Janaki Kalaganaledu January 18th: చిచ్చు పెట్టిన మల్లిక, కన్నీళ్ళు పెట్టుకున్న గోవిందరాజులు- అఖిల్, జెస్సి మధ్య గొడవ
రామా చేసిన అప్పు వల్ల జ్ఞానంబ కుటుంబం రోడ్డున పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జెస్సి తండ్రి పీటర్ కి మల్లిక ఫోన్ చేసి చాడీలు చెప్తుంది. దీంతో ఆయన కోపంగా జ్ఞానంబ ఇంటికి వస్తాడు. ఇంటికి వెళ్లిపోదాం రమ్మని జెస్సిని పిలుస్తాడు. ఎందుకు తీసుకెళ్తున్నారని గోవిందరాజులు అడుగుతాడు.
పీటర్: అఖిల్ కి ఉద్యోగం లేకపోయినా ఉన్నతమైన కుటుంబం అని మీ ఇంటికి కోడలిని చేశాను కానీ తీరా చూస్తే ఉన్నవన్నీ పోగొట్టుకుని ఈ ఇంట్లోకి వచ్చి చేరారు. ఇంత జరిగినా నాకు చెప్పలేదు మీరు
జ్ఞానంబ: అనుకోని కష్టాలు వచ్చాయ్ వాటిని చెప్పి మిమ్మల్ని బాధపెట్టడం ఎందుకని
పీటర్: ఇంత చిన్న ఇంట్లో నా కూతురు కష్టపడాల్సిన అవసరం లేదు అందుకే నా అల్లుడిని, కూతురిని ఇంటికి తీసుకెళ్తాను
జ్ఞానంబ: తనకి ఇక్కడ ఏ లోటు రాదు
Also Read: ప్రేమని బయటకి చెప్పుకోలేక నలిగిపోతున్న యష్, వేద- మాళవికకి చుక్కలు చూపిస్తున్న భ్రమరాంబిక
పీటర్: నాకు నమ్మకం లేదు. జెస్సి వెళ్ళి బ్యాగులు తీసుకురా
జెస్సి: నేను ఇప్పుడు మీ కూతుర్ని కాదు ఈ ఇంటి కోడలిని. మీరు రమ్మంటే కాదు మా అత్తయ్య వెళ్ళమంటే వస్తాను
పీటర్: నువ్వు ఇక్కడ కష్టాలు పడటం ఎందుకమ్మా
జెస్సి: నేను కష్టాలు పడుతున్నానని ఎవరు చెప్పారు, తిండి తినడం ట్యాబ్లెట్స్ వేసుకోవడం తప్ప ఇక్కడ నేనేమీ కష్టపడటం లేదు. అయినా మీరు నాకు పెళ్లి చేసింది ఇంటిని చూశా. నీకూతురు ఇల్లు మారిందే కానీ వాళ్ళు చూసుకునే విధానం కాదు
పీటర్: నువ్వేదో మాయలో పడ్డావ్. ఏముంది ఇక్కడ
జెస్సి: ఈ ఇంట్లో అందరూ నన్ను ప్రాణంగా చూసుకుంటున్నారు, జానకి కన్నతల్లిలా చూసుకుంటుంది. మీకూతురిగా పండగకి పిలవండి వస్తాను అంతే కానీ మీ ప్రేమ ఇక్కడ వాళ్ళని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు
Also Read: దివ్య మీద ఫైర్ అయిన తులసి- అంకిత, శ్రుతి మధ్య చిచ్చు పెట్టిన లాస్య
పీటర్: నువ్వే కదా నా కూతురు పెళ్లి చేశావ్, నమ్మించి మా గొంతు కోశావ్. ఏరోజు నా మాటకి ఎదురు చెప్పని నా కూతురు నేను రమ్మంటే పొమ్మంటుంది అనేసి జానకిని తిట్టేసి వెళ్ళిపోతాడు. జ్ఞానంబ కూడా వియ్యంకుడితో మాటలు పడేలా చేశారని జానకి వాళ్ళని అంటుంది. జానకి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే రామా వచ్చి మాట్లాడతాడు. అఖిల్ జెస్సి మీద అరుస్తాడు. పరిస్థితులు బాగుండే వరకు మీ ఇంటికి వెళ్ళేవాళ్ళం కదా అని అఖిల్ అంటాడు. జెస్సి మాత్రం ఇంటిని వదిలి వచ్చేది లేదని తెగేసి చెప్తుంది. జానకి వల్లే ఇలా అయిందని అఖిల్ తిడతాడు. ఆ మాటలన్నీ విని జానకి, గోవిందరాజులు బాధపడతారు. ప్రేమించడం తప్ప ద్వేషించడం ఏంటో తెలియని దేవతవి నువ్వు అని గోవిందరాజులు మెచ్చుకుంటాడు.
రామా వాళ్ళు గుడిలో క్యాటరింగ్ పనులు చేస్తూ ఉంటారు. అదే గుడికి జ్ఞానంబ, మల్లిక వస్తారు. అందరి పేరు మీద గుడిలో జ్ఞానంబ పూజ చేయిస్తుంది. పక్కనే రామా, జానకి పనులు చేస్తూ ఉంటారు. గుడిలో ఒకామే జ్ఞానంబని పలకరించి తన మనవడి బారసాల అని వచ్చి ఆశీర్వదించమని అడుగుతుంది.