By: ABP Desam | Updated at : 13 Feb 2023 02:06 PM (IST)
Image Credit: Sara Ali Khan/Instagram
బాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఎవరిని చూసినా ఒకే విషయంపై చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏ విషయంపై ఇంత చర్చ అనుకుంటున్నారా..? ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ గురించి. ఆయన త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం జోరందుకుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ చిత్రపరిశ్రమలో అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఎంతో కాలం నుంచి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇబ్రహిం అరంగేట్రం కాస్త ఆలస్యం కావడంతో పలు ఊహాగానాలకు దారి తీసిన విషయం తెలిసిందే.
కరణ్ జోహార్ రాబోయే ప్రొడక్షన్ వెంచర్ తో ఇబ్రహీం అలీ ఖాన్ బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారనే బజ్ బలంగా ఉంది. అయితే తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే తన తొలి చిత్రం షూటింగ్‌కు ఇబ్రహిం హాజరుకానున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు ‘సర్జమీన్’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఇబ్రహీం కీలక పాత్ర షోషించనున్నారని సమాచారం. ఈ పాత్ర కోసం ఇబ్రహిం తన శరీరాకృతిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. ఇందుకు కావల్సిన కావాల్సిన వర్కవుట్స్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే జరుగుతోంది. మేకర్స్ సైతం షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలోనే ఇబ్రహీం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇబ్రహీం సైఫ్ అలీ ఖాన్ -అమృతా సింగ్‌లకు రెండవ సంతానం. సైఫ్ అలీఖాన్ యంగ్ ఏజ్‌లో ఉన్నట్లుగానే.. ప్రస్తుతం ఇబ్రహీం లుక్స్ ఉన్నాయంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సారా 2018లో ‘కేదార్‌నాథ్’ మూవీతో అరంగేట్రం చేసింది. ఆ చిత్రంతోనే ఆమె ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది. తర్వాత ‘సింబా’ తదితర సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది.
ఇబ్రహీం నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన కాజోల్ కూడా కీలక పాత్రలో కనిపించే చాన్స్ ఉందట. ఈ కథ కశ్మీర్‌లోని ఉగ్రవాదం నేపథ్యంలో సాగుతుందని, రక్షణ దళాల చుట్టూ తిరుగుతుందని సమాచారం. గతంలో 'అజీబ్ దాస్తాన్స్' నుంచి 'అంకాహి' అనే షార్ట్‌ని హెల్మ్ చేసిన బోమన్ ఇరానీ కుమారుడు కయోజ్ ఇరానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. అయితే, ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.
Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్
NTR30 Shooting : గోవాకు ఎన్టీఆర్ 30 సెకండ్ షెడ్యూల్ - ఎప్పటి నుంచి అంటే?
Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ
Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్
Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ
Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్
Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ
Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల
YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?