By: ABP Desam | Updated at : 30 Jan 2022 12:05 PM (IST)
ప్రభాస్ సినిమాలో పార్టనర్ గా కరణ్ జోహార్..?
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ 'బాహుబలి' సినిమా తరువాత నుంచి అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 'రాధేశ్యామ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోపక్క 'ఆదిపురుష్', 'సలార్' వంటి సినిమాల్లో నటిస్తున్నారు ప్రభాస్. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K' సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
మొన్నామధ్య అమితాబ్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాను ఐదొందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత అశ్వనీదత్ రూపొందించనున్నారు. ఇప్పటివరకు ఆయనొక్కడే వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. కానీ ఇప్పుడు మరో నిర్మాత కూడా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారు.
భాగస్వామిగా సినిమా వ్యవహారాలు చూసుకోవాలనుకుంటున్నారు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. 'బాహుబలి' లాంటి సినిమా నార్త్ లో సక్సెస్ అవ్వడానికి కారణం కూడా కరణ్ అనే చెప్పాలి. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ విషయంలో కూడా ఆయన పాత్ర ఉంది. సౌత్ నుంచి ఏ సినిమా హిందీలో రిలీజ్ కావాలన్నా.. కరణ్ హెల్ప్ ఉండాల్సిందేనని మన నిర్మాతలు భావిస్తుంటారు.
తెలుగు సినిమాలు బాలీవుడ్ లో మంచి విజయాలు అందుకోవడంతో కరణ్ కూడా తన ఫోకస్ టాలీవుడ్ పై పెట్టాడు. ఈ క్రమంలో ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాలో పార్టనర్ కావాలనుకుంటున్నాడు. మరి దీనికి అశ్వనీదత్ ఎంతవరకు ఒప్పుకుంటారో చూడాలి!
Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?
Anjali special song: అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు నితిన్ తో అంజలి స్పెషల్ సాంగ్
Actress Arrested: పోలీస్ ఆఫీసర్ ని కరిచిన నటి - పూణేలో అరెస్ట్
Samanta on Liger poster: వాటిని కూడా బ్రేక్ చేయగలడు - విజయ్ దేవరకొండ ‘లైగర్’ పోస్టర్‌పై సమంత కామెంట్
Ram Charan: రామ్ చరణ్ ను తీసుకోకుండా ఉండాల్సింది - స్టార్ రైటర్ కామెంట్స్!
Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !
CM Jagan Pics: ముగిసిన సీఎం జగన్ ప్యారిస్ పర్యటన, ప్రత్యేక విమానంలో అమరావతికి
BJP National Executive Meeting: ప్రధాని మోదీ స్పీచ్‌లో ఇవే హైలైట్ కానున్నాయా, ఆయన ఏం మాట్లాడతారు?
Viral Video: గుర్రమెక్కిన ఫుడ్ డెలివరీ బాయ్, ఎందుకో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది