Janaki Kalaganaledu March 25th: ప్రేమలోకంలో విహరిస్తున్న రామ, జానకి- జాతకం చెప్పించుకున్న మల్లిక, నవ్వుకున్న మలయాళం
రామ, జానకి హనీమూన్ కి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రామాా, జానకి ఒక రిసార్ట్ కి వస్తారు. అక్కడ ఒక జిడ్డుగాడు రామా డాష్ ఇస్తాడు. అతను ఇంగ్లీషులో మాట్లాడుతుంటే రామా బిక్కమొహం వేస్తాడు. అప్పుడే జానకి వచ్చి ఇంగ్లీషులో అతన్ని తిడుతుంది. మీరు ఏం మాట్లాడరో అర్థం కాలేదు కానీ వాడి మొహం మాత్రం మాడిపోయిందని రామా అనడం అతను విని కోపంగా వెళ్ళిపోతాడు. గదికి వచ్చిన తర్వాత దాన్ని చూసి భలే ఉందని మురిసిపోతాడు. లక్కీ కపుల్ కాంపిటీషన్ జరుగుతుందని అందులో పార్టీసిపెట్ చేసి గెలవాలని అంటుంది. రామా, జానకి చక్కగా రెడీ అయి కాంపిటీషన్ కి వస్తాడు. రామాతో గొడవ పడిన వ్యక్తి జానకి వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. కొన్ని గేమ్స్ పెట్టి అందులో ఏ జంట గెలుస్తుందో వాళ్ళకి అకమిడేషన్ ఫ్రీ అని యాంకర్ చెప్తుంది.
Also Read: రాజ్యలక్ష్మి పరువు గోవిందా, ధర్నాకి దిగిన దివ్య- బిజినెస్ డీల్ వద్దన్న నందు
ఒక బాల్ ఇచ్చి భార్యాభర్తలు మధ్య పెట్టుకుని కిందపడకుండా ఉంచాలని చెప్తారు. ఈ ఆట భార్యాభర్తల మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ కి తెలియజేస్తుందని యాంకర్ చెప్తుంది. అన్ని జంటలూ తమ జోడీలతో కలిసి బాల్ పట్టుకోకుండా రౌండ్ గా తిరుగుతూ ఉంటారు. జిడ్డు గాడు రామా వాళ్ళని ఓడించడం కోసం తన కాలు అడ్డం పెట్టి పడేసేందుకు ట్రై చేస్తాడు. కానీ చివరికి అతనే ఒడిపోతాడు. మొదటి రౌండ్ లో రామా, జానకి విన్నర్స్ గా నిలుస్తారు. అక్కడ ఎస్సై నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ ఇంకో ఎస్సై గాడిలా వీడు తగులుకున్నాడు ఏంటి ఒక చూపు చూడమంటారా అని రామా అంటే జానకి వద్దని ఆపుతుంది. జానకి ఇంట్లో లేకపోవడంతో జ్ఞానంబ తనని పీక్కుతింటుందని మల్లిక తిట్టుకుంటూ జాతకం చెప్పించుకోవాలని అనుకుంటుంది. అప్పుడే ఒకతను రోడ్డు మీద జాతకాలు చెప్తాం అని అరుస్తూ ఉంటే అతన్ని పిలిపిస్తుంది.
తన జాతకం కంటే జానకి జాతకం ఎలా ఉందో తెలుసుకుందామని మల్లిక అనుకుని అడుగుతుంది. పక్కనే మలయాళం కూడా ఉంటాడు. రాజ యోగం, కష్టాల సముద్రం ఈదుతుంది, అనుకున్నది సాధిస్తుంది. అన్యోన్య దాంపత్యమని అనేసరికి మల్లిక తిట్టుకుంటుంది. రెండో కోడలు మల్లిక జాతకం చెప్పమని అడుగుతుంది. రెండో కోడలిది దరిద్రపు యోగం కుదురులేని బుద్ధి వక్రపు ఆలోచనలు, తను ప్రశాంతంగా ఉండదు ఎదుటి వారిని ఉండనివ్వదు. ఈ మనిషి ఇంట్లో వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే వాళ్ళు అంత సంతోషంగా ఉంటారని అంటాడు. ఏంటి చెప్పేది ఆ దరిద్రపు కోడలు ఈమెనని మలయాళం ఇరికిస్తాడు. దీంతో మల్లిక వాడిని చితకబాదుతుంది. వీళ్ళు హనీమూన్ కి ఎగిరిపోయారా ఏంటని అనుమానపడుతుంది. కాంపిటీషన్ లో చివరి రౌండ్ పెడతారు.
Also Read: శోభనానికి ఒప్పుకుని రాజ్ కి ఝలక్ ఇచ్చిన కావ్య- పట్టాలెక్కిన మరో ప్రేమ జంట
భర్త భార్యని ఎత్తుకుని నిలబడాలి ఎవరు ఎక్కువ సేపు భార్యని మోస్తారో వాళ్ళే విజేతలని చెప్తారు. భార్యని ఎత్తుకున్న సమయంలో ప్రేమలాగా ఓపిక కూడా తగ్గుతుంది, అలా చివరి వరకు ఎవరైతే ఓపిక కూడగట్టుకుని భార్యని మోస్తారో వాళ్ళే గెలుస్తారని చెప్తుంది. రామా జానకిని ఎత్తుకుని సంతోషంగా ఉంటే జిడ్డు గాడు మాత్రం పెళ్ళాన్ని మోయలేక చతికిలబడతాడు. ఈ రౌండ్ లో కూడా రామా, జానకినే గెలుస్తారు. అది చూసి జిడ్డుగాడు రగిలిపోతాడు. యాంకర్ వాళ్ళని మెచ్చుకుంటుంది. భార్యాభర్తలంటే ఇలా ఉండాలని అంటుంది.