Gruhalakshmi February 14th: నవ్వులు పూయించిన నందు నెక్లెస్- తులసమ్మ వాకిట్లో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్
నందు కేఫ్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
నందు, తులసి కేఫ్ కి వచ్చిన వెంటనే లాస్య కూడా వస్తుంది. నందు జేబుల్లో చేతులు పెట్టుకోవడం చూసి అనుమానంగా ఏంటి స్టైలా అని అడుగుతుంది. జేబులో నెక్లెస్ చూసి అది తులసికి ఇవ్వబోతున్నా అని లాస్యకి తెలిసిపోయిందా అని నందు మనసులో అనుకుంటాడు. తెలిసిపోయింది నందు నీ జేబులో నెక్లెస్ ఉందని అది నాకు ప్రెజెంట్ చేయబోతున్నావని నాకు ముందే తెలుసని లాస్య మనసులో అనుకుంటుంది. నాకేమన్నా చెప్పాలి, ఇవ్వాలని మర్చిపోతున్నావేమో అని ఇన్ డైరెక్ట్ గా అడుగుతుంది. కానీ నందు మాత్రం అలాంటిది ఏమి లేదని చెప్తాడు.
Also Read: చిత్రని ట్రాప్ చేయడానికి అభిమన్యు స్కెచ్- వాలెంటైన్స్ డే రోజు వేదకి విన్నీ గిఫ్ట్
కేఫ్ ని అందంగా డెకరేట్ చేసేందుకు ప్రేమ్ తన బ్యాచ్ ని తీసుకుని వస్తాడు. ఇప్పుడు నెక్లెస్ ఇచ్చాను అంటే బ్యాండ్ మొగుతుందని నందు మొహం ఇబ్బందిగా పెట్టేస్తాడు. ఎవరికి వాళ్ళు మనసులోనె మాట్లాడేసుకుంటారు. తులసి కేఫ్ కి సంబంధించి లెక్కలు వేసుకుంటుంటే నందు వస్తాడు. నెక్లెస్ ఇవ్వడానికి ఇదే గోల్డెన్ ఛాన్స్ అనుకుంటాడు. మళ్ళీ అందరూ వస్తే అడ్డంగా బుక్ అయిపోతానని క్యారెమ్ బోర్డ్ ఆడుకుంటూ కామ్ గా నెక్లెస్ ప్రజెంట్ చేయవచ్చని ప్లాన్ వేస్తాడు. ఏంటి కొత్తగా కనిపిస్తున్నారని తులసి అంటుంది. నీతోనే క్యారెమ్స్ ఆడతానని నందు అనేసరికి తులసి బిత్తరపోతుంది. చాలా విచిత్రాలు జరుగుతున్నాయ్ నమ్మలేకపోతున్న అని అంటుంది. గెలవాలని ఆడుతున్నా అని తులసి అనేసరికి జీవితంలో గెలిపించావ్ అని నందు బదులిస్తాడు.
ఊరికే థాంక్స్ చెప్పాలని అనుకోవడం లేదని నెక్లెస్ బయటకి తీసేటైం కి ప్రేమ్ వచ్చి అరిచేసరికి ఇంట్లో అందరూ వచ్చేస్తారు. మొట్టమొదటిసారి ఉమ్మడి కుటుంబం అంటే చిరాకుగా ఉందని నందు మొహం వికారంగా పెడతాడు. లాస్య గొడవ చేయడం లేదు ఏంటా అని తులసి అనుకుంటే గొడవ చేస్తే నెక్లెస్ ఇవ్వడని అప్పటి వరకు శాంతమూర్తిలా ఉండాలని లాస్య అనుకుంటుంది. అందరూ కలిసి ఆడుతుంటే ఇంట్లో అందరూ సరదాగా వాలెంటైన్స్ డే జరుపుకోవచ్చు కదా అని లాస్య ఐడియా చెప్తుంది. అందరూ సరే అంటారు. మళ్ళీ నందు తులసి బైక్ ఎక్కడానికి వచ్చేస్తాడు. ఎలాగైనా నెక్లెస్ ఇవ్వాలని అనుకుంటాడు. నా తోక రాకముందే ఈ బైక్ ఎక్కేసి వెళ్లిపోవాలని నందు ఎక్కేలోపు సామ్రాట్ ఎంట్రీ ఇస్తాడు. నందు పరిస్థితి చూడాలి భలే నవ్వుగా ఉంటుంది.
Also Read: రాజ్ చెంప మీద కొట్టిన కావ్య- కనకం ఇంటికి పెళ్ళిచూపులకు వస్తామన్న అపర్ణ
మీటింగ్ ఉంది కదా పికప్ చేసుకుందామని వచ్చినట్టు చెప్తాడు. మీటింగ్ టైమ్ కి తులసి వచ్చేస్తుందని నందు కవర్ చేస్తాడు. కానీ సామ్రాట్ మాత్రం అందరం కలిసి కారులో వెళ్దాం పద అని అంటాడు. అప్పుడే లాస్య ఎంట్రీ ఇచ్చి నాకేం అభ్యంతరం లేదు వెళ్దామని అంటుంది. బుద్ధి తక్కువ అయి కారు పాడు చేసుకున్నా దాని శాపమే తగిలినట్టు ఉందని తిట్టుకుంటాడు. తులసి వెళ్ళి ఎక్కడ సామ్రాట్ పక్క సీట్ లో కూర్చుంటుందో ఏమో అని నందు పరుగున వెళ్ళి ఫ్రంట్ సీట్ లో కూర్చుంటాడు. నందు కాసేపటిలో తన మెడలో నెక్లెస్ వేయబోతున్నాడని లాస్య తెగ సంబరపడుతుంది. కాసేపు చుట్టూ ఉన్న వాళ్ళు మాయమైతే బాగుండు తులసికి నెక్లెస్ ఇచ్చే వాడిని ఒక భారం తగ్గుతుంది రుణం తీర్చుకున్న వాడిని అవుతానని మైండ్ లో మాట్లాడుకుంటాడు. ప్రేమ్ కేఫ్ లో గిటార్ వాయిస్తూ కస్టమర్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు.