Janaki Kalaganaledu November 21st: జ్ఞానంబ, రామాకి అబద్ధాలు చెప్పిన జానకి- కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయిన మల్లిక పరిస్థితి
అఖిల్ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుని చదువుని వదిలేస్తుంది జానకి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జెస్సి తన గదిలో సామాన్లు తుడుస్తూ కాలు జారీ టేబుల్ మీద నుంచి జారి కిందపడిపోతుంటే జానకి వచ్చి పట్టుకుంటుంది. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యకు అని జెస్సికి టిఫిన్ ఇచ్చి వెళ్తుంది. వదిన ఏంటి ఏమి జరగనట్టు ఉందని అఖిల్ డౌట్ పడతాడు. జ్ఞానంబ రామాని పిలిచి 50 కేజీల లడ్డూలు కావాలని ఆర్డర్ వచ్చిందని చెప్తుంది. రామా కుదరదు అని అనడంతో జానకి వచ్చి ఎందుకు కుదరదు చేస్తామని చెప్పండి అని అంటుంది. చదువు మానేసి లడ్డూలు చూడుతూ ఉంటారా అని రామా అంటే దేని పని దానిదే అని అంటుంది. రామా మాట్లాడటానికి చూస్తుంటే జానకి కావాలనే తన దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది.
Also Read: మీడియా ముందు అడ్డంగా బుక్కైన రిషి, వసు- మహేంద్ర ఎంట్రీ అదుర్స్, దేవయాని ప్లాన్ తుస్స్
జానకి కిచెన్ లో ఉంటే రామా వస్తాడు. ఆలస్యం అవుతుంది మీరు రెడీ అయితే కాలేజీలో మిమ్మల్ని దింపేసి కొట్టుకు వెళ్తాను అని చెప్తాడు. కానీ జానకి మాత్రం వద్దులే మీరు వెళ్ళండి అని అంటుంది. అలా ఎలా వెళతారు నేనే దింపుతానులే అని అంటాడు. క్లాసులు లేట్ గా మొదలవుతాయి కాస్త లేట్ గా వెళ్తాను అని జానకి చెప్తుంది. ఆ మాటకి సరే అని రామా వెళ్ళిపోతాడు. జెస్సికి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతారు. మంచిగా నటించడం చాలా కష్టంగా అనిపిస్తుందని అఖిల్ అనుకుంటాడు. జ్ఞానంబ మల్లిక, జెస్సిని పిలుస్తుంది. మీరిద్దరూ కడుపుతో ఉన్నారు కదా నోరు వికారంగా ఉంటుందని సొంటి పొడి కారం చేయించాను దీన్ని క్రమం తప్పకుండా తినండి అని జాగ్రత్త చెప్తుంది. అది చూసి గోవిందరాజులు మల్లికకి కౌంటర్ వేస్తాడు.
జానకి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. అటు రామా కాలేజీ దగ్గరకి వచ్చి తనకోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. జానకి క్లాస్ మేట్స్ అటుగా వస్తుంటే వాళ్ళని ఆపి రామా జానకి గురించి అడుగుతాడు. జానకి క్లాస్ కి రాలేదని వాళ్ళు చెప్తారు. ఆలస్యంగా వస్తాను అన్నారు కదా రాలేదంటి అని రామా ఆలోచిస్తాడు. ఇంట్లోకి వచ్చి జానకి కోసం వెతుకుతూ ఉంటాడు. జానకి ఏది అని జ్ఞానంబని అడుగుతాడు. లడ్డూలు చేశాము అవి ఇవ్వడానికి వెళ్ళిందని చెప్తుంది. చదువు మానేసి లడ్డూలు చుట్టడం ఏంటి అని రామా అంటాడు. ఈరోజు కాలేజీ లేదంట కదా అని జ్ఞానంబ చెప్పేసరికి రామా ఆశ్చర్యపోతాడు. లడ్డూలు చుట్టి చేతులు నొప్పులతో మల్లిక నూనె రాసుకుంటూ ఏడుస్తుంది. జానకి, పోలేరమ్మని తిట్టుకుంటుంది. అప్పుడే నీలావతి మల్లికకి ఫోన్ చేస్తుంది.
Also Read: కార్తీక్ ని ఫాలో అవుతున్న మోనిత- తల్లిదండ్రుల కోసం శౌర్య పోస్టర్స్ ప్లాన్
నీది దొంగ ప్రెగ్నెన్సీ అని జానకికి తెలిసిపోయిందా ఏంటి అని ఆరా తీస్తుంది. జానకికి నిజం తెలిసిందని చెప్తే ఈ ఇంటి ఛాయలకి కూడా రాదని మల్లిక అనుకుని నీలావతి దగ్గర నిజం దాస్తుంది. తర్వాత ఆమె ఫోన్ పెట్టేశాక ఎలా అయిపోయింది పరిస్థితి అనుకుని తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది.
తరువాయి భాగంలో..
కాలేజీకి వెళ్తాను అని చెప్పి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటున్నారు. అసలు ఏం జరుగుతుందని రామా జానకిని నిలదీస్తాడు. చదువు కావాలా, కుటుంబం కావాలా తేల్చుకోమన్నారు, అందుకే నేను కుటుంబం కోసం చదువు వదిలేశాను అని జానకి ఎమోషనల్ అవుతూ చెప్పేస్తుంది. అది విని రామా షాక్ అవుతాడు.