Gruhalakshmi September 2nd Update: తులసిని బెదిరించిన నందు - అభి మీద ఫైర్ అయిన అంకిత, తులసివనం ఆగిపోయినట్టేనా?
తులసి మ్యూజిక్ స్కూల్ భూమి పూజ చెడగొట్టాలని లాస్య స్కెచ్ వేస్తుంది. కానీ అది బెడిసికొట్టి నందు తులసి మాజీ భర్త అనే నిజం బయటపడింది. దీంతో కథనం ఇంట్రస్టింగ్ గా సాగుతోంది.
తులసిని ఎవరు ఏమన్నా డానికి కారణం నేనేనా అని నందు ఫీల్ అవుతుంటాడు. అభిని రెచ్చగొట్టి సీన్ క్రియేట్ చేసింది నేనే అని తెలిస్తే నందు నా మీద యుద్ధం ప్రకటిస్తాడు గొడవ ఇంట దూరం వస్తుందని నేను అనుకోలేదు ప్లాన్ అంత మిస్ ఫైర్ అయ్యిందని లాస్య మనసులో అనుకుంటుంది. తులసి విషయంలో ఇక నేను జోక్యం చేసుకొను తన ఇంట్లో అడుగు పెట్టను అని నందు అంటాడు. అది కుడదరదు మాజీ భర్తవీ నువ్వు తను నీ మీద పగ తీర్చుకుంటుంది, చూశావ్ కదా సామ్రాట్ అండ చూసుకుని ఎలా నీతో సవాల్ చేసిందో అని లాస్య ఎక్కించేందుకు ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్ లో మన మొదటి అడుగు మళ్ళీ మనం సామ్రాట్ కంపెనీలో అడుగుపెట్టడమే అని లాస్య అంటుంది. సామ్రాట్ మళ్ళీ మనల్ని కంపెనీలోకి రానిస్తాడా అని నందు అంటే లాస్య ఏదో ప్లాన్ చెప్తుంది.
సామ్రాట్ కి అన్ని నిజాలు తెలిసిపోయాయి ఇప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ గా ఉందని అనసూయ అంటుంది. ఇప్పుడు తులసి ఏం చేస్తుందా అని ఆత్రంగా అడుగుతుంది. జరిగిన గొడవ తలుచుకుంటే చాలా బాధగా ఉంది కానీ జరిగింది ఏం చేస్తాం అని తులసి వేదాంతం మాట్లాడుతుంది. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలని అనుకుంటున్నా, ఆయన నా మాజీ భర్త అని దాచిపెట్టి సామ్రాట్ గారి దగ్గర నా నమ్మకాన్ని పోగొట్టుకున్నా, నేను స్వేచ్చగా ఎగరడం దేవుడికి కూడా ఇష్టం లేదు అందుకే నా రెక్కలు కత్తిరించాడని తులసి బాధపడుతుంది. జరిగింది అంతా మర్చిపోయి సామ్రాట్ దగ్గరకి వెళ్ళు నీ మ్యూజిక్ స్కూల్ మళ్ళీ స్టార్ట్ చెయ్యి, జరిగిన దాంట్లో తప్పు ఎవరిదో అంతా ఆయనకి చెప్పు ఆయనే చూసుకుంటారు అని అనసూయ తులసికి చెప్తుంది.
ఆ మాటలు విన్న అభి దాన్ని స్వార్థం అంటారు అని ఎంట్రీ ఇస్తాడు. తులసిని దెప్పిపొడుస్తూ ఉంటే అంకిత ఎంట్రీ ఇస్తుంది. కానీ నువ్వు ఆంటీని వేలెత్తి చూపించడం అసహ్యంగా ఉందని అంకిత అభికీ చురకేస్తుంది. తన జీవితం అంతా మనకోసం ధారపోసింది, ఇప్పుడు తనకోసం బతకాలని అనుకుంటుంది అది స్వార్థం అనరు రా న్యాయం అంటారు అని అనసూయ, పరంధామయ్య అంటారు. అమ్మ గురించి ఆలోచించకుండా వెళ్ళి అత్తగారింట్లో కూర్చున్నావ్ చూడు అది స్వార్థం అంటే అని అనసూయ కౌంటర్ వేస్తుంది. తప్పు నాదే ఆంటీ నేను ఇంటి బాధ్యతలు వదిలేసి మెడికల్ క్యాంప్ కి వెళ్ళకుండా ఉండి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని అంకిత తులసిని క్షమించమని అడుగుతుంది.
మ్యూజిక్ స్కూల్ నిర్ణయం వెనక్కి తీసుకోవడం అంటే ఓటమి ఒప్పుకున్నట్టే అని అనసూయ అంటుంది. సామ్రాట్ గారి ముందు ఇప్పుడు నేను దోషిని ఆయనకి నిజం చెప్పకుండా తప్పు చేశానని ఫీల్ అవుతుంది. నా జీవితాన్ని ఎవరు మార్చలేరని బాధపడుతుంది. అనసూయ నందుకి ఫోన్ చేస్తుంది. నువ్వు ఒక పని చెయ్యాలి, నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకోవాలి అని అనసూయ అంటుంది. నిన్ను వదిలేసి అమ్మ మళ్ళీ తులసిని పెళ్లి చేసుకోమని అంటుందని నందు అనసూయకి వినిపించకుండా లాస్యతో చెప్తాడు. అలా అడిగిందా నిన్ను అని లాస్య అంటుంది. సరిదిద్దుకోడానికి నాకు తెలిసి నేను ఏ తప్పు చెయ్యలేదని నందు అంటాడు. చేశావ్ తులసి మాజీ భర్తవీ అన్న నిజం సామ్రాట్ దగ్గర దాచామని తులసిని బతిమలాడుకున్నావ్, ఆవేశంలో ఆ నిజాన్ని బయటపెట్టుకుంది నువ్వు.. నువ్వు చేసిన పొరపాటుకు తులసి ఆయన ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ నిజం నువ్వే దాచామని చెప్పినట్టు సామ్రాట్ ముందు ఒప్పుకో’ అని అనసూయ అంటుంది. నిజం బయటపెట్టి సామ్రాట్ ముందు నేను దోషిలా నిలబడాలని అనుకోవడం లేదు, అయినా నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది నీ కడుపున పుట్టిన కొడుకు గురించి కొడాలి గురించి కాదని అంటాడు. చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నావ్ అని అనసూయ అంటుంది.
Also Read: యష్, వేదని విడదీసేందుకు అభిమన్యు కుట్ర - ఆదిత్యని ఖుషి స్కూల్ లో చేరాడని తెలిసి భయపడుతున్న మాలిని
గదిలోకి వచ్చిన తర్వాత అంకిత అభి మీద ఫైర్ అవుతుంది. నీకు సహాయం చెయ్యడం నీకు మంచి చెయ్యడం తప్ప ఏది ఆలోచించలేదు, పెద్ద కొడుకుగా తనకి సపోర్ట్ గా నిలబడాల్సింది పోయి పది ముందు తన పరువు తీస్తావా అని అంకిత కోప్పడుతుంది. నా ఉద్దేశం మామ్ పరువు తియ్యడం కాదు తన పరువు నిలబెట్టడం అని అభి సర్ది చెప్పేందుకు చేస్తాడు. ఆంటీ గురించి నీకు నచ్చకపోతే నాలుగు గోడల మధ్య చెప్పాలి అయినా ఆంటీని ప్రశ్నించే హక్కు నీకు లేదని అంకిత అంటుంది. నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది కన్నతల్లిని గౌరవించలేని వాడివి రేపు నన్ను కూడా అనుమానించవని నమ్మకం ఏంటి అని అంకిత నిలదిస్తుంది.
తరువాయి భాగంలో..
తులసి నందు దగ్గరకి వస్తుంది. మన ఇద్దరి మధ్య ఒక పెద్ద మనిషి తరహా ఒప్పందం ఉంది, నేను కొరబట్టే తులసి ఆ నిజాన్ని దాచింది అనే విషయం సామ్రాట్ గారికి చెప్పాలని తులసి అనేసరికి నందు, లాస్య పగలబడి నవ్వుతారు. సామ్రాట్ గారి అమ్మాయి హనీకి యాక్సిడెంట్ చేసింది నేనే అనే విషయం నువ్వు దాచావ్ కదా అది నేను ఇప్పుడు చెప్పేస్తా అనేసరికి తులసి షాక్ అవుతుంది.