News
News
X

The Ghost: 'గన్స్ - స్వార్డ్స్', 'ది ఘోస్ట్' ట్రైనింగ్ యాక్షన్ వీడియో చూశారా?

'ది ఘోస్ట్' సినిమాకి సంబంధించిన ట్రైనింగ్ యాక్షన్ వీడియోను రిలీజ్ చేశారు.

FOLLOW US: 

అక్కినేని నాగార్జున(Nagarjuna) నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ది ఘోస్ట్'(The Ghost). సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా కనిపించనుంది. దీనికి ప్రవీణ్ సత్తారు(Praveen Sattharu) దర్శకత్వం వహించారు. ఇందులో నాగార్జున మాజీ 'రా' ఏజెంట్ పాత్రను పోషిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రయూనిట్ చెబుతున్నారు. ఈ మూవీ ఓటీటీలో విడుదల కానుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. 

అయితే, ఆ ప్రచారంలో నిజం లేదని, థియేటర్లలో సినిమాను విడుదల చేస్తామని ఇటీవలే చిత్ర బృందం క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసి.. సినిమాపై బజ్ పెరిగేలా చేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైనింగ్ యాక్షన్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున, సోనాల్ చౌహన్ యాక్షన్ సీన్స్ కోసం ట్రైనింగ్ తీసుకుంటూ కనిపించారు. చూస్తుంటే చాలా కష్టపడినట్లే ఉన్నారు. మరి వీరికి కష్టానికి తగ్గ రిజల్ట్ వస్తుందేమో చూడాలి! 

ఇటీవల 'బ్రహ్మాస్త్ర' సినిమాతో నాగార్జున విజయం అందుకున్నారు. అందులో ఆయనది చిన్న పాత్ర అయినప్పటికీ... మంచి పేరు వచ్చింది. హిందీ ప్రేక్షకులు ఆయన పాత్ర గురించి మాట్లాడుతున్నారు. 'బ్రహ్మాస్త్ర' విజయం తర్వాత నాగార్జున నుంచి వస్తున్న సినిమా కావడంతో 'ది ఘోస్ట్' సినిమాపై హిందీ ప్రేక్షకులలో కూడా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

చిరుతో పోటీపై నాగార్జున రియాక్షన్:

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్', అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అక్టోబర్ 5న ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి. అయితే ఇప్పుడు వీరిద్దరూ పోటీ పడడానికి రెడీ అవ్వడం చర్చకు దారి తీసింది. అయితే నాగార్జున వెనక్కి తగ్గుతారని అందరూ అనుకున్నారు. కానీ రిలీజ్ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది 'ది ఘోస్ట్' టీమ్. ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని నిర్మాతలు చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. రీసెంట్ గా సినిమాలో ఓ పాటను కూడా రిలీజ్ చేశారు. 

గత రెండు దశాబ్దాల్లో చిరంజీవి, నాగార్జున ఇలా తలపడింది లేదు. అయితే ఈ క్లాష్ ని ఇద్దరు హీరోలు ప్రొఫెషనల్ గానే చూస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఇంకా మీడియా ముందుకు రాలేదు కానీ.. ఆయన కంటే ముందు తన సినిమా ప్రమోషన్స్ కోసం మీడియాను కలిసిన నాగార్జున.. చిరుతో క్లాష్ గురించి మాట్లాడారు. చిరంజీవిని చాలా మంది ఇష్టపడతారని.. ఇద్దరి సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. దసరా సమయంలో ఒకేసారి రెండు, మూడు సినిమాలు విడుదల కావడం గత నలభై ఏళ్లుగా జరుగుతుందని.. సినిమా బాగుంటే పోటీకి ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారని నాగార్జున చెప్పుకొచ్చారు. ఈ సినిమాల సక్సెస్ ఈ ఇద్దరి హీరోలకు చాలా ముఖ్యం. మరి ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి!  

Also Read: క్రియేటివిటీకి కళ్లజోడు పెడితే.. సింగీతం శ్రీనివాసరావు 

Also Read : రాంగ్ రూట్‌లో ఆస్కార్స్‌కు 'ఛెల్లో షో'? - సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న డౌట్స్ ఇవే!

Published at : 22 Sep 2022 04:19 PM (IST) Tags: nagarjuna Sonal Chauhan The Ghost Movie The Ghost action video

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ