Anasuya: ట్రెడిషనల్ క్యారెక్టర్ లో అనసూయ.. ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్..
రవితేజ నటించిన 'ఖిలాడి' సినిమాలో నటించింది అనసూయ. సినిమాలో ఆమె పాత్ర ఎలా వుండబోతుందనే విషయం ఇప్పుడు బయటకొచ్చింది.
యాంకర్ అనసూయ బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తన సత్తా చాటుతోంది. సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ.. తన క్రేజ్ ను పెంచుకుంటుంది. ఇటీవల 'పుష్ప' సినిమాలో దాక్షాయణి క్యారెక్టర్ లో కనిపించింది ఈ బ్యూటీ. డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తూ.. తన నటనతో ఆకట్టుకుంది. 'పుష్ప' పార్ట్ 2లో అనసూయ రోల్ హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ రవితేజ నటించిన 'ఖిలాడి' సినిమాలో నటించింది. సినిమాలో ఆమె పాత్ర ఎలా వుండబోతుందనే విషయం ఇప్పుడు బయటకొచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో అనసూయ డ్యూయల్ రోల్ పోషించిందట. అందులో ఒక పాత్ర బ్రాహ్మణ మహిళ పాత్ర అని తెలుస్తోంది. రెండో పాత్ర ఎలా ఉంటుందనేది తెలియలేదు.
అయితే కథ ప్రకారం.. ఒక పాత్ర చనిపోతుందట.. రెండో పాత్ర మాత్రం సినిమా మొత్తం కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన ఫుల్ లెంగ్త్ రోల్ ఇదేనని టాక్. ఈ సినిమాతో అనసూయ కెరీర్ మలుపు తిరుగుతుందని అంటున్నారు. మరి ఆమె ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. కోనేరు సత్యనారాయణ, హవీష్ నిర్మించిన ఈ సినిమాను రమేష్ వర్మ డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
View this post on Instagram
View this post on Instagram