Guppedanta Manasu January 24th Update: ప్రేమ వల్ల వచ్చిన బాధతో కూడిన కోపంలో రిషి, కూల్ చేసే ప్రయత్నంలో వసు!
Guppedantha Manasu January 24th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు జనవరి 24 మంగళవారం ఎపిసోడ్ (Guppedanta Manasu January 24th Update)
రిషి తలనొప్పితో సోఫాలో కళ్లుమూసుకుని కూర్చుంటాడు...వసుధార వచ్చి సైలెంట్ గా బామ్ రాస్తుంది... ఉలిక్కి పడి లేచిన రిషి వసుధారని చూసి షాక్ అవుతాడు
రిషి: నేనిక్కడున్నట్టు నీకెవరు చెప్పారు
వసుధార: మనసు చెప్పింది సార్
రిషి: మనసు గురించి నువ్వు మాట్లాడకపోవడమే మంచిది...మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నుంచి కూడా వెళ్లిపో వసుధారా
వసుధార: మీరే నన్ను ప్రాజెక్ట్ హెడ్ గా అంగీకరించారు..నన్ను ప్రాజెక్ట్ హెడ్ పదవి నుంచి దించేయండి
మంగళవారం ప్లే అవబోయే ఎపిసోడ్ ప్రోమో ఇక్కడ చూడొచ్చు...
సోమవారం జరిగిన కథ
కాలేజీలో వసుధార-మహేంద్ర కూర్చుని రిషి గురించి బాధపడతాడు. వసుధార ఏదో చెప్పేందుకు ట్రై చేస్తోందని మహేంద్ర అన్నప్పటికీ..ఆ మాటల్ని కొట్టిపడేస్తుంది జగతి. తనిని తాను కవర్ చేసుకునేందుకు ఏవేవో చెబుతుంది పట్టించుకోవద్దనేస్తుంది. ఎన్నో మాటలు చెప్పింది..గురుదక్షిణ ఇస్తానందని బాధపడతాడు. రిషి బాధను తొలగించేదెవరు.. రిషిని ఓదార్చేదెవరని అనుకుంటారు..
Also Read: 'కార్తీకదీపం' సీరియల్ అయిపోయింది - నిజంగా ఉత్కంఠభరితమైన ముగింపే!
మరోవైపు రిషి..రూమ్ లో కూర్చుని రిషిధార అని పేపర్ పై రాసి తనలో తాను మాట్లాడుకుంటాడు..జీవితం ఇంత అందంగా ఉంటుందా, ఇన్ని అందమైన జ్ఞాపకాలుంటాయా అనుకున్నాను కానీ కేవలం జ్ఞాపకంగా మారిపోయావా అనుకుంటాడు. వసుధార -రిషి..ఇద్దరూ రిషిధార అయ్యారు అనుకుంటూనే...మనస్ఫూర్తిగానే నాకీ పెళ్లి జరిగిందన్న వసుధార మాటలు తల్చుకుంటాడు...ఇప్పుడు రిషి వేరు...ధార వేరు..ఎవరి జీవితాలువారివిగా చీల్చేసింది..వసుధారా ఎందుకిలా చేశావో అర్థం కాలేదు..నావైపు నుంచి నేను ఎలాంటి తప్పూ చేయలేదు..నువ్వు నన్నెందుకు దూరం పెట్టావో..ఆ తాళి ఎందుకు కట్టించుకున్నావో అర్థంకాలేదు..అడిగితే నా ఇష్టప్రకారం తాళి నా మెడలో పడిందన్నావ్..అర్థం లేని నా జీవితానికి అర్థం చూపించావు అనుకున్నాను కానీ..నేను అర్థం చేసుకున్నది అబద్ధం అని ఒక్కమాటలో నిరూపించావ్ అనుకుంటాడు... రిషిధార అని రాసిన పేపర్ కింద జారిపడుతుంది..ఇంతలో వసుధార రూమ్ లో కివస్తుంది...
Also Read: నిస్వార్థ ప్రేమ - రాక్షస ప్రేమ మధ్య జరిగిన యుద్ధమే 'కార్తీకదీపం' కథ
వసుధార మెడలో తాళి చూసి రిషి మరింత బాధపడతాడు..
వసు: మీరిక్కడున్నారేంటి సార్
రిషి: నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది..నేను ఎక్కడుంటే ఏంటి వసుధారా
వసు: ఇంటిని వదిలేసి ఒంటరిగా ఎన్నాళ్లిలా
రిషి: చిన్నప్పటి నుంచీ ఒంటరితనం అలవాటే.. చిన్నప్పుడు ఒకరువదిలేసి వెళ్లిపోయారు..ఆ తర్వాత తోడుగా వస్తానని సాక్షి మాటిచ్చి వదిలేసింది..ఆ తర్వాత అద్భుతైన నేను ఊహించని సంఘటన నా జీవితంలో జరిగింది. అస్సలు నేను ఊహించలేదు.. బహుశా నాకు ఒంటరితనం శాపంగా మారిన వరమేమో...నా జ్ఞాపకాలే నా తోడు. మోసపోవడం కూడా అలవాటైపోయింది
వసు: మనం మాట్లాడుకోవాలి సార్
రిషి: వసుధారా...కొన్ని పదాలను వాడడం సంస్కారం కాదు..నువ్వు నేను అనుకోవడం ఓకే...కానీ మనం అనుకోవడం కరెక్ట్ కాదేమో
వసు: ఎందుకు సార్.. నేనేంటో మీకు తెలుసు..మీరేంటో నాకు తెలుసు
రిషి: మానిన గాయాన్ని తవ్వకు..మనం అనే పదం వాడొద్దు వెళ్లు
గౌతమ్ ఫ్లాట్ తనకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పేసి బాధగా అక్కడినుంచి బయటకు వెళ్లిపోతుంది వసుధార. బయట దేవయాని ఎదురుపడుతుంది..ఎప్పటిలా ఇద్దరూ వాదించుకుంటారు... రిషితో కలవనివ్వనని దేవయాని.. మా ఇద్దర్నీ విడదీసేవారే లేరని వసుధార ఛాలెంజ్ చేసుకుంటారు...