Bharateeyudu-2 Update: మొత్తానికి మొదలైంది, ‘భారతీయుడు-2’ షూటింగ్ షురూ!
లోకనాయకుడు కమల్ హాసన్ తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ్టి నుంచి భారతీయుడు-2 సినిమా షూటింగ్ మొదలైనట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్, విశ్వనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా సినిమా ‘భారతీయుడు-2’. ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ వెల్లడించారు. దర్శకుడు శంకర్ తో కలిసి సెట్స్ లో సీన్స్ డిస్కస్ చేస్తున్న ఫోటోలు, వీడియోను ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
#Indian2 from today.
— Kamal Haasan (@ikamalhaasan) September 22, 2022
@Udhaystalin @shankarshanmugh @LycaProductions @RedGiantMovies_ pic.twitter.com/TsI4LR6caE
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా సంచలన నిజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ డ్యుయెల్ రోల్ చేసి మెప్పించారు. తండ్రి సేనాపతి పాత్రలో కమల్ నటన, హావభావాలు ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భారతీయుడు సినిమా విడుదలైన 25 ఏండ్లకు.. సీక్వెల్ గా ‘భారతీయుడు-2’ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలోనూ కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ ను ప్రకటించగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించి కొంతమేర షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నది. 2020లో సెట్లో ప్రమాదం జరగడం, కరోనా లాక్ డౌన్, దర్శకనిర్మాతల మధ్య కొన్ని వివాదాలు రావడంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన ఈ మూవీ పలు కారణాల వలన తాత్కాలికంగా చిత్రీకరణ ఆగిపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
View this post on Instagram
తొలుత లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చింది. మొదట్లో అంతా బాగానే ఉన్నప్పటికీ తరువాత బడ్జెట్ విషయంలో నిర్మాతలకు శంకర్ కి మధ్య గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో వారు శంకర్ మీద కేసు కూడా పెట్టారు. చాలాకాలంపాటు కోర్టులో నలిగిన ఈ కేసు నుంచి శంకర్ ఈ మధ్యనే బయటపడ్డారు. కొద్ది రోజుల క్రితం ఈ షూటింగ్ ఈ సినిమా గురించి కమల్ హాసన్ కీలక విషయాలు వెల్లడించారు. "సినిమాకి సంబంధించి 60 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. ప్రస్తుతానికి మేము ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నాము. 'విక్రమ్' సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్ళి మొదలవుతుంది" అని క్లారిటీ ఇచ్చారు.
కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా చేయగా, శంకర్.. రామ్ చరణ్ హీరోగా ‘ఆర్సీ 15’ సినిమాను తెరకెక్కించే పనిలో బిజీ అయ్యారు. దాంతో ‘భారతీయుడు-2’ ఉంటుందా, లేదా? అనే చర్చ కూడా జరిగింది. కానీ, మళ్లీ ఈ సినిమా పట్టాలెక్కింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదట ఈ సినిమాలో కాజల్ కూడా నటించాల్సి ఉండేది. కానీ, తనకు పెళ్లి కావడం, ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తున్నది. ఇక అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
Also Read: క్రియేటివిటీకి కళ్లజోడు పెడితే.. సింగీతం శ్రీనివాసరావు