News
News
X

Kamal Rashid Khan Bail : లైంగిక వేధింపుల కేసులో బెయిల్ వచ్చినా జైల్లోనే

బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్‌ను ఆగస్టు 30న ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన మీద రెండు కేసులు ఉన్నాయి. లైంగిక వేధింపుల కేసులో మంగళవారం బెయిల్ వచ్చింది. అయినా జైల్లో ఉండాల్సి వచ్చింది.

FOLLOW US: 

హిందీ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (Kamal Rashid Khan) బెయిల్ వచ్చినా జైల్లో ఉండాల్సి వస్తుంది. దీనికి కారణం ఆయనపై ఒకటి కంటే ఎక్కువ కేసులు ఉండటమే! గత నెల 20న కేఆర్కేగా సుపరిచితుడైన కమల్ రషీద్ ఖాన్‌ను ఎయిర్ పోర్టులో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... మంగళవారం ఆయనకు బెయిల్ వచ్చింది. అయినా ఇంకా జైల్లో ఉన్నారు. ఎందుకంటే...
 
లైంగిక వేధింపుల కేసులో బెయిల్ వచ్చింది
కమల్ ఆర్ ఖాన్‌ను లైంగిక వేధింపుల కేసులో బెయిల్ వచ్చింది. గత ఏడాది ఒక మహిళ కేఆర్కే తనను లైంగికంగా వేధించారని కేసు పెట్టారు. సినిమాలో అవకాశం ఇస్తానని తన ఆఫీసుకు బాధిత మహిళను పిలిపించుకున్న కేఆర్కే... డ్రింక్ ఆఫర్ చేసిన తర్వాత అసభ్యంగా తాకడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆయనపై 354 ఎ, 509 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఘటన జరిగిన 18 నెలల తర్వాత కేసు పెట్టారని, ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, స్నేహితురాలు చెప్పడంతో బాధిత మహిళ కేసు పెట్టారని కమల్ ఆర్ ఖాన్ న్యాయవాదులు వాదించారు. ఆ కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది.
 
కాంట్రవర్షియల్ ట్వీట్స్ కేసులో జైల్లో...
హిందీ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు, హీరోయిన్లు, నటీనటులతో పాటు భారీ సినిమాలను విమర్శిస్తూ ట్వీట్స్ చేయడం కేఆర్కేకు అలవాటు. రెండేళ్ల క్రితం...  అనగా 2020లో ఆయన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అరెస్ట్‌కు కారణం అయ్యింది. హిందీలో స్టార్ హీరో అక్షయ్ కుమార్, సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఆయన వివాదాస్పద ట్వీట్లు చేశారు. ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. దాని కారణంగా ఆయన జైల్లో ఉన్నారు.

కేఆర్కే మీద కేసులు వేసిన సల్మాన్, మనోజ్ 
కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan), ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయి గతంలో కేసులు వేశారు. సల్మాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడటం లేదని, వసూళ్లు రావడం లేదని కేఆర్కే ట్వీట్స్ చేశారు. 'రాధే : మోస్ట్ వాంటెడ్ భాయ్' విడుదల అయినప్పుడు వరుస విమర్శలు చేశారు. సినిమా బాలేదని రివ్యూ ఇవ్వడమే కాకుండా... కలెక్షన్స్ పోస్ట్ చేస్తూ ఫ్లాప్ అని విమర్శలు చేశారు. తన పరువుకు భంగం వాటిల్లే , ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా ట్వీట్స్ ఉంటున్నాయని సల్మాన్ తరపు లాయర్ కోర్టులో కేసు వేశారు. ఆ తర్వాత సల్మాన్ గురించి ఎటువంటి ట్వీట్స్ చేయవద్దని కేఆర్కేను కోర్టు ఆదేశించింది. 

గత ఏడాది కేఆర్కే మీద మనోజ్ బాజ్‌పాయి క్రిమినల్ కేసు వేశారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌ను 'సాఫ్ట్ పోర్న్' సిరీస్‌గా కమల్ ఆర్ ఖాన్ పేర్కొన్నారు. అంతే కాదు... మనోజ్ భార్య, కుమార్తె గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో పరువు నష్టం ద్వావా వేశారు. 

Also Read : రెండు నెలలకు పెటాకులైన డేటింగ్ కథ - మోడీతో సుస్మిత బ్రేకప్?

అప్పుడు 'ఆర్ఆర్ఆర్'... ఇప్పుడు 'లైగర్' 
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా... వార్తల్లో ఉండటమే ముఖ్యం అన్నట్లు కమల్ ఆర్ ఖాన్ ట్వీట్స్ చేస్తుంటారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' (RRR Movie) సినిమా విడుదలైనప్పుడు... నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. ఇప్పుడు కేఆర్కే ట్విట్టర్ అకౌంట్ చూస్తే... విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ల‌ 'లైగర్' (Liger Movie) సినిమా గురించి ఎక్కువ ట్వీట్స్ కనిపిస్తాయి. సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే... యూనిట్ సభ్యుల మనసు గాయపరిచేలా కేఆర్కే ట్వీట్స్ ఉంటాయి. గతంలో ఇదే విధంగా పలు సినిమాలపై ఆయన ట్వీట్స్ చేశారు.

Also Read : పవన్ కోసం మూడు కథలు రెడీ చేసిన సుజిత్ - 'బిల్లా', 'పంజా' తరహాలో?

Published at : 07 Sep 2022 03:30 PM (IST) Tags: KRK Arrest Kamal Rashid Khan Bail KRK Sexual Assault Case KRK Controversial Tweets Case

సంబంధిత కథనాలు

Chiranjeevi - Najabhaja song : గజగజ వణికించే గజరాజడిగోరో - మెగాస్టార్ రేంజ్ సాంగ్ అంటే ఇదీ

Chiranjeevi - Najabhaja song : గజగజ వణికించే గజరాజడిగోరో - మెగాస్టార్ రేంజ్ సాంగ్ అంటే ఇదీ

DJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్ డైరెక్టర్ ఎవరో క్లారిటీ వచ్చేసింది!

DJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్ డైరెక్టర్ ఎవరో క్లారిటీ వచ్చేసింది!

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకి పూర్ బుకింగ్స్ - పాజిటివ్ టాక్ వస్తుందా?

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకి పూర్ బుకింగ్స్ - పాజిటివ్ టాక్ వస్తుందా?

Satyadev Interview : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ

Satyadev Interview : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ

Bigg Boss 6 Telugu: నేహా ఎలిమినేట్ అయ్యాక ఆదిరెడ్డి - రాజశేఖర్ ఏమన్నారంటే, నాగార్జున చెప్పినా రివ్యూలు మానని ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: నేహా ఎలిమినేట్ అయ్యాక ఆదిరెడ్డి - రాజశేఖర్ ఏమన్నారంటే, నాగార్జున చెప్పినా రివ్యూలు మానని ఆదిరెడ్డి

టాప్ స్టోరీస్

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు

Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి