By: ABP Desam | Updated at : 12 Feb 2023 05:20 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Kalyaan Dhev/Instagram
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ రెండో భర్త కల్యాణ్ దేవ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సినిమా హీరోగా ప్రేక్షకులను అలరించినా, తన వ్యక్తిగత విషయాల ద్వారానే అతను బాగా పాపులర్ అయ్యాడు. గతంలో కుటుంబ సభ్యులను ఎదిరించి ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది శ్రీజ. ఆ తర్వాత కొంత కాలానికి అతడితో విడిపోయింది. కల్యాదేవ్ ను రెండో వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరు కూడా కలిసి ఉండటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరు పెట్టే పోస్టులే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
తాజాగా కల్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషన్ పోస్టు పెట్టాడు. తన కూతురు నవిష్కను గుర్తు చేసుకుంటూ ఈ పోస్టు షేర్ చేశాడు. ఫిబ్రవరి 11న కల్యాణ్ దేవ్ బర్త్ డే. ఈ సందర్భంగా గతంలో తన కూతురుతో కలిసి బర్త్ డే జరుపుకున్న వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశాడు. తన మనసులోని బాధను బయటపెట్టుకుంటూ ఓ పోస్టు రాశాడు. “నీతో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఇది నాలుగోసారి. నా బర్త్ డేను ఇంతకంటే గొప్పగా మొదలుపెట్టలేను. ప్రతిరోజూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పటికే నిన్ను మిస్ అయ్యాను” అంటూ రాసుకొచ్చాడు. తాజాగా జరిగిన నవిష్క బర్త్ డే వేడుకల్లోనూ కల్యాణ్ దేవ్ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు కూడా తన కూతురును తలుచుకుంటూ ఓ ఎమోషనల్ పోస్టు పెట్టాడు.
గత కొంత కాలంగా దూరంగా ఉంటున్న కల్యాణ్ దేవ్- శ్రీజ
కల్యాణ్ దేవ్, శ్రీజ రెండో పెళ్లి చేసుకున్నాక, వీరికి ఓ పాప పుట్టింది. ఆమెకు నవిష్క అని పేరు పెట్టారు. అయితే, కొంత కాలంగా శ్రీజ, కల్యాణ్ కలిసి ఉండటం లేదంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. త్వరలోనే వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈ వార్తలపై కల్యాణ్ దేవ్, శ్రీజ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే, చాలా రోజులుగా కల్యాణ్ దేవ్ తన భార్య, కూతురుకు దూరంగా ఉంటున్నాడు. అటు శ్రీజ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ పేరును కొద్ది కాలం కిందటే శ్రీజ కొణిదెలాగా మార్చుకుంది. భర్త కల్యాణ్ దేవ్ ను అన్ ఫాలో చేసింది. ఈ నేపథ్యంలో వారి గురించి వస్తున్న వార్తలు వాస్తవమేనని తేలాయి. అంతేకాదు, మెగా ఫ్యామిలీలో జరిగే ఎలాంటి వేడుకలకు కల్యాణ్ దేవ్ హాజరుకావడం లేదు.
Read Also: తారకరత్నకు విదేశీ వైద్యుల ట్రీట్మెంట్, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటే?
Salman Khan Threat: సల్మాన్‌కు భద్రత కట్టుదిట్టం - జైల్లో నుంచే ప్లాన్ చేస్తున్న గ్యాంగ్‌స్టర్?
Janaki Kalaganaledu March 21st: రామని దారుణంగా అవమానించిన అఖిల్- భార్యగా బాధ్యతలు నిర్వర్తించమని జానకికి సలహా ఇచ్చిన జ్ఞానంబ
Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్
Gruhalakshmi March 21st: తులసమ్మ సేవలో నందు- విక్రమ్ ని ఇష్టపడుతున్న దివ్య, చూసేసిన భాగ్య
Brahmamudi March 21st: భార్యాభర్తలుగా కావ్య, రాజ్- రిసెప్షన్ కి మారువేషాలు వేసుకొచ్చిన కనకం, మీనాక్షి
AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి
వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్
CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం