Guru Somasundaram Telugu Movie : తెలుగు సినిమాలో విలన్‌గా 'మిన్నల్ మురళి' ఫేమ్ గురు సోమసుందరం
మలయాళ సినిమా 'మిన్నల్ మురళి' చూశారా? అందులో యాక్టర్ గురు సోమసుందరం గుర్తు ఉన్నారా? ఇప్పుడు ఆయన తెలుగులో సినిమా చేస్తున్నారు. విలన్ రోల్‌లో కనిపించనున్నారు.
మలయాళంలో రూపొందిన సూపర్ హీరో సినిమా 'మిన్నల్ మురళి'. అందులో టీ షాపులో పని చేసే వ్యక్తికి సూపర్ పవర్స్ వస్తాయి చూడండి! ఆ క్యారెక్టర్‌లో యాక్ట్ చేసిన గురు సోమసుందరం (Guru Somasundaram) గుర్తు ఉన్నారా? ఇప్పుడు ఆయన తెలుగులో సినిమా చేస్తున్నారు. అదీ ప్రతినాయకుడిగా! విలన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారన్నమాట!
'స్పార్క్'లో గురు సోమసుందరం
విక్రాంత్ (Vikranth) కథానాయకుడిగా పరిచయం అవుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పార్క్' (Spark Movie 2022). డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాతో అరవింద్ కుమార్ రవి వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా గురు సోమసుందరం నటిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది.
అక్టోబర్ 3 నుంచి ఐస్‌ల్యాండ్‌లో...
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో వేసిన రెండు భారీ సెట్స్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ''అక్టోబర్ 3 నుంచి ఐస్‌ల్యాండ్‌లో షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ తర్వాత మున్నార్, విశాఖలో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాం'' అని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.
విక్రాంత్ సరసన ఇద్దరమ్మాయిలు!
'స్పార్క్'లో విక్రాంత్ జోడీగా ఇద్దరు అందమైన భామలు నటిస్తున్నారు. సినిమా పూజ కార్యక్రమాలు జరిగిన రోజున ఇందులో మెహరీన్ కౌర్ ఫిర్జాదా (Mehreen Kaur Pirzada) కథానాయికగా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత రుక్సార్ థిల్లాన్ (Rukshar Dhillon) ను మరో కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలిపారు. 'ఎఫ్ 3'తో ఈ ఏడాది మెహరీన్ ఓ విజయం అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆమె చేస్తున్న చిత్రమిది. 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా తర్వాత రుక్సార్ నటిస్తున్న చిత్రమిది.
'హృదయం' సంగీత దర్శకుడితో...
'స్పార్క్' చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ (Music Director Hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్నారు. ప్రణవ్ మోహన్ లాల్, కల్యాణీ ప్రియదర్శన్, దర్శన నటించిన మలయాళ సూపర్ హిట్ సినిమా 'హృదయం' చిత్రానికి ఆయన అందించిన పాటలు భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 'స్పార్క్'తో పాటు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) జంటగా నటిస్తున్న 'ఖుషి' సినిమాకు కూడా హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : ఇండియా నుంచి ఆస్కార్ బరిలో గుజరాతీ సినిమా - ఆర్ఆర్ఆర్‌కు దారులు మూసుకుపోయినట్లు కాదు !
'స్పార్క్' సినిమాలో నాజర్, సుహాసిని మణిరత్నం, 'వెన్నెల' కిశోర్, షాయాజీ షిండే, సత్య, శ్రీకాంత్, కిరణ్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దగ్గర సహాయకుడిగా పని చేసిన రవి వర్మ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read : మహేష్ కొత్త ఫోన్ కొన్నారండోయ్ - సెల్ఫీ పోస్ట్ చేశారు చూశారా? మహేష్ కొత్త ఫోన్ రేటు ఎంతో తెలుసా?