Guppedanta Manasu January 4th Update: వెళ్లిపొమ్మన్న వసు, అల్లాడిపోయిన రిషి - మెడలో నల్లపూసలు చూసి రాజీవ్ షాక్!
Guppedantha Manasu January 4th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు జనవరి 4 బుధవారం ఎపిసోడ్ (Guppedanta Manasu January 4th Update)
గుప్పెడంతమనసు సీరియల్ ప్రస్తుతం వసుధార పెళ్లిచుట్టూ నడుస్తోంది. ఎలాగైనా వసుధార ఇంటికోడలిగా రాకూడదని దేవయాని కుట్రలపై కుట్రలు చేస్తోంది. వసుధారను దక్కించుకునేందుకు రాజీవ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు
వసుధారే నా జీవితం అని రిషి ఊహల్లో తేలుతున్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో జగతి-మహేంద్ర వసుధార ఇంటికి వచ్చారు. వసు తండ్రి చక్రపాణి మాత్రం తన పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటే..తల్లి సుమిత్ర ఏమీ చేయలేక చూస్తూ నిల్చుంది... రెండు మూడు రోజులుగా ఎపిసోడ్ లో ఇదే కథ నడుస్తోంది...
బుధవారం ఎపిసోడ్ లో జరిగేది ఇదేనా!
రాజీవ్ చంపేస్తాడేమో అనే భయంతో రిషిని వెళ్లిపొమ్మంటుంది వసుధార..రిషికి ఏమీ అర్థంకాక వసుధారని బతిమలాడతాడు. ఆ తర్వాత వసుమాటలు తలుచుకుని బాధలో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వసుని మెడలో తాళి కట్టేందుకు రాజీవ్ ప్రయత్నించడంతో మెడలో నల్లపూసలు చూసి షాక్ అవుతాడు ( వసు తనకు ఆల్రెడీ పెళ్లైందని చెప్పడం కోసమే ముందు చూపుతో ఆ నల్లపూసలు మెడలో వేసుకుని ఉండొచ్చు). అవే నల్లపూసలు చూసి రిషి ఏమనుకుంటాడు.. రాజీవ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు.. వసుధార తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి.. వసు దారెటు...జగతి-మహేంద్ర ఏం చేయబోతున్నారో బుధవారం ఏపిసోడ్ లో చూడాలి...
Also Read: దీపను చంపేసి కార్తీక్ ను పెళ్లిచేసుకుని ఇంటికొస్తానన్న చారుశీల, సౌందర్యలో మొదలైన అనుమానం
మంగళవారం ఏం జరిగిందంటే...
లేటెస్ట్ స్టోరీ విషయానికొస్తే ఇంట్లోనే పెళ్లికి చేస్తాడు చక్రపాణి. వస్తున్నా వచ్చేస్తున్నా కంగారొద్దని రిషి..వసుధారకి ఫోన్లో ధైర్యం చెప్పాడు. మరోవైపు రాజీవ్..వసుధారని కలసి పెళ్లికి ఒప్పుకోకుంటే రిషి, జగతి, మహేంద్ర, చక్రపాణి, సుమిత్రను చంపేస్తానని బెదిరించాడు. ఇవన్నీ తలుచుకుని ఏడుస్తున్న వసుధార..జగతి ఇచ్చిన నల్లపూసలు తీసి రిషి తన మెడలో వేస్తున్నట్టు ఊహించుకుంటూ వేసేసుకుంటుంది...నగలతో నల్లపూసలు కవర్ చేస్తుంది..ఇంతలో రిషి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. చక్రపాణి, రాజీవ్ ఇద్దరూ రిషిని టార్గెట్ చేస్తే... రిషి మాత్రం వసుధార నాది అని వాదనకు దిగుతాడు.
Also Read: గుప్పెడంత మనసులో చెప్పలేనంత అలజడి, రాజీవ్ కి రిషి ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఏంటి!
రిషిని చంపేస్తానన్న రాజీవ్ మాటలు గుర్తుచేసుకుని వసుధార అడుగు ముందుకు వేయలేక ఆగిపోతుంది. అప్పుడే వచ్చన జగతి-మహేంద్రకి అస్సలు అక్కడ ఏం జరుగుతోందో అర్థంకాక చూస్తుండిపోతారు. రిషి సార్ వసుధార వస్తానంటే తీసుకెళ్లండని ఛాలెంజ్ చేస్తాడు రాజీవ్...తన చేతిలో గన్ చూసి వసుధార బొమ్మలా నిల్చుండిపోతుంది. అవేమీ పట్టించుకోవద్దు వసుధారా పద వెళదాం అని చేయిపట్టుకోవడంతో...వదలండి సార్ అని అరుస్తుంది.ఏమీ అర్థంకాక రిషి షాక్ అయినా వసు చేయిమాత్రం వదలడు.. వదలండి సార్ అని పదే పదే అంటుంది.. ఇది మా ఇంటి సమస్య సార్ మీరు వెళ్లండి.. అంటుంది . వసుధారా ఏం అంటున్నావ్.. ఇది మీ ఇంటి సమస్యా.. అంటే..నేను ఈ ఇంటికి చెందినవాడిని కాదా అని అడుగుతాడు. అప్పుడు స్పందించిన వసుధార..రిషిని వెళ్లిపొమ్మని బతిమలాడుతుంది..ఏడుస్తుంది. రిషి మాత్రం అర్థంకా వసుని చూస్తుండిపోతాడు...