Amigos Teaser: ‘అమిగోస్’ టీజర్ - ఈ సారి ఇద్దరు కాదు ముగ్గురు, క్యాట్ అండ్ మౌస్ ఆటలో గెలిచేదెవరు?
నందమూరి కళ్యాణ్ రామ్ మరో ప్రయోగాత్మక మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘అమిగోస్’ మూవీ టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు.
‘బింబిసార’ మూవీ హిట్‌తో ఫామ్‌లోకి వచ్చిన కళ్యాణ్ రామ్.. మరో ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సారి ‘అమిగోస్’ అనే మూవీతో ప్రేక్షకులను మెస్మరేజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా రిలీజైన ‘అమిగోస్’ టీజర్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. ‘బింబిసార’ మూవీలో ద్రిపాత్రభినయంతో అలరించిన కల్యాణ్ రామ్.. ఈ సారి మూడు పాత్రలతో ముందుకొస్తున్నారు. ఇందులో ఒకటి నెగటివ్ రోల్ కాగా.. మిగతా రెండు పాత్రలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. 'అమిగోస్' అనేది స్పానిష్ వర్డ్. మన స్నేహితుడి గురించి చెప్పడానికి సూహించే పదం. ‘అమిగోస్’లో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. ఆల్రెడీ రెండు లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మంజునాథ్‌గా, ఎంట్రప్రెన్యూర్ సిద్ధార్థ్‌గా లుక్స్ రిలీజ్ అయ్యాయి. పరంగా కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్ చూపించారు. త్వరలో పాటల్ని కూడా విడుదల చేయనున్నారు. దివంగత గేయ రచయిత వేటూరి రాసిన పాట సినిమాలో ఉందని, త్వరలో పాటల్ని విడుదల చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది.
టీజర్లో ఏముంది?
View this post on Instagram
ఇక టీజర్ విజయానికి వస్తే.. ‘‘హాయ్ దిస్ ఈజ్ మైఖెల్ ఫ్రమ్ కోల్‌కతా’’ అంటూ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో మొదలువతుంది. ‘‘మైఖెలా? ఏం కావాలి’’ అనే మరో కళ్యాణ్ రామ్ పాత్ర వాయిస్ వినిపిస్తుంది. ఇందుకు సమాధానంగా ‘‘నువ్వే అని’’ మైఖెల్ పాత్ర సమాధానం ఇవ్వడం, ఓ యాప్ సాయంతో మైఖెల్ పోలికలు కలిగిన వ్యక్తిని గుర్తు పెట్టడానికి ప్రయత్నించడాన్ని టీజర్లో చూడవచ్చు. మైఖెల్ ఫోన్లో ‘‘ఐ యామ్ యువర్ డోపెల్‌గాంగర్ (నీ పోలికలు కలిగిన వ్యక్తిని) అని చెప్పడం, నిద్రలో ఉన్న మరో పాత్ర ‘‘జోక్ చేస్తున్నావా’’ అని అడుగుతాడు. ‘‘డోపల్‌గాంగర్ అనేది జోక్ అని నువ్వు అనుకుంటున్నావా?’’ అనగానే.. అసలు కథ మొదలవుతుంది.
కళ్యాణ్ రామ్ జంటగా కన్నడ భామ!
'అమిగోస్' సినిమాలో కళ్యాణ్ రామ్ జోడిగా కన్నడ భామ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) నటించారు. ఆమెకు తొలి తెలుగు చిత్రమిది. ఆల్రెడీ కన్నడలో కొన్ని సినిమాలు చేశారు. 'అమిగోస్'లో ఇషిక పాత్రలో ఆషిక నటించారని చిత్ర బృందం పేర్కొంది. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు!
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి హీరోగా నటించిన చిత్రమిది. దీనికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. ఫిబ్రవరి 10న సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
'అమిగోస్' చిత్రానికి కూర్పు : తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్ల, నృత్యాలు : శోభి, ఫైట్ మాస్టర్స్: వెంకట్, రామ్ కిషన్, పాటలు: 'స్వర్గీయ' శ్రీ వేటూరి, రామజోగయ్య శాస్త్రి, రెహమాన్, ఛాయాగ్రహణం : ఎస్. సౌందర్ రాజన్, సి.ఇ.ఓ : చెర్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : హరి తుమ్మల, సంగీతం : జిబ్రాన్.
Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?