Harish Shankar: ‘డబుల్ ఇస్మార్ట్‘తో ‘మిస్టర్ బచ్చన్‘ క్లాష్- ఛార్మి అన్ ఫాలో, హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్
తెలుగులో రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టబోతున్నాయి. ఆగష్టు 15న ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’ విడుదల కాబోతున్నాయి. ఈ క్లాష్ పై దర్శకుడు హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యారు.
Harish Shankar On Double Ismart Vs Mr Bachchan Clash: తెలుగు సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడు సినిమా క్లాష్ లు వివాదానికి కారణం అవుతూనే ఉంటాయి. తాజాగా రెండు పెద్ద సినిమాల మధ్యన పోటీ సంచలనం కలిగిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగష్టు 15న విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ చేసిన అనౌన్స్ మెంట్ పూరీ టీమ్ కు చిర్రెత్తేలా చేసింది. మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాన్నికూడా అదే రోజున విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నిర్వహించిన టీజర్ లాంఛ్ ఈవెంట్ లో మీడియా తో ఇంటరాక్ట్ అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
పూరి జగన్నాథ్ లో పోటీపడే స్థాయి నాకు లేదు- హరీష్ శంకర్
తప్పనిసరి పరిస్థితులలోనే ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను ఆగష్టు 15న విడుదల చేస్తున్నట్లు హరీష్ శంకర్ వెల్లడించారు. అంతేతప్ప పూరి జగన్నాథ్ తో పోటీ పడే స్థాయి తనకు లేదన్నారు. “‘పూరి జగన్నాథ్ గారు, వి వి వినాయక్ గారు, రాజమౌళి గారు నేను డైరెక్టర్ గా ఎదుగుతున్న క్రమంలో బాగా ఎంకరేజ్ చేశారు. నా సినిమాలో పాటలు నచ్చినా, డైలాగ్స్ నచ్చినా ఫోన్ చేసి అభినందించే వారు. పూరి గారితో పని చేశాను. ఆయనతో నాకు రిలేషన్ చాలా ఎక్కువ. ఏ రోజు కూడా పూరి గారితో కంపేర్ చేసే స్థాయి నాది కాదు. ఆయనో లెజెండ్ డైరెక్టర్. మాకున్న కొన్ని పైనాన్షియల్ ఇబ్బందులు కావచ్చు, ఓటీటీ ఒప్పందం వల్ల కావచ్చు.. ‘మిస్టర్ బచ్చన్’ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో క్లాష్ అవుతోంది. ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమానే ముందుగా అనౌన్స్ చేశారు. అదే డేట్ కు వచ్చే ఉద్దేశం మాకు లేదు. కానీ, ఆ డేట్ కు రావాలని పట్టుబట్టింది మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ అధినేత శశి. ఈ విషయం అందరికీ తెలియాలి. ఇది చాలా మంచి డేట్. మీరు వస్తే బాగుటుందని చెప్పారు. నిజానికి మేం ప్రిపేర్ కాలేదు. రిలాక్స్ గానే వద్దాం అనుకున్నాం. కానీ, ‘పుష్ప2’ వాయిదా.. ఇతర కారణాలతో తప్పనిసరి పరిస్థితులలోముందుగానే వస్తున్నాం. పూరి గారితో నాకు చాలా కాలం నుంచి రిలేషన్ ఉంది. ఒక్క సినిమా క్లాష్ అయినంత మాత్రాన.. పూరి గారికి నాకు మాటలు ఉండవని, ఎడమొహం పెడమొహం అవుతామని అనుకోను.
ఛార్మి అన్ ఫాలో అంత సీరియస్ గా తీసుకోను- హరీష్ శంకర్
సోషల్ మీడియాలో ఛార్మి తమను అన్ ఫాలో చేసిందనే విషయా ఇంకా తమకు తెలియదని హరీష్ శంకర్ అన్నారు. “’డబుల్ ఇస్మార్ట్’ టీమ్ స్థానంలో నేను ఉన్నా, నాకు అలాగే ఇరిటేషన్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడాన్ని నేను తప్పుబట్టను. సోషల్ మీడియాలో ఎవరికి నచ్చిన వాళ్లను వాళ్లు ఫాలో అవ్వొచ్చు. అన్ ఫాలో చెయ్యొచ్చు. అన్ ఫాలో అయినట్లుగా మేం చూసుకోలేదు. నేను అంత సీరియస్ గా తీసుకోను. అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే? రామ్ తో నేను సినిమా చేయబోతున్నాను. కొమ్మలపాటి కృష్ణ మా సినిమాకు ప్రొడ్యూసర్ గా చేయబోతున్నారు. నేను సినిమా చేసే హీరోతో క్లాష్ చేసుకోవాలని ఉండదు. తప్పని పరిస్థితులలో విడుదల చేయాల్సి వస్తుంది. మనస్ఫూర్తిగా అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను.
Read Also: ఈ దేశాన్ని పీడుస్తుంది దరిద్రం కాదు సార్.. నల్లధనం - ఆసక్తి పెంచుతున్న 'మిస్టర్ బచ్చన్' టీజర్
Also Read: రవితేజను అన్‌ఫాలో చేసిన ఛార్మీ - కారణం అదేనా? అసలేం జరుగుతుంది..!