Kangana Ranaut: 'నువ్ ఏడ్చే రోజు వచ్చేసింది' కంగనా కామెంట్స్ అతడిని ఉద్దేశించేనా?
కంగనా హోస్ట్ గా వ్యవహరిస్తోన్ రియాలిటీ షో 'లాకప్' పలు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ.. బోలెడు వ్యూస్ తో ముందుకు సాగిపోతుంది.
![Kangana Ranaut: 'నువ్ ఏడ్చే రోజు వచ్చేసింది' కంగనా కామెంట్స్ అతడిని ఉద్దేశించేనా? Kangana Ranaut indirectly mocks Karan Johar Kangana Ranaut: 'నువ్ ఏడ్చే రోజు వచ్చేసింది' కంగనా కామెంట్స్ అతడిని ఉద్దేశించేనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/01/efb0a7ad719d2f27f4f2f3a0a4a91a34_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివాదాస్పద కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఏ విషయానైన్నా మొహమాటం లేకుండా మాట్లాడుతుంటుంది. అంతేకాకుండా.. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ను విమర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా.. అసలు వదులుకోదు. తాజాగా మరోసారి కంగనా తనదైన స్టైల్ లో కరణ్ జోహార్ పై మండిపడింది.
కంగనా హోస్ట్ గా వ్యవహరిస్తోన్ రియాలిటీ షో 'లాకప్' పలు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ.. బోలెడు వ్యూస్ తో ముందుకు సాగిపోతుంది. తాజాగా ఈ షో 200 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. ఈ విజయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కంగనా. ఈ విజయం గురించి గొప్పగా చెబుతూ.. ఇన్స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసింది.
ఈ స్టోరీలో 'లాకప్' షో 200 మిలియన్ వ్యూస్ ను సాధించడంతో అతడితో పాటు కొంతమంది రహస్యంగా ఏడవబోతున్నారని.. నువ్ ఏడ్చే రోజు వచ్చేసింది పాపా జో అంటూ రాసుకొచ్చింది కంగనా. పాపా జో అనే మాట కరణ్ జోహార్ ని సూచిస్తున్నట్లు ఉంది. పలువురితో కలిసి కరణ్ జోహార్ తన షోని నాశనం చేయడానికి ప్రయత్నించాడని కంగనా భావిస్తోంది.
కంగనాకు, కరణ్ కి అసలు పడదు. చాలా ఏళ్లుగా వీరిద్దరి మధ్య శత్రుత్వం నడుస్తోంది. కరణ్ జోహార్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్'కి అప్పట్లో సైఫ్ అలీఖాన్ తో కలిసి హాజరైంది కంగనా. ఈ కార్యక్రమంలో కంగనా.. కరణ్ ని ఉద్దేశిస్తూ.. నెపోటిజంని ప్రోత్సహిస్తారని.. సినిమా మాఫియా లాంటి వ్యక్తి అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
Also Read: లైంగిక వేధింపుల కేసు - 'ఊ అంటావా' సాంగ్ కొరియోగ్రాఫర్ పై చార్జ్‌షీట్
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)