By: ABP Desam | Updated at : 03 Feb 2023 05:19 PM (IST)
ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు కె విశ్వనాథ్
ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అందరికీ ఆస్కార్ అవార్డుల (Oscar Awards) గురించి తెలుసు. దర్శక ధీరుడు రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు...' పాట 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' కేటగిరీలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు పాట అది. అసలు, ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు ఎవరో తెలుసా? కె విశ్వనాథ్ (K Viswanath).
'స్వాతి ముత్యం'తో...
అది 1986 సంవత్సరం. యావత్ భారత దేశం మొత్తం ఓ తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటోంది. ఆటిస్టిక్ లక్షణాలున్న ఓ వ్యక్తి కథతో తీసిన చిత్రమిది. ఆ క్యారెక్టర్ మెయిన్ స్ట్రీమ్ సినిమాకు లీడ్ రోల్ అనేదే ఓ పెద్ద డిబేటబుల్ టాపిక్. కానీ, కమల్ హాసన్ నట విశ్వరూపం, కె విశ్వనాథ్ దర్శకత్వం ఆ బ్యారియర్స్ ను బద్ధలు కొట్టాయి. అదే 'స్వాతి ముత్యం' సినిమా.
ఆ ఏడాది ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా 59వ ఆస్కార్ వేడుకలకు వెళ్లిన సినిమా. ఫైనల్ రౌండ్ కు నామినేట్ కాకపోయినా ఓ తెలుగు సినిమాను ఆస్కార్ బరిలో నిలిపిన తొలి దర్శకుడిగా కె విశ్వనాథ్ చరిత్ర సృష్టించారు.
మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్, తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శితమైంది స్వాతి ముత్యం. దేశం మొత్తం కె విశ్వనాథ్ డైరెక్షన్ గురించి, కమల్ హాసన్, రాధిక, శరత్ బాబుల యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నారు.
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డుతో పాటు మూడు నంది అవార్డులను, బెస్ట్ డెరెక్టర్ గా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు కె విశ్వనాథ్. ఇళయ రాజా సంగీతంలో వచ్చిన పాటలు 'సువ్వి సువ్వి సువ్వాలమ్మ', 'లాలీ లాలీ...', 'మనసు పలికే మౌనరాగం...' - ఈ పాటలన్నీ సంగీత ప్రియులను నేటికీ అలరించే ఎవర్ గ్రీన్ సాంగ్స్.
క్లాసికల్ డ్యాన్స్ లో ట్రైనింగ్ ఉండి... స్టెప్పులు ఫర్ ఫెక్ట్ వేసే కమల్ హాసన్ ను... ఆటిస్టిక్ లక్షణాలున్న వ్యక్తి రోల్ కావటంతో అసలు డ్యాన్స్ రాని వాడిలాగా స్టెప్పులు వేయాలని అడిగేవారట కె విశ్వనాథ్. సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోవటం... చిత్ర విచిత్రంగా స్టెప్పులు వేయటం కూడా యాక్టింగే కమల్ హాసన్ కు దగ్గరుండి సువ్వి సువ్వీ సువ్వాలమ్మ స్టెప్పులు నేర్పించారంట కళాతపస్వి. నటుడిగా కమల్ హాసన్ ను మరో మెట్టు ఎక్కించిన సినిమా స్వాతి ముత్యం. డైరెక్టర్ గా కే విశ్వనాథ్ ప్రతిభను విశ్వవ్యాప్తం చేసిన సినిమా స్వాతి ముత్యం.
Also Read : సినిమాల్లో సంస్కృతికి టార్చ్ బేరర్ - విశ్వనాథ్ అంటే సాహసాలు కూడా!
కమల్ హాసన్, విశ్వనాథ్ కాంబినేషన్ సూపర్ హిట్. 'స్వాతి ముత్యం' మాత్రమే కాదు... వాళ్ళు ఇద్దరూ కలిసి చేసిన 'సాగర సంగమం', 'శుభ సంకల్పం' చిత్రాలూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. విశ్వనాథ్ సినిమాలకు, ఆయనకు పలు ఫిల్మ్ ఫేర్, నంది, జాతీయ పురస్కారాలు వచ్చాయి. భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయన్ను వరించింది. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా... విశ్వనాథ్ సినిమాలు ఎప్పుడూ మనతో ఉంటాయి. ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతాయి.
Also Read : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక
డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత
'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది
మాధురీ దీక్షిత్‌పై అసభ్య వ్యాఖ్యలు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగల్ నోటీసులు జారీ
Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?
Dharmapuri Sanjay On DS : డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం
Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్
APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!