Janaki Kalaganaledu January 30th: తోపుడు బండి మీద వ్యాపారం మొదలుపెట్టిన రామా- అవమానించిన కన్నబాబు, బుద్ధి చెప్పిన జానకి
రామా చేసిన అప్పు వల్ల జ్ఞానంబ కుటుంబం కష్టాలు పడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఎవరి దగ్గరో పని కావాలని అడగటం ఎందుకు మీరే సొంతంగా వ్యాపారం పెట్టుకోవచ్చు కదా అని జానకి సలహా ఇస్తుంది. దీంతో గతంలో నాలుగు చక్రాల బండి మీద స్వీట్స్ అమ్మిన రామా ఇప్పుడు మళ్ళీ అదే బండి బయటకి తీస్తాడు. కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించమని జానకి జ్ఞానంబని అడుగుతుంది. బిడ్డ బాగుండాలని తల్లే కాదు భర్త బాగుండాలని భార్య కూడా కోరుకుంటుంది ఆ కొబ్బరి కాయ నువ్వే కొట్టు అని జ్ఞానంబ అంటుంది. ఆ మాటకి అందరూ బాధపడతారు. అత్తయ్య గారు మంచే జరుగుతుందని అన్నారు కదా అదే ఆశీర్వాదమని జానకి అంటుంది. తండ్రిని కొబ్బరికాయ కొట్టమని రామా అడుగుతాడు. సరే అని గోవిందరాజులు కొబ్బరికాయ కొడతాడు. అదంతా చాటుగా జ్ఞానంబ చూస్తూ ఉంటుంది. వ్యాపారం బాగా సాగాలని గోవిందరాజులు, జెస్సి కోరుకుంటారు.
Also Read: దివ్యకి ఎమోషనల్ సెండాఫ్ ఇచ్చిన తులసి ఫ్యామిలీ- ఆస్తి కావాలని అడిగిన నందు
చెల్లెలు వెన్నెల మొదటి బోణి చేసి పంపిస్తుంది. జానకి, రామా బండి తోసుకుంటూ వెళ్లిపోతారు. రామా పనిలో పడ్డాడు అని గోవిందరాజులు సంతోషంగా ఉంటే మల్లిక మాత్రం నోటికి పని చెప్తుంది. బండి పెట్టి 20 లక్షలు సంపాదించడానికి ఇదేమన్నా సినిమానా హేళనగా మాట్లాడుతుంది. బండి మీద ఆ అప్పు ఎలా తీరుస్తారని చులకనగా చేస్తుంది. భార్య అలా మాట్లాడుతుంటే అన్నకి సపోర్ట్ చెయ్యవు ఏంటని గోవిందరాజులు విష్ణుని అంటాడు. కానీ విష్ణు మాత్రం అన్నయ్యే కాదు మేము కూడా పనులు చేశాం, చదువుకున్న వాళ్ళమే అనేసి కుళ్ళుబోతుతనంగా మాట్లాడతాడు. రామా వాళ్ళు బండి తోసుకుంటూ వెళ్తుంటే కన్నబాబు అడ్డం పడతాడు.
ఏంటి షాపు పోయి బండికి వచ్చావా, ఎక్కడ మొదలు పెట్టావో మళ్ళీ అక్కడికే వచ్చావా, కొత్త బండి కొత్త రంగులు కళకళాడిపోతుంది కదా అని అంటాడు. నీలాంటి బండ్లు బజారుకి నాలుగు ఉంటున్నాయ్ ఇంక నువ్వు ఎలా వ్యాపారం చేస్తావ్ అని అవమానిస్తాడు. మేమేమి నీ సలహా అడగలేదు కదా వెళ్లిపో అని జానకి తిడుతుంది. నీ భార్యతో కూడా ఒక బండి పెట్టించు అందగత్తె కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే రామా కోపంగా తన కాలర్ పట్టుకుంటాడు. వీధి కుక్క మొరుగుతుంది పట్టించుకోవద్దని జానకి కన్నబాబుని అవమానిస్తుంది. రామా తన మీదకి వెళ్లబోతుంటే జానకి ఆపి తీసుకుని వెళ్ళిపోతుంది.
జ్ఞానంబ చేసిన పని తనకి నచ్చలేదని గోవిందరాజులు అంటాడు.
గోవిందరాజులు: ఎందుకు వాళ్ళకి దూరంగా ఉంటున్నావ్
Also Read: వసుధార వద్దకు బయల్దేరిన రిషి- టెన్షన్ లో మహేంద్ర
జ్ఞానంబ: మన పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయాయి, ఒకప్పుడు వాడు చేసిన కష్టం వల్ల ఇంత స్థాయికి వచ్చాం కానీ మళ్ళీ వాడు చేసిన తప్పు వల్ల ఈ స్థాయికి దిగజారిపోయాం. రామా మంచితనమే ఈ స్థితికి తీసుకొచ్చింది. తమ్ముడి మీద ఉన్న ప్రేమ కోసం అలా చేసి ఇప్పుడు ఆ పనే వాడిని అందరితో మాట పడేలా చేయిస్తుంది. రామాకి కష్టపడటం తెలుసు, వాడి కష్టానికి జానకి తెలివితేటలు తోడు ఉన్నాయి. అందుకే మళ్ళీ సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని సలహా ఇచ్చింది. ఇప్పుడు నా బాధ అంతా మిగతా పిల్లల గురించి. మనం వాళ్ళని ఎలా ప్రయోజనకులని చేయాలని ఆలోచించాలి.
మల్లిక కోపంగా డబ్బు తీసి వెళ్ళి షాపుకి అడ్వాన్స్ ఇచ్చి రమ్మని చెప్తుంది. ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుందని అంటాడు. కానీ మల్లిక మాత్రం ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదని, ఎవరికి తెలియకుండా మన దారి మనం చూసుకోవాలని చెప్తుంది. రోడ్డు మీద ఇద్దరు పెద్దవాళ్ళు కనిపిస్తే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఆర్డర్ ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతాడు.