By: ABP Desam | Updated at : 06 Feb 2023 12:46 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Kangana Ranaut/Instagram
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లో ఎలా కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఒక్కోసారి ఆమె చేసే వ్యాఖ్యలు బీ టౌన్ లో చర్చనీయాంశం అవుతూ ఉంటాయి కూడా. ఇటీవలే బాలీవుడ్ లో ఉర్ఫీ జావేద్ తో సోషల్ మీడియాలో వార్ నడిచింది. అది జరిగి కొన్ని రోజులు గడవక ముందే మరో వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చనీయాంశం అవుతోంది కంగనా. తనపై ఎవరో నిఘా పెట్టారని, తన ప్రతి కదలికను అనుసరిస్తున్నారని ఆరోపించింది. దీనిపై పెద్ద నోట్ రాసి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం కంగనా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో పెద్ద దుమారం రేపుతున్నాయి.
తనపై నిఘా పెట్టారని కంగనా రనౌత్ ఆరోపించింది. తన ప్రతి కదలికను గమనించడమే కాకుండా తన వ్యక్తిగత సమాచారాన్ని కూడా దొంగలిస్తున్నారని మండిపడింది. ‘‘ఈ మధ్య కాలంలో సెలబ్రెటీల జీవితం ఎలా ఉంటుందో తెలుసు. ఎక్కడికి వెళ్లినా చాలా మంది నన్ను అనుసరిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య తన పార్కింగ్ ఏరియా, అలాగే తన ఇంటి బాల్కనీలో కూడా కెమెరాలు జూమ్ అవుతున్నాయి’’ అని పేర్కొంది. ఇవన్నీ ఒకప్పుడు తనను ఇబ్బంది పెట్టిన ఓ సెలబ్రెటీ చేస్తున్నాడని ఆరోపించింది. తన డైలీ షెడ్యూల్ పనులే కాకుండా తన వ్యక్తిగత వివరాలను కూడా సేకరిస్తున్నారని అంది. తన వాట్సాప్ డేటా, వ్యక్తిగత వివరాలు, వ్యాపార ఒప్పందాలు కూడా లీక్ అవుతున్నాయని అంటూ రాసుకొచ్చింది. అంతే కాదు తన వ్యక్తిగత సిబ్బందిని కూడా ఎక్కువ జీతాలతో పిలిపించుకుంటున్నారని మండిపడింది. దీనంతటకీ ఆయన భార్య కూడా సపోర్ట్ చేస్తుందని ఆరోపించింది. అవన్నీ బయటకు రావడం తనకు ఎంతో ఆందోళన గా ఉందని పేర్కొంది. అయితే ప్రస్తుతం కంగనా వ్యాఖ్యలు బీ టౌన్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.
కంగనా చేసిన వ్యాఖ్యల్లో పేర్లు గురించి ప్రస్తావన చేయకపోయినా అదంతా రణబీర్ కపూర్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ మిస్టరీ మ్యాన్ రణబీర్ కపూరే కావచ్చని అంటున్నారు. కంగనా రనౌత్ తన సోదరుడి పెళ్లికి ధరించిన దుస్తులు లాంటివే అలియా తన పెళ్లికి కూడా ధరించింది. అప్పట్లో అది చర్చనీయాంశం అయింది. అలాగే రణబీర్ కపూర్, అలియా భట్ కూడా వేరు వేరు ఫ్లాట్ లలో నివశిస్తున్నారు.
Also Read : పోకిరి', 'బాహుబలి 2' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ సినిమాలో నటిస్తోంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా కనిపించనుంది. అలాగే రజనీ కాంత్ ‘చంద్రముఖి 2’ సినిమాలో కూడా కంగనా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాల తర్వాత ‘తేజస్’ సినిమాలో కూడా నటించనుంది. ఇందులో ఆమె పైలట్ పాత్రలో నటించనుంది.
Priyanka Nalkari Wedding: గుడిలో రహస్య వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి, వరుడు ఎవరో తెలుసా?
ఆ సామాన్యుల చేతిలో ఆస్కార్ - పట్టరాని ఆనందంలో ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ జంట
అలా చేయనన్నానని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించారు: నటి సన
Mohan Babu on Manoj: కుక్కలు మొరుగుతూనే ఉంటాయి పట్టించుకోను - మనోజ్ రెండో పెళ్లిపై మోహన్ బాబు రియాక్షన్
Ravi Teja Brother Raghu Son : యూత్‌ఫుల్ సినిమాతో హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ
Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?
Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు