Jabardasth New Love Story: 'జబర్దస్త్'లో మరో ప్రేమకథ - నరేష్‌కు ముద్దుపెట్టిన షబీనా! గోల్డ్ చైన్ కోసమేనా?
'జబర్దస్త్'లో మరో ప్రేమకథ మొదలైందా? లేదంటే ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేయడం కోసం మరో జోడీని రెడీ చేస్తున్నారా? లేక గోల్డ్ చైన్ కోసం ఇచ్చిన ముద్దా?
'జబర్దస్త్', 'ఎక్స్‌ట్రా జబర్దస్త్'లో కామెడీ ఒక ఎత్తు! ఫిమేల్ ఆర్టిస్టులకు, కమెడియన్లకు మధ్య చూపించే లవ్ ట్రాక్స్ మరో ఎత్తు. కామెడీ స్కిట్స్‌లో 'సుడిగాలి' సుధీర్ - రష్మీ గౌతమ్, వర్ష - ఇమ్మాన్యుయేల్ మధ్య లవ్ ట్రాక్స్ షోకు స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాయి. టీఆర్పీ కోసం వేసిన ఎత్తుగడలో పుట్టుకు వచ్చిన ప్రేమకథలే తప్ప... 'జబర్దస్త్'లో ప్రేమికులు ఎవరు లేరనేది టీవీ ఇండస్ట్రీ చెప్పే మాట. అది పక్కన పెడితే... ఇప్పుడు కొత్తగా మరికొన్ని ప్రేమకథలు పుట్టుకు వచ్చాయి.
ప్రతి శుక్రవారం 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వారం ప్రేమికుల రోజు కంటే రెండు మూడు రోజుల ముందే శుక్రవారం వచ్చింది. అయినా సరే... 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' వాలంటైన్స్ డే స్పెషల్ అంటూ ఫిమేల్ ఆర్టిస్టులు, కమెడియన్స్ మధ్య ప్రేమ కహానీలను తెరపైకి తీసుకొచ్చారు. కొన్ని రోజులుగా స్కిట్స్‌లో షబీనా అంటే తనకు ఇష్టం ఉన్నట్టు 'నాటీ' నరేష్ బిహేవ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
'షబ్బుకు వాలంటైన్ డే గిఫ్ట్ ఏం ఇస్తావ్?' అని రోజా అడగ్గానే... 'నా చైన్ ఇస్తా' అంటూ మెడలో గోల్డ్ చైన్ తీసి షబీనా మెడలో వేశాడు 'నాటీ' నరేష్. తన మోకాలి మీద కూర్చోమని అతడు అడగ్గా... ఆమె ముందు వద్దని వారించినా, తర్వాత కూర్చున్నారు. నరేష్ బుగ్గ మీద ముద్దు పెట్టారు. నరేష్ ఏమో హైట్ తక్కువ. ప్రేమకు ఎత్తు అడ్డు కాదనుకోండి. కానీ, నిజంగా నరేష్‌ను షబీనా ప్రేమిస్తుందా? లేదంటే గోల్డ్ చైన్ కోసం ముద్దు పెట్టిందా? అనేది కొందరి సందేహం. ఇదీ టీఆర్పీ కోసం వేసిన ఎత్తుగడ ఏమో అని మరికొందరి సందేహం. అదీ సంగతి!
'జోర్దార్' సుజాత అంటే తనకు ఇష్టమని 'రాకింగ్' రాకేష్ తెలిపాడు. "అందరికీ రాకింగ్ రాకేష్ ఏమో... నాకు మాత్రం కింగ్ రాకేష్" అని జోర్దార్ సుజాత చెప్పడం విశేషం. ఎప్పటిలా వర్మ, ఇమ్మాన్యుయేల్ ప్రేమ డైలాగులు చెప్పుకొచ్చారు. ఫైమా మీద ఒక నటుడు ప్రేమ ఉందని చెప్పాడు. ఒకవేళ ఇష్టం లేకపోతే వెనక్కి వెళ్లి తాను ఇచ్చిన లవ్ బెలూన్ పగలగొట్టామని కోరాడు. ఇవన్నీ నిజంగానే ప్రేమకథలా? లేదంటే ప్రేమికుల రోజు సందర్భంగా చేసిన ఎపిసోడ్ కోసం పుట్టుకు వచ్చాయా? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. ప్రోమోలో చూపించిన లవ్ ప్రపోజల్స్‌లో 'సుడిగాలి' సుధీర్ - రష్మీ గౌతమ్ మధ్య ప్రపోజల్ లేకపోవడం విశేషం.