Hyper Aadi: అందుకే మా జుట్టు రాలడం లేదు - హైపర్ ఆది ప్రశ్నకు రవితేజ అదిరిపోయే జవాబు!
డిసెంబర్ 23న రవితేజ నటించిన ‘ధమాకా’ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో రవితేజ తో హైపర్ ఆది చేసిన ఓ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది.
టాలీవుడ్ మాస్ మహరాజ్ నటించిన సినిమా ‘ధమాకా’. ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల హైపర్ ఆది ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రవితేజ. ఇందులో రవితేజతో పాటు ఆయనతో సినిమాలు తీసి హిట్ కొట్టిన ముగ్గురు యువ డైరెక్టర్లు కూడా పాల్గొన్నారు. ‘పవర్’ సినిమా దర్శకుడు బాబీ, ‘బలుపు’ దర్శకుడు గోపిచంద్ మలిలేని, ‘రాజా ది గ్రేట్’ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఇంటర్య్వూలో కనిపించారు. ఈ నలుగురు కలయికతో ఇంటర్య్యూలో ఫుల్ జోష్ వచ్చింది. దీనికి తోడు హైపర్ ఆది తన కామెడీతో చాాలా సరదాగా సాగింది.
ఇంటర్వ్యూలో హైపర్ ఆది సెంటర్ లో కూర్చోగా రవితేజ, బాబీ ఓ వైపు మరో వైపు అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆది పంచ్ డైలాగ్ లు నవ్వు తెప్పించాయి. ‘‘నాకు సెంటర్ చైర్ వేశారేంటి, మీరందరూ కలిసి నన్ను సెంటర్ చేద్దామనా’’ అని హైపర్ ఆది అంటే అనిల్ రావుపూడి ‘‘నిన్ను సెంటర్ చేసే వాడు ఉన్నాడా’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. అయినా మా అందరికీ సెంటర్ రవితేజ అని ఆదికి పంచ్ వేశారు అనిల్. హెయిర్ ఫాల్ అవ్వకుండా మీరందరూ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని ఆది అడిగితే.. దానికి రవితేజ బదులిస్తూ హ్యాపీగా ఉంటే అన్నీ బానే ఉంటాయి. మేము ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాం అందుకే జుట్టు రాలదు’’ అని ఆన్సర్ ఇచ్చారు.
రవితేజ సినిమాల గురించి ఆది వారితో చర్చిస్తూ.. ‘పవర్’, ‘బలుపు’, ‘రాజా ది గ్రేట్’ సినిమాలు ఇప్పటికీ నిన్న మొన్న వచ్చిన సినిమాల్లా అనిపిస్తాయని అన్నారు. ఆయన సినిమాలు చూసినవారికి తెలియకుండానే రవితేజ బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ వచ్చేస్తాయని, అంతగా ఆయన నటన ఆకట్టుకుంటుందని అన్నారు. తమ కామెడీ స్కిట్ లలో కూడా రవితేజ సినిమాల్లో ఎన్నో సన్నివేశాలను స్పూర్తిగా తీసుకొని చేస్తుంటామని అన్నారు. ‘ధమాకా’ సినిమాలో కూడా రవితేజ అదే ఎనర్జీతో కనిపించారని అన్నారు. ఇప్పటికే ‘ధమాకా’ నుంచి వచ్చిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయని వాటిపై ఎన్నో రీల్స్ వచ్చాయని అన్నారు. రీసెంట్ టైమ్ లో వచ్చిన రవితేజ సినిమాల్లో ఆల్బమ్ మొత్తం సూపర్ హిట్ అయిన సినిమా ‘ధమాకా’ అని అన్నారు. ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చిందన్నారు. సినిమా గురించి రవితేజ మాట్లాడుతూ.. ‘ధమాకా’ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సినిమా అని అన్నారు. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అన్నారు.
Also Read: ధమాకా రివ్యూ - 2022ని రవితేజ హిట్టుతో ముగించాడా? థియేటర్లో ధమాకా పేలిందా? తుస్సుమందా?
అలాగే ఇంటర్వ్యూలో ‘ధమాకా’ సినిమా గురించి అనేక ప్రశ్నలు రవితేజను అడిగారు ఆది. అంతేకాకుండా ఆది నలుగురునీ రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడగ్గా వాటికి చాలా ఫన్నీగా సమాధానాలు చెప్తూ నవ్వులు పూయించారు. ఇక ‘ధమాకా’ సినిమా ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పెళ్లి సందడి’ సినిమా ఫేమ్ శ్రీలీల ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించనుంది.