Manu Charitra Teaser: ‘మనుచరిత్ర’ టీజర్: ప్రేమలో పడటం.. బాధాకరమైన ఆనందమట, కాజల్ సమర్పణ!
కాజల్ అగర్వాల్ సమర్పణలో తెరకెక్కిన ‘మనుచరిత్ర’ సినిమా టీజర్ ఎలా ఉంది? యూత్‌ను మెప్పిస్తుందా?
హీరోయిన్ కాజల్ సమర్పణలో తెరకెక్కిన ‘మనుచరిత్ర’ సినిమా టీజర్ గురువారం విడుదలైంది. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘మనుచరిత్ర’ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. బండ రాయి కట్టేసిన ఓ ప్రేమికుడి శవాన్ని థీమ్ పోస్టర్‌లో చూపించారు. ‘‘ప్రేమలో పడడం ఒక బాధాకరమైన ఆనందం’’ అంటూ ఆ చిత్రం కథను చెప్పకనే చెప్పేశారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే.. ప్రేక్షకులకు కూడా ఇదే భావన కలుగుతుంది. ఓ విఫల ప్రేమికుడు ఎదుర్కొనే నరకయాతన.. దాని పరిణాలను ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
‘పెళ్లి చూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. శివ సరసన మేఘా ఆకాష్ కథానాయికగా కనిపించనుంది. భరత్.పి దర్శకత్వంలో యాపిల్ ట్రీ ఎంటర్ టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఎన్ శ్రీనివాస్ రెడ్డి - పి రోన్సన్ జోసెఫ్ నిర్మాతలు. ఇక టీజర్ విషయానికి వస్తే.. హీరో శివ భగ్న ప్రేమికుడిగా మెప్పిస్తాడు. మాంచి మాస్ లుక్‌తో యూత్‌ను ఆకట్టుకొనేలా అతడి లుక్ ఉంది. అయితే, టీజర్లో హీరోయిన్ల పాత్రలను పెద్దగా చూపించలేదు. ఇందులో మేఘా ఆకాష్‌తోపాటు ప్రియా వడ్లమాని మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఇంకా ప్రగతి శ్రీవాత్సవ్, సుహాస్, దాలి ధనంజయ్, శ్రీకాంత్ అయ్యర్, మధు నందన్, హర్షిత చౌదరీ, గరీమా కౌశల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు.
‘మను చరిత్ర’ టీజర్:
Also Read: నీకు నేనున్నా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ అభయం, వీడియో వైరల్
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. ఘన చరిత్రకు గ్రహణం పట్టిస్తున్న విభేదాలు