![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా గురించి ఇండస్ట్రీలో కొత్త కబురు వినబడుతోంది. మరోవైపు హరీష్ చేసిన ట్వీట్ కొత్త అనుమానాలకు దారి తీస్తోంది.
![Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!? Harish Shankar tweet on Pawan Kalyan Movie, He says sorry to Power Star Fans Gabbar Singh scene repeats Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/984685afc0dc4e9c58a975a4bb8a68b31669474852382313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరాభిమానుల్లో దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) ఒకరు. తనకు తాను పవన్ భక్తుడిగా ఆయన చెబుతుంటారు. అది పక్కన పెడితే... వీళ్ళిద్దరి కలయికలో సినిమా గురించి ఇండస్ట్రీలో రకరకాల కథలు వినబడుతున్నాయి. వాటిని పక్కన పెడితే... హరీష్ శంకర్ చేసిన లేటెస్ట్ ట్వీట్ కొత్త అనుమానాలకు తావు ఇస్తోంది.
'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?
పవన్, హరీష్ కాంబినేషన్‌లో 'గబ్బర్ సింగ్' వచ్చింది. అభిమానులు పవర్ స్టార్‌ను ఏ విధంగా చూడాలని కోరుకుంటారో... ఆ విధంగా చూపించి హరీష్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఆయన కొన్ని సినిమాలు చేశారు. మళ్ళీ పవన్ హీరోగా ఆ మధ్య 'భవదీయుడు భగత్ సింగ్' ప్రకటించారు. ఆ సినిమా పనులు ఓ అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతున్నాయి.
ఒకానొక దశలో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా ఆగిందని, హరీష్ మరో హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని కూడా తెలుగు చిత్రసీమలో గుసగుసలు కూడా వినిపించాయి. ఆ తర్వాత 'తెరి' రీమేక్ స్క్రిప్ట్ మీద వర్క్ చేయమని దర్శకుడికి పవన్ సూచించినట్టు సమాచారం. లేటెస్ట్ ఖబర్ ఏంటంటే... హరీష్ శంకర్‌కు ఓ స్టోరీ ఐడియా చెప్పి, దానిపై స్క్రిప్ట్ రెడీ చేయమని పవన్ చెప్పారట.
Also Read : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?
Sorry to disappoint you … as i dont agree with you !! https://t.co/t26tQHS1LJ
— Harish Shankar .S (@harish2you) November 26, 2022
'గబ్బర్ సింగ్'కు ముందు పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ సినిమా చేయాలని ట్రై చేశారు. సొంత కథలు కొన్ని వినిపించారు. కానీ, కుదరలేదు. ఆ తర్వాత ఒక రోజు పవన్ నుంచి పిలుపు రావడంతో వెళ్లారు. సల్మాన్ ఖాన్ హిట్ సినిమా 'దబాంగ్' స్క్రిప్ట్ చేతిలో పెడితే... దానికి హరీష్ శంకర్ తనదైన మార్పులు చేర్పులు చేసి హిట్ కొట్టారు. ఇప్పుడు కూడా 'తెరి' రీమేక్, మరో స్టోరీ ఐడియా అంటే... 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్ అవుతున్నట్టు ఉంది.
డిజప్పాయింట్ చేస్తున్నందుకు సారీ!
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అభిమానులు కోరుకుంటే విధంగా హరీష్ సినిమా తీస్తారని వాళ్ళ నమ్మకం. ఓ ఫ్యాన్ అయితే 'గబ్బర్ సింగ్' లాంటి మాస్ మసాలా మూవీ తీయవద్దని కోరాడు. ట్విట్టర్ వేదికగా ''మళ్ళీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ మీకు వచ్చింది. ఇది ఇంటెర్నేషల్ లెవల్ లో ఉండాలి. కొడితే ఎగిరి పడే ఫైట్స్ వద్దు. ప్రతి ఫైట్ సహజంగా ఉండాలి. మంచి సినిమాటోగ్రఫీ, రీ రికార్డింగ్ ఉండాలి'' అని కోరారు. దానికి బదులుగా ''మిమ్మల్ని డిజప్పాయింట్ క్షమించండి. మీతో నేను అంగీకరించను'' అని హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు. దాంతో కొత్త అనుమానాలు వస్తున్నాయి.
ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'హరి హర వీర మల్లు' సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)