News
News
X

Gurhalakshmi September 22nd : హనీకి అమ్మగా మారిన తులసి- కుక్కపిల్లని తెచ్చి పెంచుకోమని నందుకి వార్నింగ్

హనీ కోసం అటు తులసి ఫ్యామిలీ, ఇటు లాస్య ఫ్యామిలీ సామ్రాట్ ఇంటికి చేరతారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

తులసి వాళ్ళ ఫ్యామిలికి కావాల్సిన ఏర్పాట్లు చెయ్యమని సామ్రాట్ తన బాబాయ్ కి చెప్తాడు. పొద్దున్నే లాస్య, నందు లక్కీని తీసుకుని వెళతారు. ఇక్కడ ఉన్నన్ని రోజులు హనీ వెంట నీడలా ఉండాలి నువ్వు ఇక్కడే ఉండిపో అని సామ్రాట్ అంకుల్ అనేలా చెయ్యాలి అని లాస్య లక్కీకి చెప్తుంది. మమ్మీ నువ్వు నన్ను వదిలించుకోవడానికి తీసుకొచ్చావా లేదంటే హనీతో ఫ్రెండ్షిప్ కోసం తీసుకుని వచ్చావా అని అడుగుతాడు. పనికిరాని ప్రశ్నలు ఆపి చెప్పింది చెయ్యమని లాస్య తిడుతుంది. సామ్రాట్ దగ్గరకి లక్కీని తీసుకుని వస్తారు. హనీకి తోడుగా ఉంటాడని తీసుకొచ్చాము అని లాస్య చెప్తుంది. హనీ రికవర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాడని అంటుంది.

ఇక తులసి ఫ్యామిలీ కూడా సామ్రాట్ ఇంటికి వస్తుంది. వాళ్ళని చూసి సామ్రాట్ తెగ సంతోషపడతాడు. మీరు కూడా ఇక్కడ ఉండటానికే వచ్చారా అని లక్కీ అంటాడు. హనీని నేను ఎప్పుడు పరాయి పిల్లలా అనుకోలేదు మా ఇంటి పిల్ల అనుకున్నాం అని తులసి అంటుంది. పక్కన లాస్య నందు చెవులు కోరుకుతూనే ఉంటుంది. నా మాట మన్నించి వచ్చినందుకు సామ్రాట్ అందరికీ థాంక్స్ చెప్తాడు. వదిలేసిన మొగుడు తాలూకు అమ్మానాన్నలం అయినా మమ్మల్ని కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటుంది మా తులసి మనసు అర్థం చేసుకోండి అని అనసూయ చెప్తుంది. అత్తయ్య మనం హనీకి హెల్ప్ గా ఉండటానికి వచ్చామని లాస్య అంటుంది. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో అని అనసూయ కౌంటర్ ఇస్తుంది.

Also Read: రుక్మిణిని ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్న జానకి- రాధని పెళ్లి చేసుకోవడానికి మాధవ్ ఏర్పాట్లు

తులసి వెళ్ళి హనీని నిద్ర లేపుతుంది. అందరూ హనీ ముందు నిలబడి ఉంటారు. మీరు నన్ను చూడటానికి వచ్చారా అని హనీ అడుగుతుంది. కాదు నీ చెయ్యి నొప్పి తగ్గే వరకు ఇక్కడే ఉంటామని తులసి చెప్పడంతో హనీ సంతోషిస్తుంది. అయితే నా నొప్పి తగ్గకూడదని హనీ అంటుంది. నా నొప్పి తగ్గిపోతే మీరందరూ వెళ్లిపోతారు కదా అందుకే నొప్పి తగ్గకూడదని చెప్తుంది. పర్మినెంట్ గా మా అందరినీ ఇక్కడే ఉండమంటావా ఏంటి అని తులసి అంటుంది. నాకు అమ్మ ఉంటే ఎలా చేసేదో తులసి ఆంటీ అలాగే చెయ్యాలి అని హనీ మారాం చేస్తుంది.

ఇక తులసి ఫ్యామిలీ మొత్తం హనీని సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. నందు తులసి దగ్గరకి వస్తాడు. అర్జెంట్ గా ఇక్కడ నుంచి నా వాళ్ళని తీసుకుని వెళ్లిపో అని నందు చెప్తాడు. బెదిరిస్తున్నారా వెళ్లకపోతే ఏం చేస్తారు అని తులసి అడుగుతుంది. మీ సమస్య ఏంటి అని అడుగుతుంది. విడాకులు ఇచ్చాను కదా ఇంకా సమస్య ఏంటి అని అంటుంది. నాకు విడాకులు ఇచ్చినా నా ఫ్యామిలిని గుప్పెట్లో పెట్టుకున్నావ్ నా వాళ్ళ ముందే కాదు లోకం ముందు కూడా నన్ను చెడ్డవాడిని చేస్తున్నావ్ . నా జీవితాన్ని నువ్వే డైరెక్ట్ చేస్తున్నావ్ అని నందు అంటాడు.

Also Read: ఒకరికి ఈగో మరొకరికి పొగరు ఇద్దరూ ఇద్దరే -'తగ్గేదే లే' అన్న రిషి, 'వదిలేదే లే' అన్న వసు

అపకారం చేసే వాళ్ళకి కూడా ఉపకారం చెయ్యాలని అనుకుంటాను అందుకే మీరు ఇంకా నా ముందు నిలబడి మాట్లాడుతున్నారు అని తులసి గట్టిగా చెప్తుంది. నన్ను రెచ్చగొట్టొద్దు అని అంటుంది. హనీ కోసం మా వాళ్ళని తీసుకురావడం వాళ్ళతో ఊడిగం చేయించడం ఎందుకు అని నందు సీరియస్ అవుతాడు. మానవత్వంతో వచ్చారు ఈ ఇంట్లో వాళ్ళు తన వాళ్ళు అనుకుని వచ్చారు అని తులసి అంటే.. నీ మనసులో ఏముందో చెప్పమని నందు అడుగుతాడు. ఏ హక్కుతో నిలదీస్తున్నారని తులసి అంటుంది. నువ్వు ఈ ఇంటికి సేవ చెయ్యడానికి వచ్చినట్టు అనిపించడం లేదు ఈ ఇంటి మనిషిగా వచ్చినట్టుగా అనిపిస్తుందని నందు అంటాడు. మగబుద్ధి చూపించారు కదా అని తులసి క్లాస్ పీకుతుంది.

పెళ్లి కాకముందే లాస్యని తీసుకొచ్చి బెడ్ రూమ్ లో చోటు ఇచ్చారు అప్పుడు అనిపించలేదా అని దెప్పిపొడుస్తుంది. మీ మాట వింటూ మీ దగ్గర పడి ఉండాలంటే ఓ కుక్క పిల్లని పెంచుకోండి అని తులసి నందుకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ సామ్రాట్ గారు మనల్ని వాడుకుంటున్నారు అని అభి అంకిత ముందు సీరియస్ అవుతాడు. ఇలాంటి పనులు చేయడానికా మామ్ మనల్ని తీసుకొచ్చింది అని అభి అంటాడు. తులసి ఫ్యామిలీ మొత్తం హనీతో ఆట ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హనీ ఒంటరిగా ఫీల్ అవకుండా లక్కీని తీసుకొచ్చినందుకు లాస్యకి థాంక్స్ చెప్తాడు సామ్రాట్. ఇక తన కంపెనీలో ఉంటూనే సామ్రాట్ ని మోసం చెయ్యాలని చూసిన వ్యక్తిని పట్టుకుని తులసి పట్టుకుంటుంది. 

Published at : 22 Sep 2022 09:12 AM (IST) Tags: Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Today Episode Written Update Gruhalakshmi Serial Gruhalakshmi Serial September 22nd

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!

Adipurush: 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో 'Disappointed' హ్యాష్ ట్యాగ్!

Adipurush: 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో  'Disappointed' హ్యాష్ ట్యాగ్!

Rahul Ramakrishna: ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను’.. నటుడు రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు!

Rahul Ramakrishna: ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను’.. నటుడు రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు!

Colours Swathi: విడాకుల కోసం కోర్టుకెక్కిన కలర్స్ స్వాతి, అప్పుడు వద్దన్నా పెళ్లి చేసుకుని ఇప్పుడిలా!

Colours Swathi: విడాకుల కోసం కోర్టుకెక్కిన కలర్స్ స్వాతి,  అప్పుడు వద్దన్నా పెళ్లి చేసుకుని ఇప్పుడిలా!

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

టాప్ స్టోరీస్

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

CM Jagan : సీఎం జగన్ ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

CM Jagan : సీఎం జగన్  ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ సరిపోలేదు - మ్యాచ్, సిరీస్ రెండూ మనవే!

మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ సరిపోలేదు - మ్యాచ్, సిరీస్ రెండూ మనవే!

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు డబ్బు కొట్టేశారా? అయితే ఇలా చేస్తే మీ సొమ్ము తిరిగొస్తుంది!

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు డబ్బు కొట్టేశారా? అయితే ఇలా చేస్తే మీ సొమ్ము తిరిగొస్తుంది!