అన్వేషించండి

Janaki Kalaganaledu February 3rd: తల్లిదండ్రులకు అబద్ధం చెప్పిన అఖిల్, నిలదీసిన జెస్సి- జ్ఞానంబ ఇంట్లో మలయాళం ఎంట్రీ

రామా చేసిన అప్పు వల్ల జ్ఞానంబ కుటుంబం కష్టాలపాలవుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

జెస్సీ స్వీట్ తీసుకొచ్చి జానకికి పెట్టి అఖిల్ కి ఉద్యోగం వచ్చేలా చేసినందుకు థాంక్స్ చెప్తుంది. అఖిల్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించలేదు అందుకే నీ మాట ప్రకారం నాన్నకి చెప్పానని జెస్సి చెప్తుంది. అప్పుడే అఖిల్ సంతోషంగా వచ్చి ఉద్యోగం వచ్చిందని చెప్తాడు. అది విని జ్ఞానంబ సంతోషిస్తుంది. జీతం ఎంత అని గోవిందరాజులు అడుగుతాడు. అఖిల్ రూ.15 వేలు అని అబద్ధం చెప్తాడు. పెద్ద చదువుకి అంత చిన్న ఉద్యోగం ఏంటని గోవిందరాజులు నిలదీస్తాడు. ఆ మాటలన్నీ విన్న జెస్సీ చాలా బాధపడుతూ అఖిల్ దగ్గరకి కోపంగా వెళ్తుంది. జీతం ఎంత అని అడిగితే రూ.30 వేలు అంటాడు. మరి ఎందుకు అత్తయ్య వాళ్ళకి అబద్దం చెప్పావ్ అని నిలదీస్తుంది. నిజం చెప్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు మొత్తం జీతం చెప్తే వాళ్ళు తీసేసుకుంటారని నిర్లక్ష్యంగా మాట్లాడతాడు.

Also Read: యష్, వేద క్యూట్ రొమాన్స్- పెళ్లి చేసుకుంటానని మాళవికకి మాటిచ్చిన అభిమన్యు

చదివించింది వాళ్ళే కదా. రూ.30 వేలు జీతానికే ఇంత స్వార్థం వచ్చిందా అని జెస్సి అంటుంది. ఈ ఇంట్లో ఉండబట్టే నువ్వు ఇలా తయారయ్యావ్ జీతం రాగానే వేరే ఇల్లు చూస్తాను వీళ్ళ దగ్గర నుంచి వెళ్లిపోవాలి. నా మాట కాదని అంటే నిన్ను కూడా వదిలేస్తానని అఖిల్ జెస్సిని బెదిరిస్తాడు. వ్యాపారం స్టార్ట్ చేసినందుకు మల్లిక సంతోషంగా తెగ డాన్స్ చేస్తుంది. అది చూసి విష్ణు ఏమైందని అడుగుతాడు. ఈ ఇల్లు వదిలి వేరే దారి చూసుకునే అవకాశం వచ్చిందని సంతోషపడుతుంది. మనం అనుకున్నట్టు షాపు పెట్టుకున్నాం, అఖిల్ కి కూడా ఉద్యోగం వచ్చింది వాళ్ళు వెళ్లిపోతారు మనం వెళ్లిపోతామని ఎగురుతుంది. ఏదో ఒక సాకు చెప్పి మనం బయటకి వెళ్లిపోవాలని అంటుంది. ఇక్కడే ఉంటే అప్పు తీర్చాల్సి వస్తుందని తిడుతుంది.

అందరూ సెటిల్ అయ్యారు రూ.20 లక్షలు అప్పు ఎన్ని రోజుల్లో తీరుస్తామని గోవిందరాజులు సంతోషపడతారు. తొందర్లోనే మంచి రోజులు వస్తాయని జ్ఞానంబ అంటుంది. అందరూ పనుల మీద బయటకి వెళ్లిపోతున్నారు, చికిత లేదు కదా జానకి ఒక్కతే కష్టపడుతుంది నా ఫ్రెండ్ కి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు వంట చేస్తాడు అతన్ని పెట్టుకుందామని సలహా ఇస్తాడు. అందుకు జ్ఞానంబ కూడా సరే అంటుంది. జానకి ఒక్కతే పని చేసుకుంటూ ఉండగా రామా వస్తాడు. జానకి కోసం ఐపీఎస్ పుస్తకం తీసుకొచ్చి బహుమతిగా ఇస్తాడు. అది చూసి జానకి మురిసిపోతుంది. మెటీరియల్ చూసి జానకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. పదేళ్ళ వయస్సులో నాకు దూరమైన కల మీరు సాధించాలి. మీరు పోలీస్ డ్రెస్ వేసుకోవడం చూడాలని రామా అంటాడు. మీ లక్ష్యం నెరవేరుస్తానని జానకి ఎమోషనల్ అవుతుంది.

Also Read: నందుకి బిజినెస్ ఐడియా ఇచ్చి సాయం చేసిన తులసి- అడ్డం తిరిగిన ప్రేమ్

అఖిల్ కి జాబ్ వచ్చిందని జానకి రామాకి చెప్తుంది. జెస్సి ప్రేగ్నన్సీకి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని డాక్టర్ చెప్పిందని జానకి అంటుంది. జ్ఞానంబ ఇంటికి గోవిందరాజులు చెప్పిన కొత్త వంటవాడు వస్తాడు. అతన్ని చూసి మల్లిక ఎవరు నువ్వు అని అడుగుతుంది. తన పేరు మలయాళం అని చెప్పేసరికి మల్లిక బిత్తరపోతుంది. కాసేపటికి గోవిందరాజులు వచ్చి మలయాళంని పలకరించి తన గురించి చెప్తాడు. వంట అద్భుతంగా చేస్తాడని గోవిందరాజులు అంటాడు. వంట నేర్చుకోమని కదా ఇక్కడికి పంపించిందని ఆ విషయం తెలిస్తే రానివ్వరని మలయాళం నిజం దాస్తాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bigg Boss Rohini: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
Telangana: మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Embed widget