సినిమాను NC22గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో కృతిశెట్టి(Krithishetty) హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజతోపాటు ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా కూడా సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో కొంతమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ లు నటిస్తున్నారు. సినిమా క్యాస్టింగ్ ను ఒక్కొక్కరిగా రివీల్ చేస్తోంది చిత్రబృందం. నటి ప్రియమణి, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, ప్రేమ్ గి అమరేన్ వంటి నటీనటులను ఎంపిక చేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అలానే సీరియల్ ఆర్టిస్ట్ ప్రేమి విశ్వనాథ్ ను కూడా తీసుకున్నారట. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ప్రేమి విశ్వనాథ్ అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ 'వంటలక్క' అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. 'కార్తీకదీపం' సీరియల్ తో ఈమెకి మంచి పేరొచ్చింది. సీరియల్ బాగా క్లిక్ అవ్వడంతో ఇప్పుడు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ఈ క్రమంలో నాగచైతన్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె రోల్ క్లిక్ అయితే టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి.
విలన్ గా అరవింద్ స్వామి:
ఈ సినిమాలో అరవింద్ స్వామిని విలన్ గా తీసుకున్నట్లు సమాచారం. తన సెకండ్ ఇన్నింగ్స్ లో అరవింద్ స్వామి ఎక్కువగా విలన్ రోల్స్ లోనే నటిస్తున్నారు. రామ్ చరణ్ నటించిన 'ధృవ' సినిమాలో విలన్ గా తన మార్క్ పెర్ఫార్మన్స్ చూపించారు అరవింద్ స్వామి. ఆ తరువాత తెలుగు సినిమాల్లో ఆయనకు అవకాశాలు వచ్చినా.. ఆయన నటించలేదు. చాలా కాలానికి ఆయన మరో తెలుగు సినిమా సైన్ చేసినట్లు టాక్.
వెంకట్ ప్రభు చెప్పిన కథ తనకు నచ్చడంతో అరవింద్ స్వామి నటించడానికి అంగీకరించారట. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. దీని తరువాత మైసూర్ లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఆ షెడ్యూల్ లో అరవింద్ స్వామి జాయిన్ అవుతారని సమాచారం. ఈ చిత్రాన్ని హై టెక్నికల్ స్టాండర్డ్స్, భారీ బడ్జెట్‌తో.... కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read : 'క్రేజీ ఫెలో' రివ్యూ : ఆది సాయి కుమార్ సినిమా క్రేజీగా ఉందా? బోర్ కొట్టించిందా?
Welcoming the Television Queen and Versatile Actress #PremiVishwanath on board for our #NC22 💫🔥@chay_akkineni @vp_offl @IamKrithiShetty @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @SS_Screens @srkathiir @rajeevan69 @abburiravi #VP11 pic.twitter.com/FrsJSeAHQQ
— Srinivasaa Silver Screen (@SS_Screens) October 14, 2022