News
News
X

Kantara Prequel: వచ్చేది సీక్వెల్ కాదు ప్రీక్వెల్, ‘కాంతార 2‘పై రిషబ్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు

కన్నడ మూవీ ‘కాంతార‘ చిన్న సినిమా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని హింట్ ఇస్తూ వస్తున్న మేకర్స్ తాజాగా కీలక ప్రకనట చేశారు.

FOLLOW US: 
Share:

గతేడాది కన్నడ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన ‘కాంతార’ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 450 కోట్లకు పైగా కలెక్షన్లు వసూళ్లు సాధించి అదరహో అనిపించింది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో  సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించింది. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం చిన్న సినిమాగా వచ్చి, బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన 100 రోజుల వేడుక జరిగింది. ఈ సందర్భంగా  రిషబ్ శెట్టి కీలక విషయాలు వెల్లడించారు.   

చూసింది ‘కాంతార 2’, రాబోయేది ‘కాంతార 1’

‘కాంతార’ సినిమా సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే మేకర్స్ పలుమార్లు వెల్లడించారు. ‘కాంతార 2’ కచ్చితంగా ఉంటుందని చిత్ర నిర్మాత, హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ సైతం ధృవీకరించారు. రిషబ్ శెట్టి సీక్వెల్ కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టినట్లు వెల్లడించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను దర్శకుడు రిషబ్ శెట్టి తెలిపారు. ‘కాంతార’ తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలైనట్లు వెల్లడించారు. అయితే, ఈ సినిమా సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అన్నారు. తొలి భాగం ఎక్కడైతే ప్రారంభమైందో, దానికి ముందు జరిగిన సంఘటనలు రెండో భాగంలో చూపించనున్నట్లు తెలిపారు. గత ఏడాది చూసింది ‘కాంతార 2’ సినిమా కాగా..  రాబోయే సినిమా ‘కాంతార 1’  అన్నారు. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ‘కాంతార’ ప్రీక్వెల్ 2024లో విడుదలవుతుందని వెల్లడించారు. 

ప్రీక్వెల్ మూవీలో ఏం ఉండబోతోందంటే?

ఇక ‘కాంతార’ ప్రీక్వెల్‌లో గ్రామస్తుల మధ్య అనుబంధాలు, గుళిగ దైవం, రాజు గురించి చూపిస్తామని నిర్మాత విజయ్ కిరంగదూర్ అన్నారు. గ్రామస్తులతో పాటు భూమిని రక్షించడానికి రాజు ఏం చేశాడనేది తెర మీద చూపించనున్నట్లు చెప్పారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం వర్షాధారిత వాతావరణం అవసరమన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న ‘కాంతార’

‘కాంతార’ సినిమా తొలుత కన్నడలో విడుదలయింది. అనంతరం సంచలన విజయం సాధించడంతో తెలుగు, తమిళం, మలయాళం, హిందీలోకి మేకర్స్ డబ్ చేసి విడుదల చేశారు. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ రికార్డులు దద్దరిల్లాయి. ఐఎమ్‌డీబీలో అత్యధిక రేటింగ్‌ను సాధించిన సినిమాగా ‘కాంతార’ నిలిచింది. మరి ‘కాంతారా’ ప్రీక్వెల్ ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి. 

View this post on Instagram
 
A post shared by Hombale Films (@hombalefilms)

Read Also: మాల్దీవుల్లో ప్రభాస్, కృతి సనన్ ఎంగేజ్మెంట్ - ఈ వార్తలు నిజమేనా?

Published at : 07 Feb 2023 12:31 PM (IST) Tags: Kantara Movie Rishab Shetty Kantara Prequel

సంబంధిత కథనాలు

అప్పట్లోనే టూపీస్ బికినీ - అప్పుడు ఎంతో కష్టపడ్డాం, మాధవికి రాధ ప్రశంసలు

అప్పట్లోనే టూపీస్ బికినీ - అప్పుడు ఎంతో కష్టపడ్డాం, మాధవికి రాధ ప్రశంసలు

ఐదు లక్షల కోసం రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన

ఐదు లక్షల కోసం రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన

Guppedanta Manasu March 22nd: శ్రీవారికి ప్రేమగా వండి వడ్డించిన వసుధార, తాళి గురించి కొనసాగుతున్న రచ్చ

Guppedanta Manasu March 22nd: శ్రీవారికి ప్రేమగా వండి వడ్డించిన వసుధార, తాళి గురించి కొనసాగుతున్న రచ్చ

నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!

నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా