Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!
‘జగమే మాయ’ సినిమా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చైతన్య, తేజ, ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ కు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవల విడుదల చేసింది చిత్ర యూనిట్.
ప్రస్తుతం ఓటీటీ ల హవా నడుస్తోంది. కరోనా తర్వాత ఓటీటీ లకు విపరీతమైన డిమాండ్ వచ్చేసింది. చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటీటీ లు మంచి ఫ్లాట్ ఫామ్ గా నిలుస్తున్నాయి. పెద్ద సినిమాలు థియేటర్ ల లో విడుదల అవుతున్నా.. మళ్లీ కొన్ని వారాలకు ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతున్నాయి. డిజిటల్ వేదికగా విడుదలైన చాలా సినిమాలు మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా సునీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగమే మాయ’ సినిమా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చైతన్య, తేజ, ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ కు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవల విడుదల చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ధన్య బాలకృష్ణన్, చైతన్య రావును పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లయిన ఆరు నెలల్లోనే భర్తను కోల్పోతుంది. అలాగే మరోవైపు నటుడు తేజ ప్రేమించిన అమ్మాయి కోసం యూఎస్ వెళ్తాడు. అక్కడ ఆ అమ్మాయి కోసం వెతుకుతుండగా అప్పటికే ఆమెకు వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయిందని తెలుస్తుంది. తర్వాత డబ్బు కోసం ధన్య ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు తేజ. అలా వాళ్లు పెళ్లి చేసుకుంటారు. తర్వాత అసలు విషయం తెలుస్తుంది. ధన్య ప్లాన్ లోనే తాను ఇరుక్కన్నాను అని తెలుసుకుంటాడు తేజ. అసలు ధన్య ప్లాన్ ఏమిటీ? ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ ప్లాన్ నుంచి తేజ తప్పించుకున్నాడా? ఎవరు ఎవరి చేతుల్లో మోసపోయారు? వంటి అంశాలు తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
మొత్తంగా సినిమా ట్రైలర్ చూస్తే.. సమాజంలో డబ్బు కోసం ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో చూపించే విధంగా సినిమా ఉంటుందనిపిస్తోంది. ముగ్గురు వ్యక్తుల మధ్య ఉన్న రిలేషన్ పై డబ్బు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. డబ్బు కోసం ఒకర్ని ఒకరు ఎలా మోసం చేసుకుంటారు అనే అంశాలను విలక్షణంగా చూపించారు. టైటిల్ కు తగ్గట్టు గానే సినిమా సస్పెన్స్, థ్రిల్లర్ లా కనిపిస్తోంది. సినిమాలో ట్విస్ట్ లు కూడా బానే ఉన్నాయని తెలుస్తోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగానే ఉంది.
ఇక ఈ సినిమాలో ధన్య బాలకృష్ణన్ చిత్ర పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్య కనిపించనున్నాడు. మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 15 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీ ప్రేక్షకులను ఈ మూవీ ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read : గ్యాంగ్‌స్టర్‌గా పవన్, జపనీస్ లైన్ అర్థం ఏమిటో తెలుసా? సుజిత్ పోస్టర్ డీకోడ్ చేస్తే