అన్వేషించండి

Ammaadi Lyrical Video: 'హాయ్ నాన్న' థర్డ్ సింగిల్ వచ్చేసింది, నాని, మృణాల్ కెమిస్ట్రీ అదుర్స్ అంతే!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం 'హాయ్ నాన్న'. ఈ మూవీ నుంచి మేకర్స్ థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు. 'అమ్మాడి' అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

‘దసరా’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు ‘హాయ్ నాన్న’ సినిమాతో ప్రేక్షకుల ముందుక రాబోతున్నారు. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కొద్ది రోజుల క్రితం మ్యూజిక్ ప్రమోషన్ మొదలు పెట్టిన చిత్రబృందం వరుసగా పాటలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి.  ఫస్ట్ సింగిల్ 'సమయమా' పాటలో నాని, మృణాల్ ఠాకూర్ మధ్య లవ్ ప్రేమను చూపించగా, రెండో పాట 'గాజు బొమ్మ'లో తండ్రి, కూతురు మధ్య అందమైన అనుబంధాన్ని ఆవిష్కరించారు.

'అమ్మాడి' సాంగ్ అదుర్స్

ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలకు మంచి స్పందన రావడంతో తాజాగా మేకర్స్  థర్డ్ సింగిల్ ను విడుదల చేశారు. 'అమ్మాడి' అంటూ సాగే ఈ పాట నాని, మృణాల్ మధ్య ప్రేమను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తోంది. మృణాల్​ లైవ్ మ్యూజిక్​​ పెర్ఫామెన్స్​తో మొదలైన ఈ సాంగ్​లో తన భర్త నాని గురించి పాడుతూ కనిపిస్తుంది. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, అనుబంధాన్ని ఇందులో చూపించారు. నాని తనను ఎంత బాగా చూసుకుంటారు అనేది ఇందులో చూపించారు.   థర్డ్ సింగిల్ లో నాని, మృణాల్ లవ్​ కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటోంది. తొలి రెండు పాటల మాదిరిగానే ఈ పాట కూడా చాలా బాగా అలరిస్తోంది. అబ్దుల్ వాహబ్ సంగీతం వీనులవిందుగా ఉంది. కృష్ణ కాంత్ లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కాలా భైరవ, శక్తి శ్రీ గోపాలన్ మధుర గానం ఆహా అనిపించింది.   

డిసెంబర్ 7న పలు భాషల్లో విడుదల

వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బేబీ కియారా కన్నా ఇందులో నాని కుమార్తెగా కనిపించనుంది  హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా.. డిసెంబర్ 7న తెలుగు, హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

‘సరిపోదా శనివారం’ షూటింగ్ లో బిజీ బిజీ

అటు ‘అంటే సుందరానికి’ తర్వాత హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్నది. రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ ఆవిష్కరించారు.  ‘సరిపోదా శనివారం’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో నాని సరసన ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్ గా నటించనుంది. దర్శక నటుడు ఎస్ జె సూర్య విలన్ పాత్ర పోషించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చనున్నారు. 

Read Also: షారుక్ బర్త్ డే వేడుకలో రెచ్చిపోయిన దొంగలు, ఏకంగా 30 ఫోన్లు కొట్టేశారు!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి- సంఖ్య పెరిగే అవకాశం
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి- సంఖ్య పెరిగే అవకాశం
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Pakistan Afghanistan War: తాలిబన్ల చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్ -  భారత్ పని సులువైనట్లే !
తాలిబన్ల చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్ - భారత్ పని సులువైనట్లే !
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Embed widget