News
News
వీడియోలు ఆటలు
X

నాకు కోపం ఎక్కువ, అందుకే అతడి చెంప పగలగొట్టా: సంయుక్త మీనన్

ఇటీవల వచ్చిన విరూపాక్ష, సార్ మూవీస్ తో వరుస విజయాలు దక్కించుకున్న సంయుక్త మీనన్... తాను సమంతకు వీరాభిమాని అని చెప్పింది. ఆమె నటనంటే చాలా ఇష్టమని.. తనను ఆమెలా ఉంటానని చెప్తే సంతోషంగా అన్పిస్తుందన్నారు.

FOLLOW US: 
Share:

Samyuktha Menon : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన సంయుక్త మీనన్.. ఇటీవల జరిగిన  ఓ ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తనకు కోపం ఎక్కువని, దాని వల్ల తన లైఫ్ లో ఫేస్ చేసిన ఓ ఇన్సిడెంట్ ను తెలియజేశారు.

తన తల్లితో కలిసి రోడ్డుపై వెళ్తున్నపుడు ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ ఆ పొగను తమపై వదిలాడని సంయుక్త మీనన్ చెప్పుకొచ్చారు. దీంతో కోపంతో ఆ వ్యక్తి చెంప పగలగొట్టానని ఆమె వెల్లడించింది. ప్రయాణం చేయడం.. ఒంటరిగా ఉండటం చాలా ఇష్టమన్న ఆమె.. ఎక్కువగా హిమాలయాలకు వెళ్తుంటానని.. ఖాళీ సమయాల్లో కవితలు రాస్తుంటానని ఇంట్రస్టింగ్ విషయాలను షేర్ చేసింది. చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు విడిపోయారని, అందుకే తండ్రి ఇంటి పేరును తన పేరులో నుంచి తీసేశానని సంయుక్త స్పష్టం చేసింది. 

సమంతతో పోలీస్తే ఎలా ఉంటుందంటే..

ఇక టాలీవుడ్ హీరోయిన్లలో సమంత తనకు నచ్చిన హీరోయిన్ అని, ఆమెకు తాను వీరాభిమాని అని సంయుక్త చెప్పింది. సమంత నటనంటే తనకు చాలా ఇష్టమని.. తనను ఆమెలా ఉంటానని చాలా మంది అంటూ ఉంటారని తెలిపింది. ఇక ఆమెలా నటిస్తున్నానని చెప్తుంటే తనకు ఇంకా సంతోషంగా ఉంటుందని సంయుక్త ఆనందం వ్యక్తం చేసింది. 

ధనుష్ నటన అంటే ఇష్టం..

తమిళ హీరోల విషయానికొస్తే ధనుష్ నటన నచ్చుతుందని సంయుక్త చెప్పింది. తాను 10వ తరగతిలో ఉన్నప్పుడు ధనుష్ నటించిన 'ఆడుగళం' సినిమాలోని పాటలకు డాన్స్ చేసేదాన్నని తెలిపింది. అలాంటిది ఆయనకు జంటగా నటిస్తానని ఊహించలేదని.. తన నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ చేయాలని ఉందని స్పష్టం చేసింది. 

మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కి జోడీగా 'బింబిసార'లో కనిపించిన సంయుక్త మీనన్.. మరోసారి అదే హీరోతో ‘డెవిల్’ అనే చిత్రంలో నటిస్తోంది. దాంతో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న ఓ సినిమాలోనూ సంయుక్తను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సంయుక్త వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటోంది. తక్కువ సమయంలోనే ఎంతో పాపులారిటీని దక్కించుకున్న ఈ బ్యూటీ.. ధనుష్ 'సార్' చిత్రంలో నటించి, ప్రేక్షకులను అలరించింది. ఇటీవల సాయి ధరమ్ తేజ్ సరసన 'విరూపాక్ష' సినిమాలోనూ నటించి మరో హిట్ ను దక్కించుకుంది. 

కన్నడ, మలయాళం, తమిళంతో పాటు తెలుగు సినిమాల్లోనూ మంచి నటిగా పేరు తెచ్చుకున్న సంయుక్త.. 1995 సెప్టెంబర్ 11న పాలక్కడ్‌లో జన్మించింది. ఇక ఆమె చదువు విషయానికొస్తే.. ఎకానమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. 2016లో మలయాళం మూవీ ‘పాప్ కార్న్’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో సంయుక్త చేసిన అంజనా పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. కన్నడ, మలయాళం, తమిళంతో పాటు తెలుగు సినిమాల్లోనూ మంచి నటిగా పేరు తెచ్చుకున్న సంయుక్త.. 1995 సెప్టెంబర్ 11న పాలక్కడ్‌లో జన్మించింది. ఇక ఆమె చదువు విషయానికొస్తే.. ఎకానమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. 2016లో మలయాళం మూవీ ‘పాప్ కార్న్’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో సంయుక్త చేసిన అంజనా పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. 

Read Also: 'అన్నీ మంచి శకునములే' మూవీకి ‘ప్రాజెక్ట్ కె‘ సపోర్ట్ - అడగకుండానే ప్రజలకు సాయం, ఇదిగో వీడియో!

Published at : 16 May 2023 02:03 PM (IST) Tags: Nandamuri Kalyan Ram Sai Dharam Tej Pawan Kalyan Samyuktha Menon Samantha Virupaksha. Bhimla Naik

సంబంధిత కథనాలు

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?