Janaki Kalaganaledu August 4th Update: జానకి షాకింగ్ నిర్ణయం - జానకి ఐపీఎస్ కలని జ్ఞానంబ నెరవేరుస్తుందా? మల్లిక మీద అరిచిన గోవిందరాజులు
జానకిని ఐపీఎస్ చదివిస్తహూననడాని తెలిసి జ్ఞానంబ రామాతో మాట్లాడటం మానేస్తుంది. దీంతో రామా అల్లాడిపోతాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
ఒక చిన్న తప్పు చేశారని పేగు బంధాన్ని తెంచేసుకుంటావా, ప్రేమ బంధాన్ని వదిలేసుకుంటావా అని గోవిందరాజులు అంటాడు. ఆ బాధే నా మనసుని రంపపు కోత పెడుతుంది. నాకు చెప్పకుండా నా కొడుకు నిద్ర కూడా పోడని గుడ్డిగా నమ్మేదాన్ని చివరికి ఈ అమ్మని వాడు నిజంగానే గుడ్డి దాన్ని చేసేశాడు. వాడికి వాడి భార్య కల అర్థం అయింది కానీ వాడి కోసం ఈ అమ్మ పడే బాధ మాత్రం అర్థం కాలేదు వాడు నా ప్రేమని పెంపకాన్ని అవమానించాడు అని జ్ఞానంబ బాధపడుతుంది. 'లేదు జ్ఞానం నువ్వు నీ కొడుకుని అపార్థం చేసుకుంటున్నావ్ నువ్వు నీ కొడుకుని అర్థం చేసుకోలేకపోయావ్ నువ్వు నిజంగా నీ కొడుకుని అర్థం చేసుకుని ఉంటే అటు భార్యకి ఇచ్చిన మాట కోసం ఇటు తల్లి కోసం ఎంతగా నలిగిపోయాడో అర్థం చేసుకునేదానివి.. ఇటు నీకు చెప్పే ధైర్యం లేక అటు భార్య కన్నీళ్ళు చూడలేక ఎంత నలిగిపోయాడో, నువ్వు నిజం చెప్పలేదని బాధపడుతున్నావే కానీ ఒక్కసారి అమ్మకి నిజం చెప్పకుండా దాచినందుకు నీ కొడుకు ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించావా? ఎన్ని నిద్రలు లేని రాత్రులు గడిపాడో అర్థం చేసుకున్నావా.. ఆ శ్రీరాముడైనా తండ్రి మాట జవాదాటాడేమో కానీ నీ కొడుకు మాత్రం తల్లి మాట జవాదాటడు. తన భార్య కల నెరవేర్చి దుఖాన్ని దూరం చెయ్యాలని అనుకున్నాడే తప్ప తల్లి నమ్మకాన్ని మోసం చెయ్యాలని చూడలేదు, వాడు అలా తన ప్రాణం పోయినా చేయ్యడు. నీలో ఉన్న ఇంకో భయం జానకి తన మనసు మార్చి నీ కొడుకుని నీకు దూరం చేసిందని.. ఒక మాట అడుగుతాను నిజం చెప్పు ఆ రోజు గుడిలో మనందరి ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలని పణంగా పెట్టబోయింది. మన కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా లెక్క చేయని అమ్మాయి చదువుకున్నా అనే అహంకారంతో తన భర్త ప్రాణాలు తీసుకునే విధంగా అవమానిస్తుందా.. జానకి భర్త గౌరవాన్ని నిలబెట్టేందుకు చూస్తుందే తప్ప అగౌరవపరచాలని అనుకోదు అందుకు సాక్ష్యం వంటల పోటీలో తన భర్తని గెలిపించడమే' అని చెప్తుంటే మల్లిక అడ్డుపడుతుంది.
అత్తయ్యగారికి మంచి ఏదో చెడు ఏదో తెలుసు.. ఏ నిర్ణయం తీసుకున్నా అంతా ఆలోచించే తీసుకుంటారు. అలాంటి అత్తయ్యగారి నిర్ణయాన్ని తప్పు అని చెప్పడం ఏమి బాగోలేదు మావయ్యగారు అని పుల్లల మల్లిక అంటుంది. అలా చెప్పడం అంటే అత్తయ్యగారిని అవమానించడమే అనేసరికి గోవిందరాజులు కోపంగా మల్లిక నువ్వు మాట్లాడకు నోరు మూసుకుని ఉండు అని గట్టిగా అరుస్తాడు. విష్ణు కూడా మల్లికని తిడతాడు. నువ్వు క్షమిస్తే గతం మారకపోవవచ్చు కానీ వాళ్ళ భవిష్యత్ బాగుంటది అని చెప్తాడు. జానకి జ్ఞానంబ కాళ్ళ మీద పడుతుంది. అత్తయ్య గారు మీరు నాకు ఏ శిక్ష అయినా వేయండి కానీ ఆయన మీతో మాట్లాడకుండా ఉండలేరు మీరు నా తల్లిగా అనుకుని కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను దయచేసి ఆయనతో మాట్లాడండి అని బతిమలాడుతుంది. సముద్రమంత బాధ భరించగలను కానీ నీ మౌనాన్ని భరించలేను మా మంచి అమ్మవి కాదు నాతో మాట్లాడమ్మా అని రామా కంటతడి పెట్టుకుంటాడు. నా పంతం కోసం పిల్లల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అని జ్ఞానంబ అనుకుని జానకి ఇచ్చిన వాయనాన్నితీసుకుని తనని ఆశీర్వదిస్తుంది. అది చూసి మల్లిక ఏడుస్తుంటే ఇంట్లో అందరూ సంతోషిస్తారు.
Also read: ఏకాంత వేళ మనసులో మాటలు బయటపెట్టిన వేద, యష్- ఖైలాష్ ని విడిపించేందుకు అభి ప్లాన్
'నా ఐపీఎస్ కలని ఈ క్షణం నుంచి వదిలేస్తున్నాను మీ సాక్షిగా నా మనసులో నుంచి చదువు మీద ఉన్న ఇష్టాన్ని తీసేస్తున్నాను. మా అత్తయ్యగారు ప్రతిసారి నాకు ఒక మాట చెప్తారు. పుట్టింటి నుంచి అత్త ఇంటికి వచ్చానని అనుకోకు పుట్టింటి నుంచి పుట్టింటికి వచ్చానని అనుకో అని చెప్తుంది. నన్ను అలాగే చూసుకున్నారు అమ్మలా నాకు ప్రేమ పంచారు, కన్న వాళ్ళు లేరనే బాధని మనసులోకి రాకుండా చూసుకున్నారు. అలాంటి అమ్మని కంట తడి పెట్టించడం కంటే మరొక పాపం ఉండదు నాన్న. అందుకే ఎప్పుడు సంతోషంగా ఉండాల్సిన ఈ ఇంటికి దుఖం రాకుండా ఉండటం కోసం ఐపీఎస్ కలని వదిలేసుకుంటాను నాన్న. దయచేసి మీ కూతురు పరిస్థితి అర్థం చేసుకోండి. వచ్చే జన్మ ఉంటే మీ ఐపీఎస్ కలని నిలబెడతాను’ అని జానకి తన తల్లిదండ్రుల ఫోటో ముందు నిలబడి ఏడుస్తుంది. ఆ మాటలన్నీ జ్ఞానంబ వింటుంది. అదంతా చూస్తూ రామా కూడా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఇక నా చదువు విషయాన్ని మనం వదిలేద్దాం అని జానకి రామాని ప్రాదేయపడుతుంది.
Also Read: తండ్రి గురించి ఎంక్వైరీ మొదలుపెట్టిన దేవి - కుమిలిపోతున్న దేవుడమ్మ, సత్య