జనవరి 23 నుంచి 29 వరకూ ఈ రాశులవారికి ఎక్కువ శాతం అనుకూల ఫలితాలే ఉన్నాయి...
మిథున రాశి వారంలో గడిచే ప్రతి రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించేకన్నా మీ జీవనశైలిని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టండి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. పొరుగువారితో వివాదం తలెత్తవచ్చు.
కన్యా రాశి ఈ వారం మీరు చాలా సంతోషంగా ఉంటారు. అనవసర ఆందోళనలు విడిచిపెట్టండి. మీ ధైర్యం మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. మీ చుట్టూ ఉండే వ్యక్తులు కొందరు వారి ఎదుగుదల కోసం మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది జాగ్రత్త.
వృశ్చిక రాశి ఈ వారం మీకు గ్రహస్థితి బావుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునే అవకాశాలను పొందుతారు. వైవాహిక జీవితంలో సమస్యలు తగ్గుతాయి.
మకర రాశి ఈ వారం ఆర్థికంగా మీ పరిస్థితి బావుంటుంది. కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. స్థిరాస్తి, వాహన కొనుగోలు ప్రణాళిక పూర్తవుతుంది. దాంపత్య జీవితంలో ప్రేమ ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
మీన రాశి ఈ వారమంతా మీరు ఆనందంగా ఉంటారు. డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈ వారం మీరు మీ ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తుంది. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల నుంచి మంచి సహకారం అందుతుంది.
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు