అన్వేషించండి

Janaki Kalaganaledu February 14th: చరణ్ ని అరెస్ట్ చేయించిన జానకి- మల్లిక ప్లాన్ ఫెయిల్, ఆస్తి దక్కించుకున్న రామ

జానకి తన చరణ్ ని పట్టుకోవడంతో రామ చేసిన అప్పు తీరిపోతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

జానకి ఫ్రెండ్ మాధవి చరణ్ గురించి చెప్తుంది. రామ చెప్పినవన్నీ మాధవి చెప్పిన వాటితో మ్యాచ్ అవుతుందని జానకి తనని పట్టుకోవడానికి వెళ్తుంది. మల్లిక ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతుంది. అప్పుడే వెళ్లిపోతున్నారా అని గోవిందరాజులు అడుగుతాడు. భోజనం చేసి వెళ్ళవచ్చు కదా అని జ్ఞానంబ అంటుంది. కానీ అనుకున్న తర్వాత వెళ్లిపోవాలని మల్లిక తెగేసి చెప్తుంది. జ్ఞానంబ భోజనం చేసి వెళ్ళమని చెప్పినా కూడా వినదు. అప్పుడే అఖిల్ కూడా బయల్దేరాలని అనడం విని మీరు కూడా వెళ్తున్నారా అని జ్ఞానంబ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. జానకి మాధవి దగ్గర అడ్రెస్ తీసుకుని ఇంటర్వ్యూలు జరిగే ఆఫీసుకి వస్తుంది.

ఆఫీసులో ఉన్న చరణ్ ని జానకి చూసి రామ చూపించిన ఫోటో ఇతనిదే.. అక్కడ ప్రకాష్ అని చెప్పి ఇక్కడ సాయి చరణ్ అని నటిస్తున్నాడు. ఈరోజు నుంచి వీడికి ఇంకొక అవతారం ఎత్తే అవసరం లేకుండా చేస్తానని అనుకుంటుంది. జానకి చరణ్ దగ్గరకి వెళ్ళి జాబ్ వచ్చినందుకు తెగ సంతోషపడుతున్నట్టు నటిస్తుంది. రామకి చెప్పినట్టు జానకికి కూడా రూ.20 లక్షల ఆఫర్ చెప్తాడు. రూ.40 లక్షలు కడితే ఇంకా త్వరగా లాభం వచ్చేస్తుంది కదా అని జానకి ఆత్రంగా అడిగి దగ్గరకి వెళ్ళి కొట్టబోయి కూడా ఆగుతుంది. ఎంత మంది దగ్గర ఇలా నాటకం ఆడి మోసం చేస్తావ్ నీ వల్ల మా కుటుంబం రోడ్డు మీద పడిందని తిడుతుంది. నా వ్యాపారం జోలికి వస్తే నీ ప్రాణాలు తీస్తానని తనని కొట్టబోతుంటే రామా వచ్చి చరణ్ చెంప పగలగొడతాడు. నువ్వు చేసిన మోసం వల్ల నా తల్లి నాకు దూరం అయ్యింది డబ్బులు ఎక్కడ అని కొడుతూ బయటకి తీసుకెళ్తాడు.

అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇస్తారు. జానకి జరిగిందంతా చెప్పి చరణ్ ని అరెస్ట్ చేయిస్తుంది. అక్కడి వాళ్ళందరూ రామ వాళ్ళకి థాంక్స్ చెప్తారు. అఖిల్, విష్ణు వాళ్ళు బయటకి వెళ్ళేటయిం కి నీలావతి ఎదురుపడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ వేరు కాపురానికి బయల్దేరావా అని అంటుంది. కాసేపు నీలావతి మల్లికకి వత్తాసు పలుకుతూ జ్ఞానంబని సూటి పోటి మాటలతో దెప్పిపొడుస్తుంది. జ్ఞానంబ మీద మల్లిక లేనిపోని ప్రేమ నటిస్తుంది. ఆస్తులు పోయినంత మాత్రం అందరూ విడిపోవాలని అనుకొనని జ్ఞానంబ అంటుంది. ఇరుకు ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి వెళ్లిపోతున్నారు బయల్దేరండి అని నీలావతి అంటుంది. మల్లిక సంబరంగా వెళ్లబోతుంటే జానకి ఎంట్రీ ఇచ్చి అవసరం లేదని చెప్తుంది. అందరం పాత ఇంటికి వెళ్దామని జానకి చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. అది మనది కాదని తోసేశారు కదా అని మల్లిక అంటుంది. ఇప్పుడు అది మనదే అని జానకి చరణ్ ని అరెస్ట్ చేసిన విషయం మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్తుంది.

ఆ డబ్బుతో ఇల్లు విడిపించామని చెప్పడంతో జ్ఞానంబ, గోవిందరాజులు సంతోషిస్తారు. భారీ భారీ డైలాగులు చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉంటే బాగుండేదని మల్లిక తిట్టుకుంటుంది. ఇప్పటికైనా అర్థం అయ్యిందా వాడు తప్పు చేయలేడాని తమ్ముడు కోసం ఇదంతా చేశాడని గోవిందరాజులు అంటాడు. మన ఇల్లు అయితే ఇబ్బంది లేదు ఈ ఇల్లు అయితేనే ఇబ్బంది అన్నావ్ కదా పదండి అందరం కలిసి పాత ఇంటికి వెళ్దామని రామ చెప్పేసరికి మల్లిక తల ఊపుతుంది. అఖిల్ నీ ఆఫీసు కూడా అక్కడకి దగ్గర కదా వెళ్దాం పద అని జానకి అనేసరికి జెస్సి నవ్వుతుంది. నీ బిడ్డ ఎప్పుడు తప్పు చెయ్యడమ్మా అని రామ ఇంటి కాగితాలు తల్లి చేతిలో పెడతాడు.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 7th: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget