Happy Birthday Karthikeya: అజీత్‌తో కార్తికేయ సై.. బర్త్‌డే సందర్భంగా ‘వలిమై’ విలన్ లుక్ రిలీజ్
హీరో కార్తికేయ పుట్టిన రోజు సంద్భరంగా తన లేటెస్ట్ మూవీ ‘వలిమై’ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ మూవీలో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు.
అజిత్ హీరోగా దర్శుకుడు వినోద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘వలిమై’. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతున్న ఈ సినిమాలో అజిత్ సరసన హ్యూమా ఖురేషి నటించగా..విలన్ పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. ఈ రోజు కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలచేశారు మేకర్స్.
Wishing the stylish @ActorKartikeya an year filled with spectacular cinema! 😎🔥
— Sony Music South (@SonyMusicSouth) September 21, 2021
#AjithKumar @BoneyKapoor #HVinoth @thisisysr @BayViewProjOffl @ZeeStudios_ @SureshChandraa #HBDKartikeya #Valimai #HappyBirthdayKartikeya #Kartikeya pic.twitter.com/40KlO4clPE
బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు, యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి స్పందన వచ్చింది. అజిత్-బోనీ కపూర్ కాంబినేషన్లో వస్తోన్న మూవీలో కార్తికేయ విలన్ కావడంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తనకి చాలా ఉపయోగపడుతుందంటున్నారు సినీ ప్రియులు.
Also Read: నాలుగు దశాబ్దాలు చిత్రపరిశ్రమకు సేవలందించిన సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ఇకలేరు
వాస్తవానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తికేయ. అదే సమయంలో అటు విలన్ పాత్రలు చేసేందుకు కూడా వెనకడుగు వెయ్యలేదు. నాచురల్ స్టార్ నాని ’గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలనిజంతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ సినిమాకు మొదట కార్తికేయను విలన్ పాత్రలో సెలెక్ట్ చేసినప్పుడు… ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ చేస్తున్నాడు అంత అనుభవం కూడా లేదు అలాంటి వాడు విలన్ పాత్రలు చేయగలడా అని అనుకున్నారట. కానీ సినిమాలో కార్తికేయ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘గ్యాంగ్ లీడర్’ లో విలన్ పాత్రలో కార్తికేయను చూసి తమిళ హీరో అజిత్ ‘వలిమై’ లో ఛాన్స్ ఇచ్చారట
Alos Read: కాలేజీలో గ్యాంగ్ వార్, ఈ పిల్ల నాదంటూ గొడవలు..’గల్లీబాయ్స్’ టీజర్ దుమ్ములేపిందన్న అనిల్ రావిపూడి
Also Read: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్.. వెంటిలేటర్ తొలగింపు
Also Read: విశాల్ ఆ ఊపుడేంది? తెలుగు డబ్బింగ్‌పై ఫన్నీ వీడియో వదిలిన హీరో