Jawan Trailer: 'జవాన్' ట్రైలర్ తో డ్రగ్స్ కేసుకు లింక్, ఆర్యన్ ఖాన్ ఏమన్నాడో తెలుసా?
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్‘ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ లోని కొన్ని డైలాగులు షారుఖ్ కొడుకు డ్రగ్స్ కేసును ఉద్దేశించి చెప్పినట్లు నెట్టింట్లో జోరుగా చర్చ నడుస్తోంది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 'జవాన్' సినిమా విడుదల కానుంది. సౌత్ క్వీన్ నయనతార ఈ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. ఇందులో ప్రియమణి కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ పతాకంపై ఆయన సతీమణి గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాని అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
సమీర్ వాంఖడేకి షారుఖ్ గట్టి హెచ్చరిక!
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. యాక్షన్, రొమాన్స్, కామెడీతో నిండిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. షారుఖ్ ఖాన్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలు అన్నీ 'జవాన్'లో ఉన్నట్లు అనిపిస్తోంది. 'నా కొడుకు మీద చెయ్యి వేసే ముందు, వాడి బాబు మీద చెయ్యి వేయాలి' అటనే షారుఖ్ డైలాగ్ ఇప్పుడు సర్వత్రా చర్చను రేకెత్తిస్తోంది. ఈ డైలాగ్ తో ‘జవాన్‘ మూవీలో షారుఖ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని అర్థం అవుతోంది. అయితే, ఈ డైలాగ్ వెనుక మరో అర్థం కూడా ఉండదనే టాక్ నడుస్తోంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు దర్యాప్తు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) మాజీ చీఫ్ సమీర్ వాంఖడేకి షారుఖ్ గట్టి హెచ్చరిక పంపాడని పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సమీర్ వాంఖేడే తప్ప మరెవ్వరిని ఉద్దేశించి ఈ డైలాగ్ చెప్పలేదంటున్నారు.
షారుఖ్ నుంచి రూ. 25 కోట్లు లంచం డిమాండ్ చేసిన సమీర్
2021లో డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు అయ్యాడు. ఈ కేసును సమీర్ వాంఖడే దగ్గరుండి పర్యవేక్షించాడు. కొద్ది రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్ కు ఆ తర్వాత న్యాయస్థానం క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ కేసులో ఆర్యన్ ను ఇరికించకుండా ఉండాలంటే రూ. 25 కోట్లు ఇవ్వాలని సమీర్ షారుఖ్ ను డిమాండ్ చేశాడు. ఈ విషయం షారుఖ్ పై అధికారులకు చెప్పారు. లంచం డిమాండ్ చేసినందుకు సమీర్ అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ ఘటనను ఉద్దేశించే షారుఖ్ ఆ డైలాగ్ చెప్పడాని జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు తండ్రి ‘జవాన్’ ట్రైలర్ ను కొడుకు ఆర్యన్ ఖాన్ అందిరికంటే ముందుగా చూశాడు. ఈ ట్రైలర్ పై తన ఒపీనియన్ ను వెల్లడించాడు. 'మాస్, యాక్షన్, డైలాగ్-ఓరియెంటెడ్ ట్రైలర్' గా ఆర్యన్ అభివర్ణించాడు.
ఇక ‘జవాన్’ చిత్రంలోసన్యా మల్హోత్రా, ప్రియమణి, రిధి డోగ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, సంజయ్ దత్, తలపతి విజయ్ కూడా అతిధి పాత్రలు పోషించారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 7, థియేటర్లలోకి రానుంది.
Read Also: ‘జవాన్‘ దర్శకుడితో చేతులు కలపనున్న ‘పుష్ప‘- త్వరలో పాన్ ఇండియన్ మూవీ షురూ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial