అన్వేషించండి

Grammys Award 2023: ఇండియన్ కంపోజర్‌కు ముచ్చటగా మూడో గ్రామీ అవార్డు - భారత్‌కు అంకితం ఇస్తున్నట్లు వెల్లడి!

ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ మూడో గ్రామీ అవార్డును అందుకున్నారు. గతేడాది తను రూపొందించిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్ కు గాను ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

భారతీయ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ 64వ గ్రామీ అవార్డు వేడుకలో సత్తా చాటారు. ఇప్పటికే రెండు గ్రామీ అవార్డులను అందుకున్న ఆయన, తాజాగా మరో అవార్డును దక్కించుకున్నారు. 2022 బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీలో రాక్, రోల్ లెజెండ్ స్టీవర్ట్ కోప్‌ ల్యాండ్‌తో కలిసి రూపొందించిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్ కు ఈ అవార్డు దక్కింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సం వారు ఈ అవార్డును అందుకున్నారు. ఇప్పటికే  ఈ ఆల్బమ్ రోలింగ్ స్టోన్, బ్లూమ్‌ బెర్గ్, ది సండే గార్డియన్ సహా పలు వార్తల సంస్థలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ricky Kej (@rickykej)

ఇప్పటికే రెండు గ్రామీ అవార్డులు అందుకున్న రిక్కీ

రిక్కీ కేజ్ గతంలో బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీ కింద రెండు గ్రామీ అవార్డులను గెలుచుకున్నాడు. 2015లో తన ఆల్బమ్ ‘విండ్స్ ఆఫ్ సంసార’కు గాను ఆయన గ్రామీ అవార్డును అందుకున్నాడు.  2022లోనూ అతడిఆల్బమ్ ‘డివైన్ టైడ్స్’ గ్రామీ అవార్డును దక్కించుకుంది. బెంగుళూరుకు చెందిన రిక్కీ కేజ్-లెజెండ్ స్టీవర్ట్ కోప్‌ల్యాండ్ కలిసి ఈ ఆల్బమ్ ను రూపొందించారు.

గ్రామీ అవార్డు భారత్ కు అంకితం ఇస్తున్నా- రిక్కీ

ముచ్చటగా మూడోసారి ఈ అవార్డును అందుకోవడం పట్ల రిక్కీ సంతోషం వ్యక్తం చేశారు. “ఇప్పుడే నా 3వ గ్రామీ అవార్డును అందుకున్నాను. చాలా ధన్యాదాలు. నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. ఈ అవార్డును భారతదేశానికి అంకితం చేస్తున్నాను” అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ‘డివైన్ టైడ్స్‌’లో తొమ్మిది పాటలు వీక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తనకున్న పరిచయస్తులు తీసిన వీడియోలతో ఈ పాటలను రూపొందించినట్లు రిక్కీ వివరించారు. “మూడవ గ్రామీ అవార్డుకు నామినేట్ అయినందుకు చాలా థ్రిల్‌గా ఉంది. డివైన్ టైడ్స్ ఆల్బమ్ ఇప్పటి వరకు నా అత్యంత సృజనాత్మకమైన, విజయవంతమైన ఆల్బమ్స్ లో ఒకటి. దానికి వస్తున్న ప్రశంసలు నన్ను ఎంతో సంతోషం కలిగిస్తున్నాయి. స్టీవర్ట్ కోప్‌ ల్యాండ్, నేను కలిసి ‘డివైన్ టైడ్స్‌’ని రూపొందించాం. మా సంగీతం ద్వారా  ప్రేక్షకులను అందమైన ప్రదేశాలకు, అంతకు మించి అద్భుతమైన భావోద్వేగాలకు తీసుకెళ్లినట్లు ఆశిస్తున్నాం. ‘బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్' కోసం పడిన కష్టం, దక్కుతున్న ఆదరణతో మర్చిపోయేలా చేసింది” అని వెల్లడించారు.    

పర్యవరణవేత్తగానూ రిక్కీ కేజ్ కు గుర్తింపు

రిక్కీ కేజ్ మ్యూజిక్ కంపోజర్ గానే కాకుండా పర్యావరణవేత్తగానూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.  ఐక్యరాజ్య సమితి అతడిని గుడ్ విల్ అంబాసిడర్ గా నియమించింది. తన ఆల్బమ్స్ లోనూ ప్రకృతి గురించి, ప్రకృతి జరుగుతున్న ముప్పు గురించి ఆయన వివరించారు. పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి అంటారు రిక్కీ కేజ్.

Read Also: షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ డైరెక్టర్ సుధ కొంగర, డాక్టర్లు ఏం చెప్పారంటే?

టాప్ హెడ్ లైన్స్

Sai Durgha Tej Engagement : ఘనంగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడంటే?
ఘనంగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడంటే?
Friday OTT Streamings : శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అమన్‌కి ఫ్యామిలీ వీక్‌ చేసిన టాప్ కంటెస్టెంట్? మీ ఇంటి వంట తిన్నానంటూ ఎమోషనల్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అమన్‌కి ఫ్యామిలీ వీక్‌ చేసిన టాప్ కంటెస్టెంట్? మీ ఇంటి వంట తిన్నానంటూ ఎమోషనల్!
Ramayana Mistakes: మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?
మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friday OTT Streamings : శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
Tips To Soft Hair : జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తోందా? మృదువుగా, మెరిసేలా చేసే ఇంటి చిట్కాలు ఇవే
జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తోందా? మృదువుగా, మెరిసేలా చేసే ఇంటి చిట్కాలు ఇవే
AP MPTC ZPTC Elections: ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
Ramayana Mistakes: మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?
మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?
Stock Market Rally: మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
Dark Underarms : అండర్ ఆర్మ్స్ నల్లగా మారాయా? చంకల్లో నలుపుదనాన్ని తగ్గించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
అండర్ ఆర్మ్స్ నల్లగా మారాయా? చంకల్లో నలుపుదనాన్ని తగ్గించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
IND VS SL Vizag ODI :  ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన వన్డే మ్యాచ్.. భారత్ - లంక తొలి వన్డే వేదికపై బీసీసీఐ సంచలన నిర్ణయం, కార‌ణమిదే..!!
ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన వన్డే మ్యాచ్.. భారత్ - లంక తొలి వన్డే వేదికపై బీసీసీఐ సంచలన నిర్ణయం, కార‌ణమిదే..!!
Raptadu Student Gopika Health Update: మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
Embed widget