Kangana Ranaut: ఇంట్లోకి చొరబడితే కాల్చేస్తాం - వైరల్ అవుతోన్న కంగనా రనౌత్ ఇంటి సైన్ బోర్డ్
బాలీవుడ్ నటి కంగనా ఇటీవల తన ఇంటి అలంకరణ గురించి చెప్తూ తన సోషల్ మీడియా ఖాతాలో పలు ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఉన్న ఓ బోర్డ్ ను చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ క్వీన్ నటి కంగనా రనౌత్ గురించి సౌత్ లోనూ అందరికీ తెలిసే ఉంటుంది. తన వ్యాఖ్యలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది కంగనా. ఒక్కోసారి ఆమె వ్యాఖ్యలు పొలిటికల్ గానూ హీట్ రేపుతూ ఉంటాయి. దీంతో పలుమార్లు చిక్కుల్లో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె లివింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది. ఆమె దుస్తులు, వాడే వస్తువులు చూస్తే అది ఇట్టే అర్థమైపోతుంది. అలాగే ఆమె చేసే ప్రత పని లోనూ ఆడంబరాన్ని ప్రదర్శిస్తుంటుంది కంగనా. అందుకే అత్యధిక ధర పెట్టి ముంబైలో పెద్ద విలాసవంతమైన అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసింది. ఈ అపార్ట్మెంట్ కోసం స్టాంప్ డ్యూటీనే కోటి రూపాయల వరకూ కట్టిందట. దీనితో పాటు ఇటీవలే కంగనా మనాలిలో ఒక పెద్ద భవనాన్ని కొనుగోలు చేసింది. దీనిని ప్రత్యేక ఇంటీరియర్ డిజైనర్ షబ్నం గుప్తా డిజైన్ చేశారు. గతంలో కూడా తన ఇంటి అలంకరణ గురించి మాట్లాడింది కంగనా. ఇక్కడి వరకూ బానే ఉంది. అయితే ఇటీవల తన ఇంటి అలంకరణ గురించి చెప్తూ తన సోషల్ మీడియా ఖాతాలో పలు ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఉన్న ఓ బోర్డ్ ను చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కంగనా మనాలిలో తన భవనంలో ఎక్కువ శాతం తంజోర్ పేయింటింగ్ లను వేయించింది. ఆమెకు దక్షిణ భారత దేశ సంస్కృతి అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. అయితే మనాలీలో తన అలంకరించిన ఇంటికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో అందంగా అలంకరించబడిన తంజోర్ పెయింటింగ్ లు కనబడుతున్నాయి. వాటితో పాటు ఓ బోర్డ్ కూడా కనిపించింది. అందులో ‘అనుమతి లేకుంగా ప్రవేశించకూడదు, అతిక్రమిస్తే కాల్చేస్తాం, బతికిన వారిని మళ్లీ కాల్చేస్తాం’ అని స్పష్టంగా కనిపిస్తోంది. ఆ బోర్డ్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. కంగనా నివాసంలోకి ఎవరైనా కొత్త వాళ్లు వెళ్లాలి అంటే చాలా నిబంధనలు ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
గతంలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నివాసంలో గుర్తు తెలియని ఇద్దరు గుజరాతీ వ్యక్తులు చొరబడ్డారు. ప్రార్థనా మందిరం, మేకప్ రూమ్ లో వారు దాదాపు 8 గంటలకు పైగా ఉన్నారు. తర్వాత వారిని షారుఖ్ ఇంటి సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు. వివరాలు అడిగితే పొంతన లేని సమాచారం చెప్పడంతో వారిని పోలీసులకు అప్పగించారు. తాము షారుఖ్ అభిమానులమని, ఆయన్ను దగ్గరగా చూడటానికి వచ్చామని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ వార్త బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. అందుకే కంగనా కూడా తన ఇంటి గోడలపై ఇలాంటి బోర్డు పెట్టుకుందని చర్చించుకుంటున్నారు నెటిజన్స్. ఇక కంగనా ‘ఎమర్జెన్సీ’ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు కంగనా స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టింది.