అన్వేషించండి

Bheemla Nayak: పవన్ సినిమాను తప్పించాలని ఎందుకింత ఆరాటం..?

కావాలనే 'భీమ్లానాయక్'ను టార్గెట్ చేసి సినిమా సంక్రాంతికి రావడం లేదని చెబుతున్నారు. నిన్న కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది.

పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తోన్న 'భీమ్లానాయక్' సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని అందరికంటే ముందుగానే స్లాట్ బుక్ చేసింది టీమ్. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చి కొన్ని నెలలు దాటేసింది. కానీ ఇప్పుడు ఈ సినిమా పండక్కి రావడం ఇండస్ట్రీలో చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. రాజమౌళి డైరెక్ట్ చేసిన 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఎప్పుడైతే జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారో.. అప్పటివరకు సంక్రాంతి రేసులో ఉన్న మహేష్ సినిమా తప్పుకుంది. కానీ పవన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. 

సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా సంక్రాంతి రావడం లేదని ప్రచారం జరుగుతోంది. ఎప్పటికప్పుడు ఈ ప్రచారాన్ని చిత్రబృందం ఖండిస్తూనే ఉంది. అయినప్పటికీ కొందరు కావాలనే 'భీమ్లానాయక్'ను టార్గెట్ చేసి సినిమా సంక్రాంతికి రావడం లేదని చెబుతున్నారు. నిన్న కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. వెంటనే నిర్మాత నాగవంశీ స్పందిస్తూ.. జనవరి 12న తమ సినిమా రావడం పక్కా అని మరోసారి చెప్పారు. 

నిజానికి ఈ సినిమాను సంక్రాంతి రేసు నుంచి తప్పించడానికి చాలా రోజులుగా ఇండస్ట్రీలో కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నారు. దిల్ రాజు కూడా సినిమాను వాయిదా వేయమని అడుగుతున్నారు. రాజమౌళి స్వయంగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఆ మీటింగ్ జరగలేదు. 'ఆర్ఆర్ఆర్' సినిమా మీద బయ్యర్లు భారీ పెట్టుబడులు పెట్టారని.. 'భీమ్లానాయక్' కూడా తమ సినిమాతో పాటు విడుదలైతే థియేటర్లు షేర్ చేసుకోవాల్సి వస్తుందనేది 'ఆర్ఆర్ఆర్' నిర్మాతల ఆవేదన. 

అయితే ఈ విషయంలో ఒక్క 'భీమ్లానాయక్'ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సంక్రాంతికి మరో పెద్ద సినిమా 'రాధేశ్యామ్' కూడా ఉంది. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదు. అది పాన్ ఇండియా సినిమా అని.. రిలీజ్ డేట్ మార్చడం కష్టమని వివరణ ఇస్తున్నారు. మరోపక్క 'భీమ్లానాయక్' సినిమా రేసు నుంచి తప్పుకుంటే నాగార్జున తన 'బంగార్రాజు'ని విడుదల చేయాలని చూస్తున్నాడు. 

నిర్మాత సుప్రియ ఈ విషయాన్ని నేరుగా మీడియాతోనే చెప్పారు. సంక్రాంతి బరి నుంచి ఏదైనా సినిమా తప్పుకుంటే తమ సినిమా రావడం ఖాయమని అన్నారు. అంటే 'బంగార్రాజు విషయంలో కూడా ఎవరికీ అభ్యంతరాలు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నాగార్జున సినిమాకైతే థియేటర్లు షేర్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ పవన్ సినిమా అనేసరికి మాత్రం వాయిదా వేయాలని అడుగుతున్నారు. ఈ విషయంలో పవన్ నిర్మాతలతో పాటు.. ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అవుతున్నారు. కావాలనే తమ హీరోని టార్గెట్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read:'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..

Also Read: అషూ రెడ్డి ప్రెగ్నెంట్.. తల్లి చేతిలో చావుదెబ్బలు, వీడియో వైరల్

Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?

Also Read: అల్లు అర్జున్‌ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?

Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...

Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
Nana Patekar Passes Away : ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత - గుండెపోటుతో 75 ఏళ్ల వయసులో మృతి!
ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత - గుండెపోటుతో 75 ఏళ్ల వయసులో మృతి!
Karthika Deepam 2 Serial Today October 8th: కార్తీకదీపం 2 సీరియల్: రోడ్డు మీద అంట్లు తోముతున్న సుమిత్ర! టిఫెన్ కొట్టు దగ్గర కొట్టుకున్న 2 ఫ్యామిలీలు!
కార్తీకదీపం 2 సీరియల్: రోడ్డు మీద అంట్లు తోముతున్న సుమిత్ర! టిఫెన్ కొట్టు దగ్గర కొట్టుకున్న 2 ఫ్యామిలీలు!
Jagadhatri Serial Today October 7: పిచ్చిదానిలా ఆస్పత్రిలో చేరిన వైజయంతి..సింధూను తీసుకుని వచ్చిన జేడీ,కేడీ
జగద్ధాత్రి సీరియల్: పిచ్చిదానిలా ఆస్పత్రిలో చేరిన వైజయంతి..సింధూను తీసుకుని వచ్చిన జేడీ,కేడీ

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Embed widget